E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు – వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు – వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 20వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

కొన్ని వ్యవహారాలలో  ఆత్మీయులు సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు ఉన్నతికి చేసిన  శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో  అధిగమిస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. 

వృషభం

Advertisement

ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.  చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. 

మిథునం

రుణ భారం అధికమౌతుంది. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున  అదనపు భాధ్యతలుంటాయి. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట నూతన  సమస్యలు ఉత్పన్నమౌతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం

Advertisement

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టాలుంటాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం

ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు.  ఉద్యోగమున  ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు 

కన్య

వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి.  మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున  అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చేపట్టిన పనులలో జాప్యం  తప్పదు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో  మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.  వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. వ్యాపారామున భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన  సకాలంలో పనులు పూర్తి కావు.  కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. 

ధనుస్సు

వృత్తి వ్యాపారాలలో  సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రయాణాలలో నూతన  పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగమున   వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మకరం

దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగమున  స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో  చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. 

కుంభం

వృత్తి  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.  ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు  వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం

నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. కొన్ని వ్యవహారాలలో  ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×