Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం ఖండాంతరాలు దాటిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆయన, తాజాగా లండన్‌లోని ప్రఖ్యాత మెడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే00. అయితే, ఈ విగ్రహం వెనుక ఉన్న ఒక భావోద్వేగపూరితమైన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం విగ్రహం ఉండటం మాత్రమే కాదు, ఆ విగ్రహం ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతోంది.
Read also-మళ్లీ వాయిదా పడనున్న యశ్ టాక్సిక్.. వారితో విభేదాలే కారణమా? ఒక్క మాటతో క్లారిటీ!
మెడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఎందరో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా తారల విగ్రహాలు ఉన్నాయి. అయితే, తన పెంపుడు జంతువుతో కలిసి మైనపు విగ్రహాన్ని కలిగి ఉండటం అనేది ఒక అరుదైన గౌరవం. ఇప్పటివరకు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మాత్రమే తన ప్రియమైన కుక్కలతో కలిసి విగ్రహ రూపంలో మెడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరారు. ఆమె తర్వాత ఆ అరుదైన గౌరవాన్ని అందుకుంటున్న రెండో వ్యక్తి, మొదటి సినీ నటుడు రామ్ చరణ్ కావడం విశేషం. ఆయన తన ప్రియమైన పెంపుడు కుక్క ‘రైమ్’ (Rhyme) తో కలిసి ఈ విగ్రహంలో కనిపించబోతున్నారు.
నిజానికి ఈ మైనపు విగ్రహం ప్రతిపాదన వచ్చినప్పుడు రామ్ చరణ్ మొదట్లో అంతగా ఆసక్తి చూపలేదట. మ్యూజియం ప్రతినిధులు ఎన్నిసార్లు సంప్రదించినా, ఆయన కొంత సంకోచంతోనో లేదా ఇతర పనుల వల్లనో సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో మ్యూజియం నిర్వాహకులు చరణ్ భార్య ఉపాసన కొణిదెలను సంప్రదించారు. చరణ్‌ను ఎలా ఒప్పించాలో తెలిసిన ఉపాసన, ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. “కేవలం చరణ్ విగ్రహం మాత్రమే కాకుండా, అతని ప్రాణప్రదమైన ‘రైమ్’ విగ్రహాన్ని కూడా పక్కన పెడతామని చెప్పండి.. ఆయన వెంటనే ఒప్పుకుంటారు” అని ఆమె సూచించారు.
Read also-అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు రామ్ చరణ్ ఎలా మేనేజ్ చేస్తారో తెలుసా?..
ఉపాసన చెప్పినట్లే నిర్వాహకులు ‘రైమ్’ ప్రస్తావన తీసుకురాగానే, చరణ్ రెండో ఆలోచన లేకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ మరుసటి నెలలోనే ఆయన లండన్ వెళ్లి విగ్రహ తయారీకి కావాల్సిన కొలతలు ఇచ్చారు. “కేవలం నా విగ్రహం ఉండటం కంటే, అందులో రైమ్ కూడా ఉండటం నాకు చాలా అర్థవంతంగా, సంతోషంగా అనిపించింది” అని చరణ్ స్వయంగా వెల్లడించారు. ఈ విగ్రహం కేవలం ఒక స్టార్ హోదాకు గుర్తు మాత్రమే కాదు, రామ్ చరణ్‌కు తన పెంపుడు జంతువుపై ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. త్వరలోనే ఈ అద్భుతమైన మైనపు విగ్రహం లండన్ మ్యూజియంలో సందర్శకులకు కనువిందు చేయనుంది. మెగా అభిమానులు తమ అభిమాన నటుడికి దక్కిన ఈ అంతర్జాతీయ గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.