E-Paper
Advertisement

Cooking Cost: ఎల్‌పీజీ vs ఇండక్షన్ vs హైడ్రోజన్.. సామాన్యుల వంటగదికి.. ఏది బెస్ట్ ఛాయిస్?

Cooking Cost: ఎల్‌పీజీ vs ఇండక్షన్ vs హైడ్రోజన్.. సామాన్యుల వంటగదికి.. ఏది బెస్ట్ ఛాయిస్?
Advertisement

Cooking Cost: గడిచిన దశాబ్దాల కాలంలో వంటగదిలో విఫ్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు కట్టెలతో వంట చేసుకున్న స్థితి నుంచి ఇప్పుడు కరెంట్ తో ఆహారాన్ని వండుకునే స్థితికి వచ్చేశాం. అయితే ఆహారాన్ని వండుకోవడంలో ప్రస్తుతం మూడు రకాల పద్దతులను సామాన్యులు అనుసరిస్తున్నారు. ఎల్‌పీజీ, ఇండక్షన్ స్టవ్ లతో పాటు కొత్తగా వస్తోన్న హైడ్రోజన్ టెక్నాలజీపై ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి మధ్య వ్యత్యాసాలు? నెలవారీ ఖర్చు? డబ్బు ఆదా పరంగా ఏది బెటరో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎల్‌పీజీ (వంట గ్యాస్)

దేశంలో అత్యధిక మంది ఎల్ పీజీ గ్యాస్ ను వినియోగిస్తున్నారు. అయితే ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు.. అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి నిరంతరం మారుతుంటాయి. ప్రస్తుతం దేశంలో ఒక సిలిండర్ ధర దాదాపు రూ.900-1,100 మధ్య ఉంది. ముగ్గురు లేదా నలుగురు ఉన్న కుటుంబానికి ఇది నెల రోజులు వస్తుంది.

ఇండక్షన్ స్టవ్

Advertisement

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్ పీజీ కొరత ఏర్పడి ఇండక్షన్ స్టవ్ వినియోగం భారీగా పెరిగింది. అయితే గ్యాస్ సిలిండర్ ఖర్చుతో పోలిస్తే.. ఇండక్షన్ స్టవ్ పై కొద్దిమేర డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ పై రోజుకు 1.5 – 2 యూనిట్ల విద్యుత్ వాడితే నెలకు సుమారు రూ.700 – 900 ఖర్చు అవుతుంది. రాష్ట్రాల్లోని విద్యుత్ బిల్ ను బట్టి LPGతో పోలిస్తే ఇండక్షన్ స్టవ్స్ 30-40 శాతం చౌకగా ఉండే అవకాశం ఉంది.

హైడ్రోజన్ (Hydrogen)

నీటిని ఉపయోగించి మంటను ఉత్పత్తి చేయగల హెడ్రోజన్ టెక్నాలజీని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవలే దేశంలో కొన్ని స్టార్టప్ కంపెనీలు నీటిని హైడ్రోజన్‌గా మార్చి వంట చేసుకునే స్టవ్‌లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇది కేవలం నీరు, కొద్దిపాటి విద్యుత్ ను వినియోగించుకొని పనిచేస్తుంది. ఈ స్టవ్ ధర దాదాపు రూ.1,05,000 నుంచి రూ.1,50,000 వరకు ఉంది.

Advertisement

Also Read: Jio vs Airtel: జియో రూ.339 ప్లాన్.. ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్.. రెండింటిలో ఏది బెస్ట్?

వంటగదికి ఏది బెస్ట్?

నగరాల్లో ఉంటూ నిరంతరం విద్యుత్ సరఫరాను కలిగి ఉంటే ఇండక్షన్ స్టవ్స్ బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. నెల తిరిగే సరికి వందల్లో డబ్బును ఆదా చేసుకోవచ్చు. అయితే కరెంట్ కోతలు ఉన్న ప్రాంతాల్లో LPG ఉత్తమం. చాలా మంది ఇప్పుడు ఎల్ పీజీ, ఇండక్షన్ స్టవ్ రెండూ వంట గదిలో వినియోగిస్తున్నారు. ఇది స్మార్ట్ ఆలోచనగా నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హైడ్రోజన్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నందున సామాన్యులు దీనిని భరించలేకపోవచ్చు. కాబట్టి సాధారణ వినియోగదారులు హైడ్రోజన్ స్టవ్ కోసం కొన్నాళ్లు ఆగితే బెటర్.

Also Read: Mijia Split AC: షావోమీ పవర్‌ఫుల్ ఏసీ లాంచ్.. 15 సెకన్లలోనే కూలింగ్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×