E-Paper
Advertisement

Wi-Fi స్పీడ్ తగ్గడానికి అసలు కారణం రూటర్ కాదు.. తెరవెనుక జరిగే అసలు కథ ఇదీ!

Wi-Fi స్పీడ్ తగ్గడానికి అసలు కారణం రూటర్ కాదు.. తెరవెనుక జరిగే అసలు కథ ఇదీ!
Advertisement

Wi-Fi Slow Reason: ఇంటి దగ్గరైనా, కాలేజీలోనైనా చాలా మంది గమనించే సమస్య ఇది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నెట్ సూపర్ స్పీడ్‌తో నడుస్తుంది. కానీ, అందరూ కలిసి ఒకేసారి వీడియోలు చూడటం, గేములు ఆడటం లేదా ఆన్‌లైన్ క్లాసులకు హాజరవడం మొదలుపెట్టగానే.. ఇంటర్నెట్ ఒక్కసారిగా స్లో అయిపోతుంది. పేజీలు లోడ్ అవ్వవు, వీడియోలు బఫర్ అవుతూ చిరాకు పెడతాయి. దీనికి గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

వై-ఫై అనేది ఒక రోడ్డు లాంటిది. రోడ్డుపై ఒకేసారి కొన్ని వాహనాలు మాత్రమే వెళ్లగలవు. అలాగే, వై-ఫై రూటర్ కూడా ఒకేసారి కొంత డేటాను మాత్రమే పంపించగలదు. ఇంట్లో డివైజ్‌లు (ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు) తక్కువగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఎక్కువ స్పేస్ దొరుకుతుంది కాబట్టి నెట్ వేగంగా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే వాడే వాళ్ల సంఖ్య పెరుగుతుందో.. అదే రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోయి అందరికీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది.

Advertisement

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాటరీ.. హువావే నుంచి బెస్ట్ ప్రీమియం ఇయర్‌బడ్స్ విడుదల!

వై-ఫై సిగ్నల్స్ అన్నీ ఒకేసారి ప్రయాణించలేవు. అన్ని డివైజ్‌లు రూటర్‌తో వంతుల వారీగా, చాలా వేగంగా మాట్లాడుతుంటాయి. క్లాస్‌రూమ్‌లో ఒకరిద్దరు మాట్లాడితే అందరికీ స్పష్టంగా వినిపిస్తుంది. అదే ఇరవై మంది ఒకేసారి మాట్లాడటం మొదలుపెడితే ఎవరి మాట అర్థం కాదు. వై-ఫై విషయంలోనూ అంతే జరుగుతుంది. పరికరాలు ఎక్కువైనప్పుడు, డేటా సిగ్నల్స్ పంపడానికి వాటి మధ్య పోటీ పెరిగి, నెట్ స్లో అవుతుంది.

Advertisement

మనం ఇంటర్నెట్‌లో చేసే పనులపై కూడా ఈ వేగం ఆధారపడి ఉంటుంది. కేవలం మెసేజ్‌లు పంపడం, ఈ-మెయిల్స్ చూసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, ఒకేసారి అందరూ హై-క్వాలిటీ వీడియోలు చూడటం, పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం లేదా ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం వల్ల ఎక్కువ డేటా ఖర్చవుతుంది. దీనికి తోడు మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అప్‌డేట్ అవుతుంటాయి. ఇవన్నీ కలిసి నెట్‌వర్క్‌ను పూర్తిగా జామ్ చేస్తాయి.

రూటర్‌కు మనం ఎంత దూరంలో ఉన్నామనేది కూడా ముఖ్యమే. ఇంట్లోని గోడలు, ఫర్నిచర్ వంటి అడ్డంకుల వల్ల వై-ఫై సిగ్నల్స్ బలహీనపడతాయి. సిగ్నల్ సరిగ్గా అందనప్పుడు ఫోన్ పదే పదే డేటాను అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఆ డివైజ్‌కే కాకుండా నెట్‌వర్క్‌లో ఉన్న మిగతా వాళ్లకు కూడా ఇంటర్నెట్ నెమ్మదిస్తుంది. అందుకే, రూటర్ ఒకేసారి ఎక్కువ మందికి సేవలు అందించాల్సి వచ్చినప్పుడు వై-ఫై నత్తనడకన సాగుతుంది.

Also Read: ఐఫోన్‌కు గట్టి పోటీగా గూగుల్ కొత్త స్కెచ్.. Pxel 11లో ఎవరూ ఊహించని సరికొత్త Glow ఫీచర్!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×