ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 24వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.
ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆర్థిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు.
సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.
నూతన రుణప్రయత్నాలు కలిసిరావు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ధన పరంగా కొంత ఇబ్బందులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. రాజకీయ ప్రముఖుల తో చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.
వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు.