E-Paper
Advertisement

మెకానికల్ కీబోర్డ్ కొనేముందు ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే తిప్పలు తప్పవు!

మెకానికల్ కీబోర్డ్ కొనేముందు ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే తిప్పలు తప్పవు!
Advertisement

Mechanical Keyboard: ఈ రోజుల్లో కంప్యూటర్ వాడేవారు, గేమర్స్ ఎక్కువగా మెకానికల్ కీబోర్డ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. టైపింగ్ అనుభవం బాగుంటుందని, ఎక్కువ కాలం మన్నుతాయని వీటిని కొంటుంటారు. ఒకప్పుడు నార్మల్ కీబోర్డ్స్ వాడిన మనం.. ఇప్పుడు ప్రీమియం అనుభూతి కోసం వీటిపై ఆసక్తి చూపిస్తున్నాం. అయితే అందరికీ ఇవి సెట్ కావు. మెకానికల్ కీబోర్డ్‌లలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎక్కువ శబ్దం చేయడం:

మెకానికల్ కీబోర్డ్‌లలో ఉండే స్విచ్‌ల వల్ల టైప్ చేస్తున్నప్పుడు పెద్దగా శబ్దం వస్తుంది. ఆఫీసుల్లో లేదా రాత్రి వేళల్లో ఇంట్లో పనిచేసేటప్పుడు ఈ సౌండ్ పక్కన ఉన్నవారికి చాలా చిరాకు కలిగిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసేవారికి, ఈ శబ్దం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.

చేతులకు అలసట:

Advertisement

వీటి కీస్ ఎత్తుగా ఉండటంతో టైప్ చేయడానికి కీలను కాస్త గట్టిగా నొక్కాల్సి వస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు ఆర్టికల్స్ లేదా కోడింగ్ రాసేవారికి వేళ్లు, చేతుల మణికట్లు త్వరగా అలసిపోతాయి. నార్మల్ లాప్‌టాప్ కీబోర్డ్స్ లాగా ఇవి సున్నితంగా ఉండవు.

Also Read: iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

అధిక ధరలు:

Advertisement

సాధారణ కీబోర్డ్‌లతో పోలిస్తే.. మెకానికల్ కీబోర్డ్‌ల ధర చాలా ఎక్కువ. మార్కెట్‌లో కొన్ని చౌకైన మోడల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, మంచి నాణ్యత ఉన్న బ్రాండెడ్ కీబోర్డ్‌ల ధరలు వేలలో ఉంటాయి. కేవలం కీబోర్డ్ కోసం అంత మొత్తంలో ఖర్చు చేయడం అందరికీ కుదిరే పని కాదు.

ఎంచుకోవడం కన్ఫ్యూజన్:

వీటిలో రకరకాల స్విచ్‌లు, కీక్యాప్స్, కస్టమైజేషన్ ఆప్షన్లు ఉంటాయి. క్లికీ, లీనియర్, టాక్టైల్ అని విభిన్న రకాలు ఉండటంతో సగటు వినియోగదారుడికి ఏది కొనాలో అర్థం కాదు. వీటి గురించి తెలుసుకోకుండా కొనుగోలు చేస్తే డబ్బులు వృధా అయ్యే అవకాశం ఉంది.

ఎక్కువ బరువు, సైజు:

మెకానికల్ కీబోర్డ్స్ సాధారణంగా చాలా బరువుగా, లావుగా ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ కోసం మెటల్ ఉపయోగిస్తారు కాబట్టి.. వీటిని బ్యాగులో పెట్టుకుని ప్రయాణాల్లో తిరగడం చాలా కష్టం. ల్యాప్‌టాప్‌తో పాటు బయటకు తీసుకెళ్లడానికి ఇవి ఏ మాత్రం అనువుగా ఉండవు.

Also Read: మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

Tags

Related News

సాధారణ ఇయర్‌బడ్స్‌కు గుడ్‌బై చెప్పండి.. ట్రెండీ లుక్‌‌తో అదరగొడుతున్న మోడల్

బోస్ సౌండ్‌తో నోయిస్ ప్రీమియం ఇయర్‌ఫోన్స్.. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!

రూ.699కే..60 గంటల బ్యాటరీ బ్యాకప్‌ ఇయర్‌బడ్స్! మార్కెట్‌లోకి కొత్త మోడల్

సింగిల్ ఛార్జ్‌తో 10 రోజులు వాడేయొచ్చు.. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేని కొత్త Luna Band సేల్స్ స్టార్ట్!

పాత యాపిల్ వాచ్ ఇప్పుడు కొనొచ్చా? డబ్బులు పెట్టే ముందు ఈ 4 విషయాలు తెలుసుకోండి!

ఇంటి గోడనే స్క్రీన్‌లా మార్చేయండి! ఇక టీవీ కొనేపనే లేదు, ఈ ప్రొజెక్టర్ ఉంటే చాలు

అరె వా ఏమి సౌండ్! బడ్జెట్‌లో నంబర్ 1 పార్టీ స్పీకర్ ఇదే..

Big Stories

Advertisement
×