Attacks Bahrain Oil Refinery: మధ్యప్రాఛ్యంలో యద్ధం ఇప్పట్లో తగ్గినట్టు కనిపించడం లేదు. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ మెరుపు దాడులు తీవ్రతరం అవుతున్నాయి. సైన్యం, అణు కేంద్రాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇరాన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా గల్ఫ్ ఏరియాలో అమెరికా-ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, ఆయల్ కంపెనీలపై దాడులు తీవ్రతరం చేసింది.
ఇరాన్ దూడుకు.. బహ్రెయిన్-కువైట్లపై మిసైళ్ల దాడులు
తాజాగా బహ్రెయిన్‌లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై మిసైల్‌తో దాడి చేసింది ఇరాన్. బహ్రెయిన్‌లో బాప్కో ఎనర్జీస్ ఆయిల్ రిఫైనరీ అతి పెద్దది. ఇక్కడ నుంచి వివిధ దేశాలకు ఆయల్ వెళ్తోంది. దీనిపై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లు మూకుమ్మడిగా దాడులు చేశాయి. నాలుగు మిస్సైళ్లను ప్రయోగించినట్టు తెలుస్తోంది. వాటిని రెండింటిని బహ్రెయిన్ ఆకాశంలో అడ్డుకోగా ఒకటి చమురు రిఫైనరీపై పడింది. మరొకటి వేరే ప్రాంతంలో పడింది.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అందులో పని చేస్తున్న కార్మికులు వెంటనే వెంటనే పరుగులు తీశారు. సమీపంలోని ఉన్న కార్మికులు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆయిల్ రిఫైనరీలో ఎగిసిపడిన మంటల దృశ్యాలను రికార్డు చేశారు. రిఫైనరీలోని ఓ యూనిట్‌లో మంటలు చెలరేగినట్టు ఆదేశం ప్రకటించింది.
బహ్రెయిన్‌లో ఆయిల్ రిఫైనరీ.. కువైట్‌లో అలీ అల్ సలేం వైమానిక స్థావరంలో ఎగిసిపడిన మంటలు
బహ్రెయిన్ అధికారులు వాటిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆదేశం తెలిపింది. ప్రస్తుతానికి రిఫైనరీలో పనులు జరుగుతున్నాయని ప్రకటించింది. బహ్రెయిన్ జాతీయ పెట్రోలియం సంస్థ బాప్కో దీన్ని నిర్వహిస్తోంది. బహ్రెయిన్ తూర్పు తీరం వెంబడి సిత్రా ద్వీపంలో రాజధాని మనామాకు దక్షిణంగా ఉంది.
అక్కడ రిఫైనరీ ఆగితే చమురు సప్లై పై తీవ్ర ప్రభావం చూపనుంది. శుద్ధి కర్మాగారం కార్యకలాపాలు యథాతధంగా కొనసాగుతున్నాయని, ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. గురువారం మధ్యాహ్నం బహ్రెయిన్ అంతటా అత్యవసర సైరన్లు మోగాయి. శనివారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ 75 బాలిస్టిక్ క్షిపణులు, 124 డ్రోన్లను అడ్డగించినట్టు బహ్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ALSO READ: కెనడాలో ఘోరం.. భారత సంతతి మహిళా యూట్యూబర్‌ను.. కత్తులతో పొడిచి హత్య
ఈ దాడి కేవలం బహ్రెయిన్ లక్ష్యంగా జరగలేదని, అమెరికాతో ఆ దేశానికి ఉన్న సన్నిహిత వ్యూహాత్మక సంబంధానికి ఇది కారణమని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉండగా కువైట్‌లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరంలో మిస్సైళ్ల దాడి జరిగినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు ఆ విజువల్స్ ద్వారా తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
Iran PUMMELS Ali Al-Salem Air Base, Kuwait — reports
Fires at the impact sites also appear on NASA maps pic.twitter.com/RYtX8ANkMd
— RT (@RT_com) March 6, 2026
బహ్రెయిన్‌లోని అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసిన ఇరాన్
75 మిస్సైళ్లు, 123 డ్రోన్లతో జరిపిన భారీ దాడిలో మంటల్లో కాలిపోయిన బహ్రెయిన్ పెట్రోలియం రిఫైనరీ
Iran Attacks Bahrain's Largest Oil Refinery with 75 Missiles and 123 Drones pic.twitter.com/UAgXps3Ud4
— BIG TV Breaking News (@bigtvtelugu) March 6, 2026