E-Paper
Advertisement

Power Saving Tips: వేసవిలో కరెంట్ బిల్లు తగ్గించడానికి ఈజీ టిప్స్.. ఖర్చు లేకుండానే కూల్ కూల్

Power Saving Tips: వేసవిలో కరెంట్ బిల్లు తగ్గించడానికి ఈజీ టిప్స్.. ఖర్చు లేకుండానే కూల్ కూల్
Advertisement

Summer Power Saving Tips| వేసవి కాలంలో విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరిగిపోతాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు నిరంతరం ఆన్‌లోనే ఉంటాయి. దీంతో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా కరెంట్ బిల్లు చలికాలం కంటే రెండింతలకు పైగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చిన్న చిన్న అలవాట్లతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి బిల్లులను నియంత్రించవచ్చు. ఈ సాధారణ చిట్కాలు వేసవిలో కరెంట్ బిల్లు తగ్గించడంలో సహాయపడతాయి.

ఎయిర్ కండిషనర్‌ సరిగ్గా ఉపయోగించండి

ఎయిర్ కండిషనర్లు చాలా విద్యుత్ వాడతాయి. సరైన ఉపయోగంతో బిల్లులను గణనీయంగా తగ్గించవచ్చు. వీలైనంతగా ఏసీ టెంపరేచర్ 24 డిగ్రీ  నుంచి 26 డిగ్రీ  మధ్యలో ఉంచండి. చాలా మంది 18°C సెట్ చేస్తారు. అలా చేస్తే ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. ఒక డిగ్రీ పెంచితే సుమారు 6 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయండి. ఫ్యాన్ చల్లని గాలిని గది అంతటా సమానంగా వ్యాప్తి చేస్తుంది. దీంతో ఏసీ భారం తగ్గుతుంది. ఏసీ ఫిల్టర్‌ను ప్రతి 15 రోజులకు శుభ్రం చేయండి. ఫిల్టర్‌లో దుమ్ము, మురికి పేరుకుపోవడం వల్ల మోటార్ పై ఒత్తిడి పడుతుంది. దీంతో విద్యుత్ ఖర్చు పెరుగుతుంది.

చల్లదనం కోసం ప్రకృతి పరమైన సహజపద్ధతులు

Advertisement

ఏసీలు, కూలర్లు లేకున్నా సహజ పద్ధతుల్లో గదిని చల్లగా చేయెచ్చు. సహజంగా గదిని చల్లగా ఉంచడం వల్ల ఏసీ అవసరం తగ్గుతుంది. పగటిపూట బలమైన ఎండ వచ్చే సమయంలో కర్టెన్స్ మూసేయండి. మందమైన లేదా చీకటి రంగు కిటికీ, డోర్ కర్టెన్స్ ఉపయోగించండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్టెన్స్ మూసి ఉంచండి. సాయంత్రం బయట ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కిటికీలు తెరవండి. చల్లని గాలి లోపలికి రావడంతో గదిని సహజంగా చల్లగా ఉంచుతుంది. టాప్ ఫ్లోర్ ఇళ్లలో ఎక్కువ వేడి ఉంటుంది. మీ రూఫ్ టాప్ అంటే పైకప్పును తెల్లటి రిఫ్లెక్టివ్ పెయింట్‌తో పూయడం వల్ల వేడి తక్కువగా లోపలికి వస్తుంది.

ఉపయోగంలో లేని ఉపకరణాలను ఆఫ్ చేయండి

చాలా ఉపకరణాలు రిమోట్‌తో ఆఫ్ చేసినా స్టాండ్‌బై మోడ్‌లో విద్యుత్ వినియోగిస్తాయి. టీవీ, చార్జర్లు, మైక్రోవేవ్‌లు ఇలాగే విద్యుత్ తీసుకుంటాయి. ఉపయోగం లేనప్పుడు ప్లగ్ తీసేయండి. ఈ చిన్న అలవాటు వల్ల అనవసర విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

ఫ్రిజ్‌ను సరిగ్గా ఉపయోగించండి

Advertisement

ఫ్రిజ్ రోజంతా నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినియోగిస్తే విద్యుత్ ఆదా అవుతుంది. ఫ్రిజ్‌ను గోడ నుంచి కనీసం 6 అంగుళాల దూరంలో ఉంచండి. దీంతో వేడి సులభంగా బయటకు వెళ్తుంది. సమ్మర్ మోడ్ ఉంటే దాన్ని ఆన్ చేయండి. తరచూ తలుపు తెరవకండి. వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. ముందు చల్లబరచి పెట్టండి.

Also Read: మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఏసీ లాంచ్.. ఇన్‌స్టాలేషన్, కాపర్ వైర్, స్టాండ్ అన్నీ ఫ్రీ

ఎనర్జీ ఎఫిషియెంట్ LED బల్బులు ఉపయోగించాలి

పాత బల్బులు, ట్యూబ్ లైట్లు ఎక్కువ విద్యుత్ వాడతాయి. వాటిని తొలగించి LED బల్బులతో మార్చండి. LED బల్బులు తక్కువ విద్యుత్‌తో ఎక్కువ లైటింగ్ ఇస్తాయి. పైగా ఎక్కువ కాలం పాటు పనిచేస్తాయి. ఇది దీర్ఘకాలంలో డబ్బు ఆదా చేస్తుంది.

చిన్న అలవాట్లతో పెద్ద మార్పు

విద్యుత్ బిల్లులు తగ్గించడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదు. రోజువారీ చిన్న అలవాట్లు చాలా ఆదా చేస్తాయి. ఉపకరణాలను సమర్థవంతంగా వినియోగించడం.. సహజ చల్లదన పద్ధతులు అనుసరించడం వల్ల ఏసీపై ఆధారపడకుండా ఇల్లు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్మార్ట్ అలవాట్లతో వేసవిలో డబ్బు ఆదా చేయవచ్చు.

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×