E-Paper
Advertisement

WhatsApp EU Warning: వాట్సాప్‌కు భారీ జరిమానా విధిస్తామని యూరోపియన్ దేశాల వార్నింగ్.. ఎందుకంటే

WhatsApp EU Warning: వాట్సాప్‌కు భారీ జరిమానా విధిస్తామని యూరోపియన్ దేశాల వార్నింగ్.. ఎందుకంటే
Advertisement

WhatsApp EU Warning| వాట్సాప్‌ మాతృక కంపెనీ మెటాకు యూరోప్ దేశాల కూటమి యూరోపియన్ యునియన్(EU) సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. వాట్సాప్ AI పాలసీ వల్ల యూరోపియన్ కాంపిటీషన్ చట్టాలను మెటా ఉల్లంఘించిందని యూరోపియన్ కమిషన్ భావిస్తోంది. మెటా వాట్సాప్‌లో చాట్‌జీపీటీ వంటి థర్డ్-పార్టీ AI అసిస్టెంట్లను బ్లాక్ చేసింది. తన సొంత మెటా AIని మాత్రమే ప్రోత్సహిస్తోందని ఆరోపణలు వచ్చాయి.

AI చాట్‌బాట్ల పోటీకి వాట్సాప్ కీలకం

యూరప్‌లో వాట్సాప్ చాలా పెద్ద మెసేజింగ్ యాప్. కోట్లాది మంది రోజూ వాట్సాప్ ద్వారానే మాట్లాడుకుంటారు. ఇంత పెద్ద యూజర్ బేస్ ఉండటం వల్ల చాట్‌జిపిటి, జెమిని ఏఐ వంటి పాపులర్  AI అసిస్టెంట్లకు ఇది చాలా ముఖ్యమైన ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఒకే బ్రాండ్ AIని మాత్రమే అనుమతిస్తే.. దాని వల్ల నిరంకుశ ధోరణి పెరుగుతుందని ప్రభుత్వ రెగ్యులేటర్లు భావిస్తున్నారు.

యూరోపియన్ యునియన్ ఏం చెప్పింది?

Advertisement

మెటా యూజర్ బేస్ భారీగా ఉండడం వల్ల తన డామినెంట్ పొజిషన్‌ను దుర్వినియోగం చేస్తోందని EU ఆరోపిస్తోంది. వాట్సాప్ శక్తిని ఉపయోగించి మెటా AIని బలవంతంగా యూజర్లపై రుద్దుతోంది. చాట్‌జీపీటీ వంటి పోటీదారు AIలను యూజర్లకు చేరకుండా అడ్డుకుంటోంది. దీని వల్ల మెటాకు భారీగా ప్రయోజనం చేకూరుతోందని యూరోపియన్ కమిషన్ వాదన. దీని వల్ల మిగతా ఏఐ కంపెనీలకు అన్యాయం జరుగుతోంది.

మెటాకు నోటీస్ పంపిన యూరోపియన్ కమిషన్

యూరోపియన్ కమిషన్ మెటాకు “స్టేట్‌మెంట్ ఆఫ్ ఆబ్జెక్షన్స్” పంపింది. ఇది అధికారిక యాంటీట్రస్ట్ దర్యాప్తు ప్రారంభమైందని సమాచారం. ఈ విషయంపై EU ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తెరేసా రిబెరా మీడియాతో మాట్లాడారు. AI అసిస్టెంట్ మార్కెట్‌లో పోటీ ఓపెన్‌గా ఉండాలని ఆమె చెప్పారు. పెద్ద కంపెనీలు ఇన్నోవేషన్‌ను అడ్డుకోకూడదని హెచ్చరించారు.

వివాదం ఎప్పుడు మొదలైంది

Advertisement

అక్టోబర్ 2025లో వాట్సాప్ బిజినెస్ రూల్స్ మార్చుకుంది మెటా. జనవరి 15, 2026 నుంచి థర్డ్-పార్టీ జనరల్ AI అసిస్టెంట్లను తొలగించింది. ఇకపై వాట్సాప్‌లో మెటా AI మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. ఈ మార్పు తర్వాతే వివాదం మొదలైంది.

Also Read: మనుషుల కంటే వేగంగా పరుగులు తీసే రోబో.. ఒక్క సెకనులో 10 మీటర్ల స్పీడ్

తాత్కాలిక చర్యలు

యూరోపియ కమిషన్ తాత్కాలిక చర్యలు తీసుకోవాలని పెట్టాలని ఆలోచిస్తోంది. దర్యాప్తు పూర్తయ్యేలోపు పోటీకి నష్టం జరగకుండా చూడటమే దీని లక్ష్యం. చిన్న AI కంపెనీలు మార్కెట్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చని భయపడుతున్నారు. దీర్ఘకాలిక నష్టం జరిగితే తిరిగి సరిచేయలేమని రెగ్యులేటర్లు భావిస్తున్నారు. అందుకే ఇంకా మెటాపై ఏ విధమైన ఫైన్ విధించలేదు. కేసు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. అయితే తాత్కాలిక చర్యలు వస్తే త్వరగా పాలసీ మార్చాల్సి ఉంటుంది. చాట్‌జీపీటీ వంటి ఇతర AIలకు మళ్లీ వాట్సాప్‌లో అనుమతి రావచ్చు. AI అసిస్టెంట్ మార్కెట్ ఇంకా వేగంగా పెరుగుతోంది. అందరికీ సమాన అవకాశం ఉండాలని EU కోరుకుంటోంది.

వాట్సాప్‌తో AI పోటీ భవిష్యత్తు

ఇప్పుడు అందరి దృష్టి మెటా స్పందనపై ఉంది. ఈ నిర్ణయం యూరప్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా AI పోటీని ప్రభావితం చేస్తుంది. పెద్ద టెక్ కంపెనీలు మార్కెట్‌ను పూర్తిగా కంట్రోల్ చేయకుండా EU అడ్డుకోవాలని చూస్తోంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×