E-Paper
Advertisement

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్.. మూడు నౌకలపై ఇరాన్ దాడి, తిప్పికొట్టినట్టు ట్రంప్ ప్రకటన

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్.. మూడు నౌకలపై ఇరాన్ దాడి, తిప్పికొట్టినట్టు ట్రంప్ ప్రకటన
Advertisement

Strait of Hormuz: పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? పర్షియన్‌ గల్ఫ్‌ వేదికగా ఇరు దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయా? కాల్పుల విరమణ ఒప్పందం పేరిట కాల్పులకు దిగుతున్నాయా? ఇరాన్‌ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేసిన కొన్ని గంటలకే తాజాగా దాడుల వ్యవహారం కలకలం రేపుతోందా? మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చినట్టేనా?

హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్.. మూడు నౌకలపై ఇరాన్ దాడి

Advertisement

హర్ముజ్‌ జలసందిలో గురువారం రాత్రి అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ విరుచుకుపడింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్‌, మాసన్‌ లక్ష్యంగా దాడులు చేసింది ఇరాన్.  అప్రమత్తమైన అమెరికా బలగాలు, ఇరాన్‌లోని క్షిపణి లాంచ్‌ సైట్లు, కమాండ్‌ సెంటర్లపై దాడులు తీవ్రతరం చేశాయి.

దాడుల విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ధృవీకరించారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని, ఇప్పుడు జరిగినవాటిన చిన్నస్థాయి దాడులు పేర్కొన్నారు. ఇదిలావుండగా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. శాంతి ఒప్పందంపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రంగా బదులిస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు.

Advertisement

తిప్పికొట్టినట్టు ట్రంప్ ప్రకటన.. అమెరికా వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్

ఆదేశంలో ఫలప్రదమైన చర్చలు జరిగాయని ట్రంప్ ప్రకటించిన 24 గంటల్లో ఇరు దేశాల బలగాల మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకోవడంపై మళ్లీ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. తమ బలగాలు జరిపిన ప్రతిదాడిలో ఇరాన్ దళాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. ఇరుదేశాల మధ్య ఈ స్థాయిలో కాల్పులు జరుగుతున్నా, కాల్పుల విరమణ ఇప్పటికీ అమల్లో ఉందని ట్రంప్ చెబుతున్నారు.

ఇదిలాఉండగా అమెరికా చేస్తున్న ఆరోపణలను ఖండించింది ఇరాన్. కాల్పుల విరమణను ఉల్లంఘించి తమ నూనె ట్యాంకర్లు తీసుకెళ్తున్న రెండు నౌకలపై అమెరికా దాడి చేసిందని వెల్లడించింది. దానికి కౌంటర్‌గానే అమెరికా నౌకలపై దాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చెబుతున్నమాట.

ALSO READ: చైనాలో సంచలనం.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష..!

ఇదేగాకుండా టెహ్రాన్, బందర్ అబ్బాస్ వంటి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు జరిగినట్టు స్థానిక మీడియా చెబుతోంది. శాంతి చర్చలు ఏమోగానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గు ముఖం కనిపించే పరిస్థితి లేదని అంటున్నారు కొందరు అంతర్జాతీయ నిపుణులు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×