E-Paper
Advertisement

Bengaluru Horror: విడాకుల వివాదం.. భార్యని నడిరోడ్డుపై కాల్చిన టెక్కీ, బెంగుళూరులో దారుణం..

Bengaluru Horror: విడాకుల వివాదం.. భార్యని నడిరోడ్డుపై కాల్చిన టెక్కీ, బెంగుళూరులో దారుణం..
Advertisement

Bengaluru Horror: భార్యభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.. దీంతో అనుమానం రెట్టింపు అయ్యింది. ఏడాదిన్నర వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. భార్య విడాకుల నోటీసు పంపడంతో తట్టుకోలేకపోయాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన వద్దనున్న గన్‌తో నడిరోడ్డుపై భార్యని కాల్చి చంపిన ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది.

Advertisement

భార్యభర్తల మధ్య అనుమానం పెనుభూతమైంది

Advertisement

బెంగళూరు ఐటీ హబ్‌లో దారుణమైన ఘటన జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన బాలమురుగన్-భువనేశ్వరిలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెద్దలు అందుకు అంగీకరించలేదు. చివరకు 2011లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఐటీ కంపెనీలో ఉద్యోగం నిమిత్తం 2018లో బాలమురుగన్ బెంగుళూరుకి వెళ్లాడు. అక్క ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన భార్య భువనేశ్వరి యూనియన్ బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్‌గా కొనసాగుతోంది. అయితే సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో ఏం జరిగిందో తెలీదు.

భార్యని నడిరోడ్డుపై కాల్చిన టెక్కీ, బెంగుళూరులో దారుణం 

దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై బాలమురుగన్ అనుమానం మొదలైంది. ఆ తర్వాత మరింత బలపడింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి, చివరకు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఏడాదిన్నర విడివిడిగా ఉంటున్నారు. 

భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన భువనేశ్వరి వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఇల్లు తీసుకుని ఉంటోంది. భార్యపై కక్ష పెంచుకున్న బాలమురుగన్, నాలుగు నెలల కిందట ఆమె ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే అద్దెకు దిగాడు. ఇదిలాఉండగా వారం రోజుల కిందట భార్య నుంచి విడాకుల నోటీసు బాలమురుగన్ వచ్చింది.

ALSO READ: భూవివాదం.. ముగ్గుర్ని దారుణంగా చంపారు

దీంతో టెక్కీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంగళవారం సాయంత్రం దాదాపు ఆరున్నర గంటల సమయంలో భువనేశ్వరి బ్యాంక్ నుంచి ఇంటికి వస్తోంది. అప్పటికే మాటు వేసిన ఆమె బాలమురుగన్, తన దగ్గరున్న గన్‌తో భార్యపై కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో రక్తపు మడుగులో పడిపోయింది.  ఇరుగుపొరుగువారు ఆమెని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆమె చనిపోయింది. ఘటన తర్వాత బాలమురుగన్ నేరుగా మగడి రోడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జరిగినదంతా పోలీసులకు చెప్పారు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. టెక్కీకి గన్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.  ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×