E-Paper
Advertisement

రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!

రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!
Advertisement

Melbon H9 Smartwatch:  ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ వాచ్‌ కేవలం టైం చూడటానికే కాకుండా..మన ఆరోగ్యాలను పర్యవేక్షించే అసిస్టెంట్ లాగా మారిపోయింది. అయితే.. మార్కెట్లో మంచి బ్రాండ్ వాచ్‌లు వేల రూపాయలు ఉండటంతో చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం కేవలం రూ. 898 ధరకే మార్కెట్లోకి వచ్చిన ‘మెల్బాన్ H9’స్మార్ట్‌వాచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ధరలో ఇది ఇస్తున్న ఫీచర్లు నిజంగా అద్భుతమనే చెప్పాలి.తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కొనాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్ వాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. స్టైలిష్ డిజైన్ ,గ్రే స్ట్రాప్ లుక్:

ఈ వాచ్ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనికి ఇచ్చిన గ్రే స్ట్రాప్ ఎంతో ట్రెండీగా ఉండి, క్యాజువల్ ,ట్రెడిషనల్ వేర్స్ రెండింటికీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఫ్రీ సైజ్ కాబట్టి ఎవరి చేతికి అయినా.. ఇది సౌకర్యవంతంగా సరి పోతుంది. తక్కువ బరువు ఉండటం వల్ల రోజంతా చేతికి పెట్టుకున్నా ఎలాంటి అసౌకర్యం కలగదు.

2. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ :

Advertisement

రూ.1,000లోపు ధరలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ రావడం అనేది చాలా గొప్ప విషయం. మెల్బాన్ H9 వాచ్ ద్వారా మీరు ఫోన్ చేతిలో… లేక పోయినా నేరుగా వాచ్‌ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. బిల్ట్-ఇన్ మైక్ , స్పీకర్ సపోర్ట్ ఉండటం వల్ల వాయిస్ క్లారిటీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు.. లేదా వ్యాయామం చేసే సమయంలో.. ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

3.హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ :

మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచడానికి ఈ స్మార్ట్‌వాచ్‌లో పలు రకాల సెన్సార్లు ఉన్నాయి.

Advertisement

హార్ట్ రేట్ మానిటర్: మీ హార్ట్ బీట్ 24 గంటలూ ట్రిక్ చేస్తుంది.

SpO2 మానిటర్: రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు కొలుస్తుంది.

స్లీప్ మానిటర్ : మీ నిద్ర విధానాన్ని విశ్లేషించి, మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారా లేదా అనే వివరాలను అందిస్తుంది.

మల్టిపుల్ వాచ్ ఫేసెస్ : మీ మూడ్, డ్రెస్సింగ్‌కు తగినట్లుగా వాచ్ స్క్రీన్ డిజైన్‌ను రోజూ మార్చుకోవడానికి ఎన్నో వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: అమెజాన్ సేల్‌లో 3-స్టార్ Vs 5-స్టార్ రిఫ్రిజిరేటర్లు,ఏది కొంటే బెటర్?

4. బ్యాటరీ బ్యాకప్ :

ఈ బడ్జెట్‌లో బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. మెల్బాన్ H9 స్మార్ట్‌వాచ్ సాధారణ వాడకంలో.. మంచి బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. రోజు వారీ వ్యాయామాలు, రన్నింగ్, వాకింగ్ వంటి ఫిట్‌ నెస్ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయడానికి.. ఇందులో వివిధ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. నోటిఫికేషన్ అలర్ట్స్, సోషల్ మీడియా మెసేజ్‌లు నేరుగా వాచ్ స్క్రీన్ పైనే చూసుకోవచ్చు.

5. ధర :

ఈ మెల్బాన్ H9 స్మార్ట్‌వాచ్ అసలు ధర మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆఫర్లలో భాగంగా ఇది కేవలం రూ.898 ధరకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో.. బ్లూ టూత్ కాలింగ్ ,అన్ని హెల్త్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ వాచ్ కోరుకునే.. వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

మీరు తక్కువ ధరలో అన్ని హంగులున్న స్మార్ట్‌ వాచ్ కొనాలని ఆలోచిస్తుంటే.. మెల్బాన్ H9 మంచి ఆప్షన్ అవుతుంది. రూ.1000 లోపు బడ్జెట్‌లో ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు!

Related News

అమెజాన్ సేల్..రూ.50వేలలోపు టాప్ 5 స్మార్ట్ టీవీలు ఇవే!

టెక్ వరల్డ్‌లో సెన్సేషన్..‘కింగ్ద్రా’ కోడ్‌తో నథింగ్ ఇయర్ 3 ప్రో గ్రాండ్ ఎంట్రీ

అమెజాన్ సేల్‌లో 3-స్టార్ Vs 5-స్టార్ రిఫ్రిజిరేటర్లు,ఏది కొంటే బెటర్?

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

Big Stories

Advertisement
×