E-Paper
Advertisement

మినీ ఏసీలు.. ఇవి నిజంగానే కూలింగ్ ఇస్తాయా? అంతా ఉత్తిదేనా? ఫుల్ రివ్యూ

మినీ ఏసీలు.. ఇవి నిజంగానే కూలింగ్ ఇస్తాయా? అంతా ఉత్తిదేనా? ఫుల్ రివ్యూ
Advertisement

Mini ACs: ప్రస్తుతం బయట వాతావరణం ఎలా ఉందంటే.. ఈ ఎండలకు బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తోంది. ఈ వేడిని తట్టుకోలేక ఏదో ఒక ఏసీయో, కూలరో కొనేద్దాం అని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఎక్కువ డబ్బులు పెట్టి ఏసీ కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి టైంలో కొంతమంది కళ్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో తక్కువ ధరకే దొరికే ‘మినీ ఏసీ’లపై పడుతుంటాయి. రకరకాల పేర్లతో తక్కువకే మినీ ఏసీలంటూ ఊరిస్తున్న ఈ చిన్న డబ్బాలు నిజంగానే కూలింగ్ ఇస్తాయా? లేక ఇదంతా ఉత్తదేనా? కాస్త వివరంగా తెలుసుకుందాం రండి.

ఏమిటీ మినీ ఏసీల కథ?

గోడకు తగిలించే పెద్ద పెద్ద ఏసీలకు.. ఈ చిట్టి ఏసీలకు అస్సలు పోలికే లేదు. నిజానికి వీటిని ఏసీ అనడం కంటే ‘టేబుల్ కూలర్’ అనడం కరెక్ట్. ఇది ఒక చిన్న బాక్సులా ఉంటుంది. దీనిని ఫోన్ ఛార్జర్ లాంటి USB కేబుల్ ద్వారా వాడుకోవచ్చు. అలాగే చిన్న నీళ్ల ట్యాంక్, గాలి కోసం ఒక చిన్న ఫ్యాన్ ఉంటాయి. అంతే తప్ప ఇందులో ఏసీల్లో ఉండే గ్యాస్ గానీ, కంప్రెసర్ గానీ ఉండవు.

Advertisement

Also Read: రూ.700 లోపు మల్టీ డివైస్ ఛార్జర్.. ఇక ఫోన్, వాచ్, బడ్స్‌కు ఒకేసారి ఛార్జింగ్ పెట్టేయొచ్చు!

ఇదెలా పనిచేస్తుందంటే?

ఈ మినీ ఏసీల పనితీరు చాలా సింపుల్. ఆ చిన్న ట్యాంక్‌లో కొన్ని ఐస్ ముక్కలు లేదంటే చల్లటి నీళ్లు పోయాలి. లోపల ఉండే ఒక ఫిల్టర్ ఆ నీటిని పీల్చుకుంటుంది. ఇక స్విచ్ వేయగానే వెనుక ఉన్న ఫ్యాన్ తిరిగి ఆ తడి ఫిల్టర్ ద్వారా గాలిని బయటకు నెడుతుంది. దీనివల్ల వచ్చే గాలి కాస్త చల్లగా తగులుతుంది. కానీ, ఇది కేవలం మనం కూర్చున్న చోట (ఒక అడుగు దూరం) వరకు మాత్రమే ఆ చల్లదనాన్ని ఇవ్వగలదు.

గది మొత్తం కూలింగ్ వస్తుందా?

Advertisement

చాలామంది ఒక భ్రమలో ఉంటారు.. ఈ చిన్న డబ్బా కొంటే గది మొత్తం కూల్‌గా అయిపోతుందని. కానీ అది అసాధ్యం. ఇది కేవలం పర్సనల్ కూలర్. ఆఫీసు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు లేదంటే పడుకున్నప్పుడు మన ముఖానికి ఎదురుగా పెట్టుకుంటే గాలి కాస్త చల్లగా ఉంటుంది. అంతే తప్ప.. చిన్న రూమ్‌ని కూడా చల్లబరిచే సామర్థ్యం దీనికి ఏ మాత్రం లేదు.

కొనాలా? వద్దా?

తక్కువ బడ్జెట్‌లో ఆఫీసులో టేబుల్ దగ్గర పెట్టుకోవడానికో లేదంటే చదువుకునేటప్పుడు పక్కన పెట్టుకోవడానికో చూస్తుంటే ఈ మినీ ఏసీలను కొనుగోలు చేయొచ్చు. కానీ, పెద్ద ఏసీ ఇచ్చే చల్లదనం వస్తుందని ఆశపడితే మాత్రం మీ డబ్బులు వృధా అయినట్టే. పైగా ఇది వాడటం వల్ల గదిలో ఉక్కపోత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి.. కొనేముందు ఇది ఒక చిన్న ఫ్యాన్ లాంటి కూలర్ మాత్రమే అని గుర్తుంచుకోండి. లైట్లు మెరుస్తూ చూడటానికి స్టైలిష్‌గా ఉన్నా.. పనితీరులో మాత్రం దీనికి చాలా పరిమితులు ఉన్నాయి.

Also Read: BSNL సిమ్ తీసుకుంటున్నారా? ముందు మీ ఏరియాలో సిగ్నల్ వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×