E-Paper
Advertisement

CP Sajjanar: ఆస్పత్రిలో 35 మంది రౌడీ షీటర్లు.. వెళ్లి కలిసిన సీపీ సజ్జనార్.. ఆపై స్ట్రాంగ్ వార్నింగ్!

CP Sajjanar: ఆస్పత్రిలో 35 మంది రౌడీ షీటర్లు.. వెళ్లి కలిసిన సీపీ సజ్జనార్.. ఆపై స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

CP Sajjanar: రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని గౌరవప్రదమైన జీవితం గడపాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు 239మంది రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు జరిపిన విషయం తెలిసిందే. దీంట్లో 188మందికి పాజిటీవ్ వచ్చింది. దాంతో వారిని వేర్వేరు డీ అడిక్షన్ సెంటర్లలో చేర్పించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో కౌన్సిలింగ్ తీసుకుంటున్న 35మందితో శుక్రవారం సీపీ సజ్జనార్ మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితితోపాటు వ్యసనం నుండి బయటపడటానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి బాధితులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. అనంతరం వైద్యులతో సమావేశమై కౌన్సెలింగ్ ప్రక్రియ, చికిత్స అందిస్తున్న తీరును ఆడిగి తెలుసుకున్నారు.

Advertisement

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులకు, ముఖ్యంగా యువతకు డ్రగ్ టెస్టులు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రతిపాదనలతో రాష్ట్రవ్యాప్తంగా 35 డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడ కూడా ఇన్ని డీ ఆడిక్షన్ కేంద్రాలు లేవని సజ్జనార్ అన్నారు. ఒకవైపు బాధితులను వ్యసనం నుండి విముక్తులను చేస్తూనే మరోవైపు డ్రగ్స్ విక్రేతలపై ఉక్కుపాదం మోపుతామని సజ్జనార్ హెచ్చరించారు. నిందితులపై హిస్టరీ షీట్లు తెరిచి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో డ్రగ్స్ నియంత్రణకు హెచ్-న్యూ విభాగం అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు.

Advertisement

Also Read: BSNL Plan: కేవలం రూ.8కే.. 2.5GB హై స్పీడ్ డేటా.. 30 రోజులు నాన్‌స్టాప్ ఫన్!

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులతో సహకరించాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. మరోవైపు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి నేతృత్వంలోని వైద్య బృందం, పోలీస్ విభాగం సమన్వయంతో పనిచేయటాన్ని అభినందించారు. కాగా ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, సైకియాట్రీ హెచ్ఓడీ డాక్టర్ సురేష్, ఆర్ఎంవోలు డాక్టర్ శేషాద్రి, డాక్టర్ యుగేందర్, సికింద్రాబాద్ డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఏసీలో పసిపిల్లల్ని పడుకోబెడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే చాలా ప్రమాదం!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×