E-Paper
Advertisement

Andhra Earthquake: ఏపీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు.. రాబోయే ఐదు రోజుల్లో..!

Andhra Earthquake: ఏపీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు.. రాబోయే ఐదు రోజుల్లో..!
Advertisement

Andhra Earthquake: ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చాయి. భూమికి 10 కి.మీ లోతులో కదలికలు చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ధ్రువీకరించింది. రిక్టర్ స్కేలుపై 3.5గా ప్రకంపనల తీవ్రత నమోదైనట్లు ప్రకటించింది.

గురువారం తెల్లవారుజామున 2:35 గంటల ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వినుకొండతో పాటు దర్శి దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ప్రకంపనలను ఫేస్ చేసినట్లు సమాచారం. ఇంట్లోని వస్తువులు నెమ్మదిగా కదిలిపోవడం చూసి ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పలువురు ఇంట్లో నుంచి బయటకు పరుగులు సైతం పెట్టినట్లు తెలిసింది.

Advertisement

ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు భూకంప కేంద్రం 46 కి.మీ దూరంలో ఉంది. అక్కడి ప్రజలు సైతం స్వల్ప ప్రకంపనలు గమనించినట్లు తెలుస్తోంది. వినుకొండ, దర్శితో పాటు మాచర్ల, పిడుగురాళ్ల, అద్దంకి, చిలకలూరిపేట, సత్తెనపల్లి ప్రాంతంలోనూ గుర్తించలేని స్థాయిలో అతి చిన్నగా కదలికలు వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే రాబోయే ఐదు రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: Karnataka Crime: ఐదేళ్ల ప్రేమలో ఏం జరిగింది? ప్రియురాల్ని చంపి ఆపై ప్రియుడు, మరో విషయం ఏంటంటే..

కాగా, గతేడాది నవంబర్ లో విశాఖపట్నంలోనూ ఈ తరహాలో స్వల్ప భూకంపం సంభవించింది. నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. అల్లూరిజిల్లా జీ మాడుగల ప్రాంతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వైజాగ్ లోని గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి తదితర ఏరియాల ప్రజలు ఈ భూప్రకంపనలను ఫేస్ చేశారు.

Also Read: Gundeninda GudiGantalu Today episode: శృతికి సారీ చెప్పిన రవి.. ముసలోళ్ళుగా మారిన మీనా, బాలు..రోహిణి ప్లాన్ రివర్స్..

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×