E-Paper
Advertisement

Meesho New Year Offers: ఇది కదా అసలైన లూట్.. మీషో న్యూయర్ సేల్‌లో సగం ధరలకే బ్రాండెడ్ లుక్ ప్రొడక్ట్స్

Meesho New Year Offers: ఇది కదా అసలైన లూట్.. మీషో న్యూయర్ సేల్‌లో సగం ధరలకే బ్రాండెడ్ లుక్ ప్రొడక్ట్స్
Advertisement

Meesho New Year Offers: నూతన సంవత్సరం సందర్భంగా మీషో తన వినియోగదారుల కోసం కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఆఫర్లను ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక శాతం తగ్గింపులను అందుబాటులోకి తీసుకురావడంతో సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంత వినియోగదారులే లక్ష్యంగా ఈ న్యూయర్ ధమాకాను రూపొందించారు. నిజంగా ఇన్ని ఆఫర్లు సాధ్యమేనా? అనే చర్చ సామాన్యుల్లో మొదలయ్యేలా మీషో తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ సీజన్ సేల్‌లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా మీషో ప్రకటించిన ఈ తగ్గింపులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

ఫ్యాషన్ కేటగిరీలో ఆఫర్లు ఎలా ఉన్నాయి

Advertisement

ఫ్యాషన్ కేటగిరీ లో ఈ న్యూయర్ ఆఫర్లు అత్యధికంగా కనిపిస్తున్నాయి. మహిళల డ్రెస్సులు, కుర్తీలు, సారీలు, మెన్స్ షర్ట్స్, టీషర్ట్స్, పిల్లల డ్రెస్సులు అన్నింటిపైనా 30శాతం నుంచి 70శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. కొన్ని సెలెక్టెడ్ ఉత్పత్తులపై 80శాతం వరకు కూడా డిస్కౌంట్ కనిపిస్తోంది. గతంలో మీషోలో సాధారణంగా 20శాతం నుంచి 40శాతం మధ్యే ఆఫర్లు ఉండేవి. ఈసారి మాత్రం న్యూయర్ సమయంలో ఆఫర్లతో ఆకట్టుకుంది.

హోమ్ కిచెన్ కేటగిరీలో ఎంత తగ్గింపు

Advertisement

ఇళ్ల అవసరాల కేటగిరీలో కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్, స్టోరేజ్ బాక్సులు, గ్యాస్ స్టవ్ యాక్సెసరీస్, కర్టెన్స్, బెడ్ షీట్స్, మ్యాట్స్ లాంటి వాటిపై 25శాతం నుంచి 60శాతం వరకు తగ్గింపులు కనిపిస్తున్నాయి. కొన్ని హోమ్ డెకర్ ప్రొడక్ట్స్ పై 65శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఇవన్నీ 10శాతం నుంచి 25శాతం మధ్యే ఉండేవి.

ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో మీషో వ్యూహం

ఎలక్ట్రానిక్స్ విషయంలో మీషో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది. అయినా ఈ న్యూయర్ కి మొబైల్ యాక్సెసరీస్, ఇయర్‌ఫోన్స్, స్పీకర్స్, స్మార్ట్ వాచెస్ లాంటి వాటిపై 20శాతం నుంచి 50శాతం వరకు తగ్గింపులు ఇస్తోంది. ముఖ్యంగా యాక్సెసరీస్ సెగ్మెంట్ లో 40శాతం నుంచి 50శాతం డిస్కౌంట్ అనేది మీషోకి కొత్త విషయం. పెద్ద బ్రాండ్స్ కాకపోయినా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ ని తక్కువ ధరలతో ముందుకు తీసుకొస్తోంది.

Also Read: Amazon offer: శామ్‌సంగ్ ఎం17 5జిపై రూ.4వేలు తగ్గింపు.. ఈఎంఐ కూడా కేవలం రూ.600 మాత్రమే

బ్యూటీ పర్సనల్ కేర్ ఆఫర్లు ఎంత వరకు

బ్యూటీ, పర్సనల్ కేర్ కేటగిరీలో ఈసారి న్యూయర్ ఆఫర్లు బాగానే ఉన్నాయి. మేకప్ కిట్స్, స్కిన్ కేర్ ఉత్పత్తులు, హెయిర్ ఆయిల్, షాంపూలు లాంటి వాటిపై 30శాతం నుంచి 55శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. కొన్ని కాంబో ఆఫర్లలో అయితే 60శాతం వరకు కూడా పడింది. సాధారణంగా ఈ కేటగిరీలో మీషో 20శాతం నుంచి 30శాతం కంటే ఎక్కువ ఇవ్వదు. ఈసారి అది మారింది.

ఫుట్‌వేర్ కేటగిరీలో పరిస్థితి

చప్పల్స్, షూస్, సాండల్స్ లాంటి ఫుట్‌వేర్ పై 35శాతం నుంచి 70శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్ ఫుట్‌వేర్ పై ఎక్కువ తగ్గింపులు కనిపిస్తున్నాయి. న్యూయర్ కొనుగోళ్లలో ఫ్యాషన్ తరువాత ఎక్కువగా అమ్ముడయ్యేది ఇదే కాబట్టి మీషో ఇక్కడ కూడా గట్టిగా దూకింది.

ఆఫర్ల వెనుక మీషో ప్లాన్ ఏంటి

ఇంత పెద్ద శాతం ఆఫర్లు ఇవ్వడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. న్యూయర్ సీజన్ లో కొత్త యూజర్లను ఆకర్షించడం, పాత యూజర్లను మళ్లీ యాక్టివ్ చేయడం, ఇతర ఈకామర్స్ ప్లాట్‌ఫాంలతో పోటీ పడడం ప్రధాన లక్ష్యం. తక్కువ ధరలు మీషో బలం. ఆ బలాన్ని న్యూయర్ సమయంలో పూర్తిగా ఉపయోగించుకుంటోంది.

నిజంగా ఈ ఆఫర్లు ఉపయోగపడతాయా

వాడుకదారుల కోణంలో చూస్తే ఈ ఆఫర్లు నిజంగా ఉపయోగపడతాయి. రోజువారీ అవసరాలు, ఫ్యాషన్ వస్తువులు, హోమ్ ఐటమ్స్ తక్కువ బడ్జెట్ లో కొనుగోలు చేయొచ్చు. అయితే ప్రతి ఆఫర్ ని అంధంగా నమ్మకుండా రేటింగ్, రివ్యూస్ చూసి కొనడం మంచిది. శాతం ఎక్కువగా ఉందని మాత్రమే చూసి ఆర్డర్ పెట్టడం సరైనది కాదు. న్యూయర్ షాపింగ్ చేయాలనుకునే వాళ్లకి మీషో ఈసారి మంచి ఆప్షన్ గా మారింది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×