iPhone Theft Loss AppleCare| ఇండియాలో ఐఫోన్ వాడుతున్నవాళ్లకి ఆపిల్ కంపెనీ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు మీ ఐఫోన్ దొంగతనమైనా, మీరు ఎక్కడో పోగొట్టుకున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఆపిల్ కొత్త ఐఫోన్ ఇచ్చేస్తుంది! ఇదంతా ఆపిల్ కొత్త ప్లాన్ అయిన (ఆపిల్ థెఫ్ట్ అండ్ లాస్) “AppleCare+ Theft and Loss” లో ఒక భాగం. ఇప్పటికే ఉన్న ఆపిల్ కేర్ ప్లస్ ఇది అప్‌గ్రేడ్ ప్లాన్. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌కు పూర్తి భద్రత ఇస్తున్న మొట్టమొదటి ప్లాన్ ఇదే. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఐఫోన్ యూజర్లు ఈ ప్లాన్ కోసం నెలవారీగా లేదా వార్షిక ప్లాన్ ఏదైనా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
మీ ఐఫోన్ పోతే కొత్త ఐఫోన్ ఇస్తారు (సేమ్ మోడల్ లేదా సేమ్ సిరీస్ లో ఇతర మోడల్)
సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు
అన్‌లిమిటెడ్ రిపేర్లు (ఫోన్ పగిలినా, నీటిలో పడినా ఏమైనా సరే)
బ్యాటరీ మార్చడం ఫ్రీ
ఒరిజినల్ ఆపిల్ పార్ట్స్ మాత్రమే ఉపయోగిస్తారు
24 గంటలూ 7 రోజులూ ప్రయారిటీ సపోర్ట్ ఉంటుంది
నెలకి కేవలం రూ.799 నుంచి మొదలవుతుంది. లేదా రెండేళ్ల ప్లాన్ ఒకేసారి చెల్లించవచ్చు. ప్లాన్ ధర మోడల్‌ని బట్టి ఉంటుంది. రెండేళ్ల ప్లాన్ ధర వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ SE (iPhone SE) – రూ.10,900
ఐఫోన్ 16 / 17 (iPhone 16 / 17) – రూ.14,900
ఐఫోన్ 16 ప్లాస్ (iPhone 16 Plus) – రూ.17,900
ఐఫోన్ 16 ప్రో ( iPhone 16 Pro, Pro Max, Air) – రూ.20,900
ఈ ఆపిల్ కేర్ ప్లాన్ ఐఫోన్లతో పాటు ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచీలకు కూడా వర్తిస్తుంది. వీటి ప్లాన్ ధరల కోసం ఆపిల్ ఆధికారిక వెబ్‌సైబ్‌లో చెక్ చేయండి.
మీ ఐఫోన్‌లో “Find My iPhone” ఆన్ ఉండాలి
పోలీస్ స్టేషన్‌లో FIR ఫిర్యాదు తప్పనిసరిగా చేయాలి.
FIR కాపీ ఆపిల్‌కి పంపించాలి
అదే ఆపిల్ IDతోనే క్లెయిమ్ చేయాలి
ప్రతిసారి కొంచెం సర్వీస్ ఫీజు కట్టాలి (చాలా తక్కువే)
ఆపిల్ అఫీషియల్ వెబ్‌సైట్ లేదా మీ ఐఫోన్ సెట్టింగ్స్ – AppleCare+ నుంచి సులభంగా కొనొచ్చు. కొనగానే అదే రోజు నుంచి కవరేజ్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఐఫోన్ ఉపయోగించే యూజర్లు ఒక్కసారి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దొంగతనమైనా, జేబులోంచి జారిపోయినా… ఆపిల్ మీకు కొత్త ఐఫోన్ ఇచ్చేస్తుంది! ఈ అదిరిపోయే ఆఫర్‌ని మిస్ చేయకండి. వెంటనే ప్లాన్ తీసుకోండి.
Also Read: గూగుల్ కొత్త టివి రిమోట్.. బ్యాటరీలు అవసరం లేదు, జీవితకాలం చార్జింగ్‌లోనే ఉంటుంది