Whatsapp Privacy| సోషల్ మీడియా రంగంలో దిగ్గజ కంపెనీ అయిన మెటా.. ఇప్పుడు తన ప్లాట్ ఫామ్స్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల కోసం మెటా ఏఐని వినియోగిస్తోంది. మిలియన్ల మంది యూజర్లు రోజూ మెటా ఏఐతో మాట్లాడుతున్నారు. ప్రశ్నలు అడుగుతారు, సలహాలు తీసుకుంటారు, పర్సనల్ విషయాలు షేర్ చేస్తారు. కొన్నిసార్లు వారి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే షేర్ అవుతుంది. ఇది డేటా స్టోరేజ్, ప్రైవసీ గురించి ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు మెటా ఏఐ తమ పాత చాట్స్ సేవ్ చేసుకుంటుందా? అని సందేహపడుతన్నారు.
అవును.. మెటా ఏఐ చాట్ కాంటెక్స్ట్‌ను సర్వర్లలో స్టోర్ చేస్తుంది. ఈ డేటా.. ఏఐ రెస్పాన్సెస్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మెటా ఈ చాట్స్‌ను ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగించవచ్చు. అందుకే చాట్స్ కొంతకాలం సేవ్ అవుతాయి. ప్రైవేట్ మెసేజెస్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ గురించి యూజర్లు ఆందోళన చెందుతున్నారు. మెటా ప్రైవసీ ఆందోళనలకు సమాధానంగా టూల్స్ ఇచ్చింది.
మెటా ఏఐ.. చాట్స్ కోసం రీసెట్ కమాండ్ పరిచయం చేసింది. రీసెట్ కమాండ్ కరెంట్ చాట్ కాంటెక్స్ట్ క్లియర్ చేస్తుంది. అంటే మీ పాత చాట్ హిస్టరీ సర్వర్ల నుంచి తొలగిస్తుంది. రీసెట్ తర్వాత ఏఐ పాత చర్చలు గుర్తుంచుకోదు. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లీక్ కాకుండా రీసెట్ ఆప్షన్ సహాయపడుతుంది. రీసెట్ కమాండ్ త్వరిత ప్రైవసీ కంట్రోల్ ఇస్తుంది.
రీసెట్ కమాండ్ మీ మెటా అకౌంట్ డిలీట్ చేయదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ప్రొఫైల్స్‌పై ప్రభావం చూపదు. ఏఐ చాట్ మెమరీ మాత్రమే క్లియర్ అవుతుంది. యాప్ సెట్టింగ్స్, కాంటాక్ట్స్ మారవు. రీసెట్ ఏఐ చాట్ మెమరీకి మాత్రమే పని చేస్తుంది.
యూజర్లు ప్రైవేట్ లేదా ఎమోషనల్ ప్రశ్నలు అడుగుతారు. కొన్ని చాట్స్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రీసెట్ పాత కాంటెక్స్ట్ మళ్లీ ఉపయోగించకుండా ఆపుతుంది. షేర్ చేసిన డేటాపై యూజర్ కంట్రోల్ పెరుగుతుంది. ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నప్పుడు సేఫ్టీ ఫీలింగ్ వస్తుంది. ఏఐ యుగంలో ప్రైవసీ అవేర్‌నెస్ చాలా అవసరం.
రీసెట్ కమాండ్ ఉపయోగించడం చాలా సులువు. మెటా ఏఐ చాట్ విండో ఓపెన్ చేయండి. మెసేజ్ బాక్స్‌లో /reset టైప్ చేయండి. మెసేజ్ సెండ్ చేయండి. కొన్ని సార్లు reset అని టైప్ చేసినా పని చేస్తుంది. మెటా ఏఐ చాట్ కాంటెక్స్ట్ క్లియర్ అయిందని కన్ఫర్మ్ చేస్తుంది. కన్ఫర్మేషన్ తర్వాత ఫ్రెష్ చాట్స్ ప్రారంభమవుతాయి.
Also Read: ఈ స్క్రీన్ షేరింగ్ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి.. ప్రభుత్వ సైబర్‌క్రైమ్ హెచ్చరిక
రీసెట్ తర్వాత ఏఐ మిమ్మల్ని కొత్త యూజర్‌లా ట్రీట్ చేస్తుంది. పాత ప్రశ్నలు, రిప్లైలు గుర్తుంచుకోదు. పాత చాట్ డేటా సర్వర్ మెమరీ నుంచి తొలిగిపోతుంది. కొత్త మెసేజెస్‌పై మాత్రమే రెస్పాన్సెస్ ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా క్లీన్ ఇంటరాక్షన్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.
రీసెట్, మెమరీ డిలీట్ రెండూ వేర్వేరు. రీసెట్ సర్వర్ లెవల్‌లో చాట్ కాంటెక్స్ట్ క్లియర్ చేస్తుంది. ఈ డేటా ఏఐ ట్రైనింగ్‌కు ఉపయోగపడుతుంది. మెమరీ డిలీట్ అకౌంట్ లెవల్‌లో పని చేస్తుంది. సేవ్ చేసిన సజెషన్స్, ప్రిఫరెన్సెస్ తొలగిస్తుంది. మెమరీ డిలీట్ కోసం ప్రైవసీ సెంటర్ వెళ్లాలి. రెండూ వేర్వేరు ప్రైవసీ ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి.
సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత రీసెట్ చేయండి. చాట్స్ చాలా పర్సనల్ అనిపిస్తే రీసెట్ చేయండి. కొత్త టాపిక్స్ స్టార్ట్ చేసే ముందు రీసెట్ చేయండి. రెగ్యులర్ రీసెట్స్ ప్రైవసీ ప్రొటెక్షన్ మెరుగుపరుస్తాయి.
మెటా రెస్పాన్సిబుల్ ఏఐ ఇంటరాక్షన్స్‌ను ప్రోత్సహిస్తుంది. కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ షేర్ చేయొద్దు. ప్రైవసీ టూల్స్ అర్థం చేసుకుంటే డిజిటల్ సేఫ్టీ మెరుగుపడుతుంది. రీసెట్ కమాండ్ యూజర్లకు బెటర్ కంట్రోల్ ఇస్తుంది. జాగ్రత్తగా ఉపయోగిస్తే ఏఐ ఉపయోగకరంగా ఉంటుంది.
మెటా ఏఐ పాపులర్ యాప్స్‌లో ఉపయోగకరమైన ఫీచర్లు ఇస్తుంది. అయితే ప్రైవసీ అవేర్‌నెస్ చాలా ముఖ్యం. రీసెట్ కమాండ్ పర్సనల్ డేటా ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించండి.