E-Paper
Advertisement

Jeevan Reddy Resigns: కాంగ్రెస్‌తో దశాబ్దాల బంధం తెగింది.. విధి లేని పరిస్థితుల్లో, జీవన్‌‌రెడ్డి వివరణ

Jeevan Reddy Resigns: కాంగ్రెస్‌తో దశాబ్దాల బంధం తెగింది.. విధి లేని పరిస్థితుల్లో, జీవన్‌‌రెడ్డి వివరణ
Advertisement

Jeevan Reddy Resigns: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల బంధాన్ని తెంచుకున్నారు సీనియర్ రాజకీయ నాయకుడు జీవన్‌రెడ్డి. మద్దతుదారుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చారు ఆయన. ఇంతకీ ఆయన చెప్పిన విషయాలపై ఓ లుక్కేద్దాం.

కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల బంధాన్ని తెంచుకున్న జీవన్‌రెడ్డి

Advertisement

తెలంగాణ సీనియర్ జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ పార్టీతో ఆయనకు దాదాపు 42 ఏళ్ల బంధం తెగిపోయింది. బుధవారం జగిత్యాలలో మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సభలో రాజీనామా లేఖను బయటపెట్టారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో క్లియర్‌గా వివరించారు.

కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాను ఊహించలేదన్నారు జీవన్‌రెడ్డి.  విధి లేని పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను రోడ్డు ఎక్కితే ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10 స్థానాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించారని ఆరోపించారు. ఇష్టానికి భిన్నమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన.

Advertisement

విధి లేని పరిస్థితుల్లో రాజీనామా.. మద్దతుదారులకు జీవన్‌‌రెడ్డి వివరణ

పార్టీలో మధుయాష్కి, చిన్నారెడ్డి వంటి సీనియర్లు ఉన్నారని, వారిని కాదని వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. పార్టీలో సీనియర్లను గౌరవించాల్నారు. గడిచిన రెండేళ్లుగా కాంగ్రెస్‌లో ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని మనసులోని మాట బయటపెట్టారు. తనకు అండగా ప్రభుత్వం, పార్టీ లేదన్నారు.

తాను శాసనమండలి సభ్యుడ్ని అని, తాను ముఖ్యమంత్రితో హోదా పొందే స్థాయి కాదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. మహేష్‌కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ఏమైందని సూటిగా లేవనెత్తారు. పోరాటాలు చేయడం తనకు కొత్తకాదన్నారు. చివరకు కార్యకర్తల హక్కులు కాపాడలేక పోయానని అన్నారు. ఇంకా సంయమనం పాటించాలా? అదే సమయంలో దానం వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.  మరి ఇప్పుడు జీవన్‌రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తున్నారు? బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారా? లేకుంటే బీజేపీలో అడుగు పెడతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ALSO READ: మొండి బకాయిలపై అధికారుల కొరడా.. సీజ్ అవుతున్న భారీ మాల్స్, హోటళ్లు!

 

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×