E-Paper
Advertisement

LG vs Samsung Fully Automatic: ఎల్జీ vs శాంసంగ్.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లలో.. ఫీచర్ల పరంగా దేనిది పైచేయి?

LG vs Samsung Fully Automatic: ఎల్జీ vs శాంసంగ్.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లలో.. ఫీచర్ల పరంగా దేనిది పైచేయి?
Advertisement

LG vs Samsung Fully Automatic: శాంసంగ్, ఎల్జీ కంపెనీకి చెందిన వాషింగ్ మిషన్లకు మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉంది. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ వేరియంట్ లో పెద్ద సంఖ్యలో ఈ రెండు కంపెనీల వాషర్లు సేల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 7 kg Fully Automatic సెగ్మెంట్ లో ఎల్జీ, శాంసంగ్ కంపెనీల వాషింగ్ మిషన్ల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ‘LG 7 Kg Front Load vs Samsung 7 Kg Front Load’ నువ్వా నేనా అన్నట్లు మార్కెట్ లో పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండింటిలో ఏది కొనాలో తెలియక వినియోగదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఈ రెండు వాషింగ్ మిషన్ల ఫీచర్లు, ధర పరంగా ఏది కొంటే బెటరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వాష్ టెక్నాలజీ..

LG 7 Kg Front Load వాషింగ్ మిషన్.. AI Direct Drive (AI DD) టెక్నాలజీతో పని చేస్తుంది. బట్టల బరువు, ఫాబ్రిక్‌ను గుర్తించి ఆటోమేటిక్‌గా వాష్ మోషన్ సెట్ చేసుకుంటుంది. 6 రకాల డ్రమ్ మోషన్లు ఉండటం వల్ల బట్టలకు తక్కువ డ్యామేజ్, మెరుగైన క్లీనింగ్ అందిస్తుంది. ఇక శాంసంగ్ 7 Kg Front Load విషయానికి వస్తే ఇది EcoBubble Technologyతో పనిచేస్తుంది. డిటర్జెంట్‌ను బుడగల రూపంలో మార్చి లోతుగా క్లీన్ చేస్తుంది. Digital Inverter Motor, హైజీన్ స్టీమ్ ద్వారా 99.9% బ్యాక్టీరియా తొలగిస్తుంది.

విద్యుత్ వినియోగం..

Advertisement

సాధారణంగా వాషింగ్ మిషన్ కొనేటప్పుడు చాలా మందికి విద్యుత్ వినియోగంపై కాస్త ఆందోళన ఉంటుంది. అయితే ఎల్జీ, శాంసంగ్ వాషింగ్ మిషన్లు రెండూ కూడా 5 Star Energy Rating కలిగి ఉన్నాయి. వీటిలోని Inverter టెక్నాలజీ వల్ల పవర్ సేవింగ్ బాగుంటుంది. కాబట్టి ఇతర వాషింగ్ మిషన్లతో పోలిస్తే విద్యుత్ వినియోగాన్ని ఈ రెండు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు పరిమితం చేస్తాయి.

డ్యూరబిలిటీ, మోటార్ వారంటీ

కొత్త వాషింగ్ మిషన్ కొనేటప్పుడు దాని పనితీరుతో పాటు వారంటీని సైతం ప్రతీ ఒక్కరు పరిశీలిస్తారు. ఆ పరంగా చూస్తే ఎల్జీ, శాంసంగ్ వాషింగ్ మిషన్లు రెండూ 10 ఏళ్ల వారంటీతో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫీచర్లు..

Advertisement

ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ThinQ Appను ఉపయోగించి.. దీనిని ఫోన్ ద్వారానే స్మార్ట్ కంట్రోల్ చేయవచ్చు. రిమోట్ కంట్రోల్, వాయిస్ కంమాడ్స్ సైతం ఇవ్వవచ్చు. శాంసంగ్ కంపెనీకి చెందిన వాషింగ్ మిషన్… స్మార్ట్ థింగ్స్ యాప్ (SmartThings App)కు సపోర్ట్ చేస్తుంది. WiFi Controlతో పాటు 15 నిమిషాల్లో క్విక్ వాష్ సదుపాయం కూడా ఉంది.

నాయిస్ అండ్ వైబ్రేషన్

ఎల్జీ కంపెనీ వాషింగ్ మిషన్.. డైరెక్ట్ డ్రైవ్ మోటార్ తో పనిచేస్తుంది. ఇది వైబ్రేషన్ ను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. మరోవైపు శాంసంగ్ ఫ్రంట్ లోడ్ లోనూ శబ్దం కాస్త తక్కువే అయినప్పటికీ ఈ అంశంలో ఎల్జీ కాస్త పైచేయి సాధిస్తుందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ధర పరంగా..

ధరల విషయానికి వస్తే ఎల్జీ 7కేజీ ధర మార్కెట్ లో రూ. 26,000-32,000 మధ్య ఉంది. శాంసంగ్ వాషింగ్ మిషన్ రూ. 25,000 – 31,000 మధ్య పలుకుతోంది.

Also Read: Best Ceiling Fans 2026: ఏఐతో పనిచేసే స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్స్.. ఈ సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్.. ఏమున్నాయ్ బాసు!

ఓవరాల్‌గా ఏది బెటర్?

మంచి క్లీనింగ్, హైజీన్, తక్కువ స్పేస్ కోరుకునే వారు LG 7 Kg Front Loadను పరిశీలించవచ్చు. అలా కాకుండా ఎనర్జీ సేవింగ్, స్మార్ట్ కనెక్టివిటీ, ఫాస్ట్ వాష్ (15 నిమిషాల్లో) కావాలంటే శాంసంగ్ బెస్ట్ అని చెప్పవచ్చు. మీ అవసరాన్ని, అభిరుచిని బట్టి రెండింటిలో మంచి వాషింగ్ మిషన్ ను మీరే ఎంచుకోండి.

Also Read: Andhra Earthquake: ఏపీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు.. రాబోయే ఐదు రోజుల్లో..!

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

Big Stories

Advertisement
×