E-Paper
Advertisement

పారిస్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియన్ ఎంబసీ ఏం చెప్పిందంటే?

పారిస్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియన్ ఎంబసీ ఏం చెప్పిందంటే?
Advertisement

Paris Travel Alert: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పారిస్‌ లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో పారిస్ పర్యటనకు వెళ్లాలనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఫ్రాన్స్‌ లో ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి?

ఫ్రాన్స్‌ లో విద్యార్థులు, కార్మికులు సహా పలువురు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పెరుగుతున్న కాస్ట ఆఫ్ లివింగ్, ఇంధన ధరలు, సహా పలు సమస్యలపై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం కావడంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

పారిస్‌ లో ఆంక్షలు.. రవాణాకు అంతరాయం..

Advertisement

నిరసనలను నియంత్రించేందుకు పారిస్‌ లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించారు. మరికొన్ని ప్రాంతాల్లో అనుమతి లేని ప్రదర్శనలు, సమావేశాలపై నిషేధం విధించారు. లూవ్రే మ్యూజియం, ఛాంప్స్ ఎలిసీస్, బాస్టిల్, రిపబ్లిక్ లాంటి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిరసనల కారణంగా కొన్ని మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయడంతో ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితులను బట్టి మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు బయలుదేరే ముందు రవాణా సమాచారాన్ని చెక్ చేసుకోవాలి.

ఇతర నగరాల్లోనూ ఉద్రిక్తతలు

పారిస్‌తో పాటు లియోన్, మార్సెయిల్, బోర్డో, లిల్లే లాంటి నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలతో ఫ్రాన్స్ పర్యాటక రంగంలోనూ ఆందోళనలు పెరిగాయి. కొన్ని హోటళ్లలో బుకింగ్‌లు రద్దయ్యాయి. అయితే, ఫ్రాన్స్ మొత్తం పర్యటనలకు అనువుగా లేవు. పరిస్థితులు ప్రాంతాన్ని బట్టి మారుతున్నందున, తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి రావచ్చు.

భారతీయ ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Advertisement

అక్టోబర్ 21న పారిస్‌ లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. ఫ్రాన్స్‌ లో ఉంటున్న,  పర్యటిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రాంతాలు, నిరసనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. నిరసనలు జరిగే  ప్రాంతాలకు దగ్గరలోని హోటళ్లు బుక్ చేసుకోవడం కంటే ప్రశాంతమైన నివాస ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది. రవాణా మార్గాలు మూసివేస్తే హోటల్‌కు ఎలా చేరుకోవాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

ప్రయాణానికి ముందు ఏం చేయాలంటే..   

ప్రయాణికులు ఫ్రాన్స్‌ అధికారుల భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఫోన్‌ను ఛార్జ్ చేసి ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలను సేవ్ చేసుకోవాలి. నిరసనలు ఎదురైతే గుంపులకు దూరంగా వెళ్లి, పోలీసుల సూచనలను పాటించాలి. మెట్రో, బస్సు సేవల వివరాల ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. పరిస్థితులను బట్టి ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు చేసుకునేలా సిద్ధంగా ఉండాలి. ప్రయాణాన్ని సేఫ్ గా కొనసాగించాలి.

Read Also: అంతరిక్ష యాత్ర ఇక సామాన్యులకూ సాధ్యమే.. గగన్‌యాన్ మిషన్‌తో కొత్త ఆశలు!

Tags

Related News

అంతరిక్ష యాత్ర ఇక సామాన్యులకూ సాధ్యమే.. గగన్‌యాన్ మిషన్‌తో కొత్త ఆశలు!

ట్రాఫిక్‌లో చిక్కుకొని రైలు మిస్ అవుతుందని టెన్షన్ వద్దు.. మీ సమస్యకు పరిష్కారం ఇదే

విమానాల్లో ఫైవ్ స్టార్ రేంజ్ ఫుడ్.. ఎయిర్ ఇండియా క్రేజీ ప్లాన్!

ఇండియాను చూసేందుకు ఉద్యోగాలు వదిలేసిన యూరప్ అమ్మాయిలు.. వందే భారత్ జర్నీ చూసి..

సౌదీలో క్షిపణి దాడులు.. భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరికలు!

రైల్లో క్యాన్సర్ పేషెంట్ మృతి.. 12 గంటల పాటు మృతదేహంతో ప్రయాణికుల అవస్థలు!

గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×