E-Paper
Advertisement

పాత టీవీల్లా ‘సెంటర్ స్టాండ్’ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? దీని వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా?

పాత టీవీల్లా ‘సెంటర్ స్టాండ్’ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? దీని వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా?
Advertisement

Smart TV Designs: సాధారణంగా మనం కొత్త టీవీ కొనాలనుకున్నప్పుడు డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ, బడ్జెట్ వంటి విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కానీ, టీవీ స్టాండ్ గురించి పెద్దగా పట్టించుకోము. ఒకప్పుడు టీవీలన్నింటికీ మధ్యలో ఒకే ఒక బలమైన స్టాండ్ వచ్చేది. దాన్ని ఏ చిన్న టేబుల్ మీదైనా సులువుగా పెట్టేవాళ్లం. కానీ, ఇప్పుడు వచ్చే టీవీలకు ఇరువైపులా రెండు చిన్న కాళ్లు ఇస్తున్నారు. ఈ మార్పు వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే..

డిజైన్ మారింది.. బరువు తగ్గింది:

ప్రస్తుత రోజుల్లో చాలామంది టీవీలను గోడకు తగిలించుకోవడానికే ఇష్టపడుతున్నారు. అలాగే, పాత మోడల్స్‌తో పోలిస్తే ఇప్పటి స్మార్ట్ టీవీలు చాలా సన్నగా, తేలికగా వస్తున్నాయి. అందువల్ల వీటికి పాతకాలపు భారీ సెంటర్ స్టాండ్ల అవసరం లేకుండా పోయింది. ఇరువైపులా ఇచ్చే చిన్న ప్లాస్టిక్ లేదా మెటల్ కాళ్లతోనే టీవీలు బ్యాలెన్స్ అవుతున్నాయి.

Advertisement

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాటరీ.. హువావే నుంచి బెస్ట్ ప్రీమియం ఇయర్‌బడ్స్ విడుదల!

ఖర్చు తగ్గించుకునే వ్యూహం:

కంపెనీలు అధికారికంగా చెప్పకపోయినా.. దీని వెనుక ఖర్చు తగ్గించుకునే ఆలోచన కూడా ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. టీవీ మధ్యలో నిలబడేలా పెద్ద మెటల్ లేదా గ్లాస్ స్టాండ్ తయారు చేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. అదే ఇరువైపులా చిన్న కాళ్లు అమర్చితే తయారీ ఖర్చుతో పాటు ప్యాకింగ్ సైజ్ కూడా తగ్గి, రవాణా సులువవుతుంది.

పెద్ద టీవీలు.. పెరిగిన ప్రమాదాలు:

Advertisement

సెంటర్ స్టాండ్ లేకపోవడం వల్ల అసలు సమస్య ఇక్కడే వస్తోంది. ఈ మధ్య కాలంలో పెద్ద స్క్రీన్ టీవీల వాడకం పెరిగింది. టీవీకి ఇరువైపులా చివర్లలో కాళ్లు ఉండటం వల్ల, మన ఇంట్లోని చిన్న టేబుల్స్‌పై ఇవి సరిగ్గా పట్టవు. కొద్దిగా అటూ ఇటూ అయినా టీవీ కింద పడిపోయే ప్రమాదం ఉంది. అమెరికాకు చెందిన ఒక నివేదిక ప్రకారం.. ఇలా టీవీలు సరిగ్గా కుదరక కిందపడటం వల్ల ఏటా వేల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా చిన్న పిల్లలు గాయపడుతున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే:

మీకు వాల్ మౌంటింగ్ ఇష్టం లేకపోతే.. మార్కెట్లో విడిగా దొరికే ‘యూనివర్సల్ సెంటర్ స్టాండ్స్’ కొనుగోలు చేయవచ్చు. ఇవి టీవీ వెనుక ఉండే హోల్స్‌కు ఫిట్ అయ్యి, పాతకాలం నాటి సెంటర్ బేస్‌ను అందిస్తాయి. కొన్ని ప్రీమియం టీవీ కంపెనీలు ఇప్పటికీ సెంటర్ స్టాండ్స్ ఇస్తున్నప్పటికీ వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మరికొన్ని బ్రాండ్లు టీవీ కాళ్లను మధ్యలోకి కూడా జరుపుకునేలా అదనపు ఆప్షన్లు ఇస్తున్నాయి. కాబట్టి.. కొత్త టీవీ కొనేటప్పుడు మీ ఇంట్లోని ఫర్నిచర్ సైజును కూడా ఒకసారి చూసుకోవడం మంచిది.

Also Read: వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తక్కువ ధరలోనే 8000mAh బ్యాటరీ మొబైల్, ధర ఎంతంటే?

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×