E-Paper
Advertisement

LG OLED evo vs Non-evo: థియేటర్ రేంజ్ క్వాలిటీ.. పిక్చర్ నాణ్యతలో తగ్గేదేలే.. రెండింటిలో ఏది బెస్ట్!

LG OLED evo vs Non-evo: థియేటర్ రేంజ్ క్వాలిటీ.. పిక్చర్ నాణ్యతలో తగ్గేదేలే.. రెండింటిలో ఏది బెస్ట్!
Advertisement

LG OLED evo vs Non-evo: అత్యంత నాణ్యమైన టీవీల్లో LG OLEDలకు మంచి గుడ్ విల్ ఉంది. రీసెంట్ గా ఎల్జీ తీసుకొచ్చిన ‘evo’ టెక్నాలజీ.. టీవీల డిస్ ప్లేను మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి. యూజర్ల నుంచి ‘evo’ టీవీలకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో LG evo – non-evo OLED టీవీలకు మధ్య ఫీచర్ల పరంగా ఉన్న ప్రధాన తేడాలు? రెండింటిలో ఏది కొంటే బెటర్? అన్నది ఈ కథనంలో పరిశీలిద్దాం.

డిస్‌ప్లే బ్రైట్‌నెస్, ప్యానెల్ టెక్నాలజీ

LG ‘evo’ ప్యానెల్ లో క్రేజీ ఫీచర్ ఏదైనా ఉందంటే అది దాని అద్భుతమైన బ్రైట్‌నెస్. సాధారణ OLED టీవీలతో పోలిస్తే.. evo మోడల్స్‌లో కొత్త తరం ‘Deuterium’ (డ్యూటీరియం) పదార్థాన్ని ఉపయోగించారు. ఇది ప్యానెల్ ఎక్కువ వేడిని తట్టుకునేలా చేయడంతో పాటు.. పిక్సెల్స్ మరింత ప్రకాశవంతంగా ఉండేందుకు సాయపడుతుంది. దీనివల్ల సాధారణ OLED టీవీల కంటే ఇవి సుమారు 20% నుండి 30% వరకు ఎక్కువ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి.

ప్రాసెసింగ్ పవర్, AI సామర్థ్యం

Advertisement

సాధారణంగా టీవీల పనితీరులో ప్రాసెసర్ కీలక పాత్ర పోషిస్తుంది. LG తన ‘evo’ శ్రేణి టీవీలలో అత్యంత శక్తివంతమైన Alpha 11 AI వంటి లేటెస్ట్ ప్రాసెసర్లను ఫిక్స్ చేసింది. ఈ ప్రాసెసర్లు కృత్రిమ మేధస్సు (AI) సాయంతో పాత కంటెంట్‌ను 4K స్థాయికి అప్‌స్కేల్ చేయడమే కాకుండా రంగులను మరింత సహజంగా మారుస్తాయి. మరోవైపు నాన్ ఎవో మోడల్స్ ఇందుకు పూర్తి భిన్నంగా తక్కువ సామర్థ్యం ఉన్న ప్రాసెసర్లతో పనిచేస్తుంది.

డిజైన్, స్టైలిష్ ఫినిషింగ్

ఎల్జీ ఎవో, నాన్ ఎవో ఒలెడ్ టీవీలకు డిజైన్ పరంగా స్ఫష్టమైన తేడా ఉంది. LG evo మోడల్స్.. ముఖ్యంగా ‘G’ (Gallery) సిరీస్ అత్యంత స్లిమ్ గా ఉండి గోడకు అతుక్కుపోయేలా డిజైన్ చేశారు. ఇవి టీవీ లాగా కాకుండా గోడపై ఉన్న ఒక అందమైన పెయింటింగ్‌లా కనిపిస్తాయి. Non-evo మోడల్స్ కూడా సన్నగానే ఉన్నప్పటికీ వాటి వెనుక భాగంలో సర్క్యూట్ బాక్స్ కొంచెం బయటకు కనిపిస్తుంది. ప్రీమియం లుక్, ఫ్రేమ్ లెస్ అనుభవం కావాలనుకునే వారికి evo మోడల్స్‌ బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు.

Advertisement

Also Read: Fridge Problems: మీ ఫ్రిజ్ కూల్ కావట్లేదా? పాడవడానికి ముందు వచ్చే డేంజర్ సిగ్నల్స్!

ఏది కొంటే బెటర్?

లివింగ్ రూమ్‌లో కిటికీలు ఎక్కువగా ఉండి పగటిపూట టీవీ చూస్తుంటే ‘evo’ ప్యానెల్ బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. దీని హై బ్రైట్‌నెస్ గదిలోని వెలుతురును తట్టుకుని స్పష్టమైన చిత్రాలను చూపిస్తుంది. గేమింగ్ కు కూడా ‘evo’ మోడల్స్ అద్భుతంగా ఉంటాయి. వీటిలో బొమ్మలు చాలా రియలిస్టిక్ గా ఉండటంతో పాటు సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయి. తక్కువ ధరలో OLED క్వాలిటీ కావాలనుకునే వారికి Non evo బెస్ట్ ఆప్షన్. ఎక్కువగా రాత్రిపూట లేదా తక్కువ వెలుతురు ఉన్న బెడ్‌రూమ్‌లో టీవీ చూస్తుంటే సాధారణ OLED కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. కేవలం వార్తలు, సీరియల్స్ లేదా సాధారణ స్ట్రీమింగ్ కోసం అయితే ఎక్కువ ధర పెట్టి ‘evo’ కొనాల్సిన అవసరం లేదు.

Also Read: Oppo Find X9 Ultra: ఈ ఫోన్ బాగా గుర్తుపెట్టుకోండి.. కెమెరానే హైలెట్.. త్వరలో సంచలనం కావడం పక్కా..!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×