E-Paper
Advertisement

Bandana Girl: రాత్రికి రాత్రే సెలబ్రిటీ.. బందానా గర్ల్ సెల్ఫీ వీడియో, 2 సెకన్ల క్లిప్‌కు 10 కోట్ల వ్యూస్

Bandana Girl: రాత్రికి రాత్రే సెలబ్రిటీ.. బందానా గర్ల్ సెల్ఫీ వీడియో, 2 సెకన్ల క్లిప్‌కు 10 కోట్ల వ్యూస్
Advertisement

Bandana Girl: సోషల్ మీడియా వచ్చిన రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయినవాళ్లు చాలామంది ఉన్నారు.. ఉంటున్నారు కూడా. వారి పెట్టిన చిన్న వీడియో క్లిప్ వైరల్ అయిన సందర్భాలు లేకపోలేదు. చాలా మంది ఎన్నాళ్లు కష్టపడినా ఎలాంటి ఫలితం లభించదు. కానీ, బందనా గర్ల్ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు మేటరేంటి?

రాత్రికి రాత్రే ఆ యువతి సెలబ్రిటీ

Advertisement

తమ టాలెంట్ నిరూపించుకోవడానికి రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు నేటి తరం యువతీ యువకులు. అందుకోసం వారు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్బాలు లేకపోలేదు. కానీ పైన కనిపిస్తున్న యువతి పేరు కాసేపు పక్కనబెడితే ఆమె ప్రస్తుతం బంధనా గాళ్ అంటూ ముద్దుగా పిలుచుకోవడం నెటిజన్స్ వంతైంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అవుతుందో ఊహించడం చాలా కష్టం. ఓ సాధారణ భారతీయ యువతి రెండు సెకన్ల వీడియో పోస్ట్ చేసింది. తొలుత వెయ్యి వ్యూస్ వస్తే చాలని భావించింది. ఆ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌కు ఏకంగా 10.8 కోట్లు (108 మిలియన్లు) వ్యూస్ వచ్చాయి. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.

Advertisement

రెండు నిమిషాల క్లిప్..  10 కోట్ల వ్యూస్

ఇంతకీ ఆ వీడియో క్లిప్‌లో ఏముంది? అన్నదే అసలు మేటర్. ఆటోలో ప్రయాణిస్తున్న ఆ యువతి.. తలకు బందానా కట్టుకుంది. తెల్లటి దుస్తుల్లో లైట్‌గా నవ్వుతూ కెమెరా వైపు చూసిన దృశ్యం ఉంది. ఇవాళ మేకప్ చాలా బాగా కుదిరింది అనే చిన్న క్యాప్షన్‌ పెట్టింది. అంతకుమించి ఆ క్లిప్‌లో ఎలాంటి ప్రత్యేకత లేదు. కాకపోతే సహజమైన లుక్, లైట్ స్మైల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

దీంతో ఆ యువతిని ‘బందానా గర్ల్’గా మార్చేశారు నెటిజన్స్. అనే పేరు వచ్చింది. మీడియా కథనాల మేరకు యువతి పేరు ప్రియాంక‌. తన వీడియో గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తుండగా ఆటోలో లైటింగ్ బాగుందని భావించి, సరదాగా ఆ వీడియో తీశానని తెలిపింది. తొలుత ఆ వీడియో 1000 వ్యూస్ వస్తే బాగుంటుందని భావించానని తెలిపింది.

ALSO READ: టైమ్‌కి ఆఫీసుకు రావాలన్న బాస్.. దారుణంగా కొట్టించిన మహిళ

కానీ ఇంతలా వైరల్ అవుతుందని ఊహించలేదని పేర్కొంది. ఈ పాపులారిటీతో సోషల్‌మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది. కంటెంట్‌ను సృష్టించే శక్తి తనలో ఉందో లేదో తెలియదని చెప్పుకొచ్చింది. అయితే ఈ యువతికి బ్లూ టిక్ హోదాని ఎక్స్ ఇచ్చినట్టు వార్తలు లేకపోలేదు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×