E-Paper
Advertisement

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్
Advertisement

CBSE 12th Result Revaluation-2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ‌పై ఒత్తిడి క్రమంగా పెరుగుతోందా? ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఆన్-స్క్రీన్ మార్కింగ్-OSM విధానంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌-2026

Advertisement

సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు వెలువడడంతో రీవాల్యుయేషన్‌ ప్రక్రియ మొదలైంది. అందులో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితాలు విడుదలై రెండువారాలు గడుస్తున్నా ఇబ్బందులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్-OSM విధానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి.

దీని కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 17 లక్షల 68 వేల 968 మంది హాజరయ్యారు. అందులో 15 లక్షల ఏడు వేల మంది పైగానే ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోల్చితే ఈసారి మూడు శాతం ఉత్తీర్ణత తగ్గింది.

Advertisement

4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి

పరీక్షలు రాసిన 17 లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 4 లక్షల మంది తాము రాసిన 11 లక్షల జవాబు పత్రాల స్కాన్‌ కాపీల కోసం అప్లై చేశారు. ఆ లెక్కన ప్రతి నలుగురు ఒక విద్యార్థి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన మే 13 నుంచి ఆన్‌లైన్‌ పోర్టల్‌‌పై ఒత్తిడి పెరిగింది.

ఫలితంగా దరఖాస్తు చేయడానికి విద్యార్థులు గంటల తరబడి కంప్యూటర్ల ముందు ఉండాల్సి వస్తుంది. అయితే జవాబు పత్రా ల స్కాన్‌ కాపీల్లో చాలావరకు అస్పష్టంగా కనిపించడంతో షాకయ్యారు. మరికొందరు విద్యార్థులకు వేరొకరి జవాబు పత్రాలు కనిపించాయి.

ALSO READ: ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

ఇటీవల ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని మరొక పేపర్ జత చేశారని ఆధారాలతో నిలదీయడంతో గందరగోళం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలు 2026 మే 27 నాటికి పూర్తి చేస్తామని బోర్డు తెలిపింది. ధృవీకరణ, పునఃమూల్యాంకన విండో 2026 మే 29న ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ సమస్య దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది విద్యార్థులకే కాదు.. దరఖాస్తు చేయని లక్షలాది మంది విద్యార్థుల మెరిట్‌, కాలేజీ అడ్మిషన్లపై ప్రభావితం చేయనుంది. ఈ లోపు బీటెక్ కాలేజీల అడ్మిషన్ల గడువు ముగుస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×