Midea 6kg front load washing machine:ఇంటి పనుల్లో చాలా మంది ఇబ్బంది పడే అతిపెద్ద సవాలు బట్టలు ఉతకడం. ముఖ్యంగా వర్షాకాలంలో లేదా చలికాలంలో బట్టలు త్వరగా ఆరక తలలు పట్టుకుంటారు. ఈ టెన్షన్ అంతటికీ చెక్ పెట్టేస్తూ మార్కెట్‌ను షాక్ ఇస్తోంది కొత్త ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ మోడల్. కేవలం రూ.17,990 బడ్జెట్ ధరలో, ఏకంగా ఇన్-బిల్ట్ హీటర్ ఫీచర్‌తో వస్తున్న ఈ అద్భుతమైన మెషీన్… చిన్న, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల పనిని సూపర్ ఈజీ చేసేయడానికి వచ్చేసింది. మీ బట్టలను కొత్త వాటిలా మెరిపించే.. ఈ ట్రెండీ గ్యాడ్జెట్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!
ఇంటికి ఒక కొత్త అందాన్ని తెచ్చేలా ఈ వాషింగ్ మెషిన్ క్లాసిక్ వైట్ కలర్ ఫినిషింగ్‌తో చాలా ట్రెండీగా తయారు చేసారు. 6 కేజీల సామర్థ్యం ఉన్న ఈ ఫ్రంట్ లోడ్ మెషిన్, 3 నుంచి 4 మంది ఉన్న చిన్న కుటుంబాలకు చాలా పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. సైజులో.. కాంపాక్ట్‌గా ఉండటం వల్ల ఇంట్లో తక్కువ స్థలంలోనే ఇమిడి పోతుంది. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రమ్ డిజైన్ నాణ్యత చెడిపోకుండా.. బట్టలు పిండినప్పుడు పీచులు రాకుండా అత్యంత సున్నితంగా ఉతుకుతుంది.
ఈ వాషింగ్ మెషీన్‌లోని అతిపెద్ద ప్లస్ పాయింట్ దీనిలోని ‘ఇన్-బిల్ట్ హీటర్’ టెక్నాలజీ. సాధారణంగా నీళ్లలో జిడ్డు లేదా కాలర్లపై ఉన్న మొండి మరకలు త్వరగా వదిలిపోవు. కానీ.. ఇందులో నీటిని వేడి చేసే అవకాశం ఉండటం వల్ల, బట్టలకు పట్టిన మొండి మరకలు , మురికిని ఈజీగా తొలగిస్తుంది. అంతేకాకుండా.. వేడి నీటి వాషింగ్ వల్ల బట్టల్లో ఉండే 99.9% బ్యాక్టీరియా, అలర్జీ కారక క్రిములు నశిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకు ఈ హైజీన్ వాష్ ఫీచర్ నిజంగా ఒక బిగ్ అడ్వాంటేజ్.
ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ మెషిన్ కావడంతో.. డ్రమ్‌లో వేసి నచ్చిన వాష్ మోడ్ సెలెక్ట్ చేస్తే చాలు.. ఉతకడం, వాటర్ రొటేషన్, పిండడం, ఆరబెట్టడం అన్నీ ఆటోమేటిక్ గా పూర్తవుతాయి. కాటన్, సింథటిక్, ఉన్ని దుస్తులు, డెలికేట్ డ్రెస్‌ల కోసం వేర్వేరు వాష్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉతకాలనుకుంటున్న బట్టల ఆధారంగా సరైన మోడ్‌ను ఎంచుకుంటే.. బట్టల రంగు , క్లాత్ క్వాలిటీ దెబ్బతినకుండా స్పటికంలా మెరిసేలా చేస్తుంది.
Also Read: రూ.699కే..60 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇయర్‌బడ్స్! మార్కెట్‌లోకి కొత్త మోడల్
సాధారణంగా టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ల కంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు తక్కువ నీటిని, తక్కువ వాషింగ్ పౌడర్‌ను ఉపయోగిస్తాయి.ఈ కంపెనీ.. ఈ మోడల్‌ను పవర్ ఎఫిషియంట్ మోటార్‌తో.. ఉంటుంది. కాబట్టి దీనివల్ల ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు భారం చాలా వరకు తగ్గుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఉండే వారికి కూడా ఈ మెషిన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ నీటితోనే బెస్ట్ వాషింగ్ అందిస్తుంది.
చాలా వాషింగ్ మెషీన్లు పనిచేసేటప్పుడు లేదా స్పిన్ మోడ్‌లో తిరిగేటప్పుడు ఎక్కువ సౌండ్ చేస్తూ వైబ్రేట్ అవుతుంటాయి. కానీ ఈ మోడల్‌లో లేటెస్ట్ యాంటీ-వైబ్రేషన్ టెక్నాలజీ ఉంది. కాబట్టి దీని వల్ల రాత్రి వేళల్లో బట్టలు ఉతికినా సరే ఎలాంటి గోల లేకుండా చాలా ప్రశాంతంగా.. పనిచేస్తుంది.