E-Paper
Advertisement

ఇక పిల్లల Meta AI చాట్స్‌పై నిఘా.. ఆత్మహత్య ఆలోచనలు వస్తే పేరెంట్స్‌కు అర్జెంట్ నోటిఫికేషన్!

ఇక పిల్లల Meta AI చాట్స్‌పై నిఘా.. ఆత్మహత్య ఆలోచనలు వస్తే పేరెంట్స్‌కు అర్జెంట్ నోటిఫికేషన్!
Advertisement

Meta AI Parent Alert: మెటా తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Meta AI) చాట్‌బాట్‌లో టీనేజర్ల భద్రత కోసం ఒక కీలకమైన అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. Parent Alert పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ద్వారా.. పిల్లలు AIతో ఆత్మహత్య లేదా మానసిక వేదనకు సంబంధించిన సున్నితమైన విషయాలు మాట్లాడినప్పుడు వారి తల్లిదండ్రులకు సమాచారం అందుతుంది.

ఆందోళన కలిగించే సంభాషణలపై నిఘా..

ఈ రోజుల్లో విద్యార్థులు, టీనేజర్లు చదువు కోసమో లేదా సరదాగానో AIని ఎక్కువగా వాడుతున్నారు. అయితే.. దీంతో పాటే వారి భద్రత, మానసిక ఆరోగ్యం గురించిన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా.. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికి మెటా ఈ సరికొత్త వ్యవస్థను రూపొందించింది.

Advertisement

Also Read: పాత టీవీల్లా ‘సెంటర్ స్టాండ్’ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? దీని వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా?

ముందస్తు సాయం, నిపుణుల సమీక్ష..

మెటా AI చాట్ చేస్తున్నప్పుడు టీనేజర్లలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు గుర్తిస్తే.. మొదట ఆ చాట్‌బాట్ పిల్లలను హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించమని లేదా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల వంటి నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడమని సలహా ఇస్తుంది. ఒకవేళ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందనిపిస్తే.. మెటా బృందం ఆ సంభాషణను మాన్యువల్‌గా సమీక్షించి, ఆ తర్వాతే తల్లిదండ్రులకు అలర్ట్ పంపుతుంది.

తల్లిదండ్రులకు ప్రత్యేక గైడెన్స్..

Advertisement

ఈ అలర్ట్‌తో పాటు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలతో ఎలా మాట్లాడాలి, వారిని ఎలా ఓదార్చాలి అనే విషయాలపై నిపుణులు రూపొందించిన గైడ్‌లైన్స్‌ను కూడా మెటా తల్లిదండ్రులకు అందిస్తుంది. ఇది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణంలో చర్చలు జరగడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా మిగతా దేశాలకూ విస్తరించనున్నారు.

భవిష్యత్తులో అత్యవసర సేవలు..

ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్‌లో స్క్రీన్ టైమ్ మేనేజ్‌మెంట్, తెలియని వారి నుంచి మెసేజ్‌లు రాకుండా నియంత్రించడం వంటి ఎన్నో సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు ఈ పేరెంట్ అలర్ట్ చేరింది. భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తే.. నేరుగా స్థానిక అత్యవసర సేవల సిబ్బందికి సమాచారం అందించే సాంకేతికతపై కూడా మెటా కసరత్తు చేస్తోంది.

Also Read: Wi-Fi స్పీడ్ తగ్గడానికి అసలు కారణం రూటర్ కాదు.. తెరవెనుక జరిగే అసలు కథ ఇదీ!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×