E-Paper
Advertisement

వెంటిలేటర్ పై ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ను షాబాద్ ఖాన్ కాపాడాడు

వెంటిలేటర్ పై ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ను షాబాద్ ఖాన్ కాపాడాడు
Advertisement

Basit Ali on Shadab Khan: వ‌న్డే డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) నేపథ్యంలో ఇంగ్లాండ్ పై ఆదివారం అద్భుతమైన విజయం సాధించింది పాకిస్తాన్. ఎనిమిదో వికెట్ కు వచ్చిన షాబాద్ ఖాన్ సూపర్ సెంచరీ చేసి…పాకిస్తాన్ జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో షాబాద్ ఖాన్ (Shadab Khan) సెంచరీపై బాసిత్ అలీ (Basit Ali ) ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు షాబాద్ ఖాన్ పెద్ద దద్దమ్మ అనుకున్నాను, కానీ వాడే పాకిస్తాన్ జట్టులో రియల్ హీరో అంటూ ప్రశంసించారు. సూపర్ సెంచరీ చేసి వెంటిలేటర్ పైన ఉన్న పాకిస్తాన్ జట్టును బతికించాడని మెచ్చుకున్నారు. ఈ ఆటను ఇలాగే కొనసాగించి 2027 వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు. నిన్న‌టి ఆట చూస్తుంటే, పాకిస్తాన్ గాడిలో పడినట్టు తనకు అనిపిస్తోందని వెల్లడించారు. ఈ ఊపు ఇలాగే కొనసాగించాలని కోరారు. ఇంగ్లాండ్ పై (England) విజ‌యం కొన్నేళ్లు గుర్తుండిపోతుందని బాసిత్ అలీ ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

వెంటిలేటర్ పై ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ను షాబాద్ ఖాన్ కాపాడాడు

8వ స్థానంలో వచ్చి పాకిస్తాన్ జట్టును గెలిపించిన షాబాద్ ఖాన్ పై బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించారు. 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ను ఒంటి చేత్తో షాబాద్ ఖాన్ గెలిపించడం చాలా గ్రేట్ అని వెల్లడించారు. చివరి వరకు నిలబడి మ్యాచ్ గెలిపించే వాళ్ళు హీరోలు అవుతారని వ్యాఖ్యానించారు. వన్డేలలో పాకిస్తాన్ క్రికెట్ ఖేల్ కతం అయింది అనుకున్న క్రమంలో గెలిపించి పరువు కాపాడిన షాబాద్ ఖాన్ ను మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

చివరి వికెట్ కు బరిలోకి దిగిన హారిస్ రవూఫ్ ( Haris Rauf ) కూడా డిఫెన్స్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం అద్భుతం అన్నారు. అందులోనూ స్ట్రేట్ డ్రైవ్ ద్వారా విన్నింగ్ షార్ట్ ఆడి అందరి మనసులను దోచేశాడని పేర్కొన్నారు. పరాజయం అంచున ఉండి పదో వికెట్ కు రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్తాన్ జట్టు క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం నింపారని అభిప్రాయపడ్డారు.

Advertisement

ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 46.4 ఓవర్లు ఆడి 241 పరుగులు సాధించింది. బెన్ డ‌కేట్ సెంచరీ చేసినప్పటికీ మ్యాచ్ మాత్రం పాకిస్తాన్ గెలిచింది. ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి చేదించింది. దీంతో ఒకే ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన మొద‌టి స్థానాన్ని నిలబెట్టుకుంది.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

 

Related News

పాకిస్తాన్ ప్లేయ‌ర్లు 25 వేల డాల‌ర్లు ఇవ్వాల్సిందే…గుంట న‌క్క న‌ఖ్వీ దిక్కుమాలిన కండీష‌న్‌

టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్…పాకిస్తాన్ కాళ్ల ముందు మోక‌రిల్లింది

పాకిస్తాన్ స‌న్యాసుల‌కు ఇక జ‌న్మ‌లో సిగ్గురాదు…హారిస్ రవూఫ్ పై ఆఫ్ఘాన్ ప్లేయ‌ర్ ఫైర్‌

వైడ్ వివాదం…మ్యాచ్ మ‌ధ్యలోనే త‌న్నుకున్న విల్ జాక్స్, హారిస్ రవూఫ్

ఇంగ్లాండ్ కొంప‌ముంచిన DRS…షాబాద్ ఖాన్ సెంచ‌రీతో పాకిస్తాన్ విజ‌యం

బాబ‌ర్ ఆజం పెద్ద జోక‌ర్…పాకిస్తాన్ జ‌ట్టు నుంచి త‌రిమేయండి

అర్ధ‌రాత్రి 2 గంట‌ల‌కు ద్రవిడ్ కు ఫోన్ చేసి, బూతులు తిట్టిన క్రికెట‌ర్!

Big Stories

Advertisement
×