Friday: శుక్రవారం ఎవరైతే గుమ్మం దగ్గర ఆ వస్తువులు పెడతారో ఆలాంటి వారికి పట్టిన దరిద్రం మొత్తం పోతుందట. ఎన్ని ఆర్థిక కష్టాల్లో ఉన్నా వారిని లక్ష్మీ దేవి కరుణించి కోటీశ్వరులను చేస్తుందట. ఇంతకీ శుక్రవారం గుమ్మం దగ్గర పెట్టాల్సిన వస్తులేంటి..? ఎలా పెట్టాలి..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రాల ప్రకారం, శుక్రవారం రోజు ఇంటి ముఖద్వారం (గుమ్మం) వద్ద కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి (దరిద్రం) తొలగిపోయి, సంపద మరియు శుభాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా ఆ వస్తువులను ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మం ముందు పెడుతూ ఉంటే బికారి అయినా లక్షాధికారి అవుతాడట. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా ఇట్టే తీరిపోతాయట. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారైనా బయట పడతారట. అయితే శుక్రవారం ఇంటి గుమ్మం దగ్గర ఉంచాల్సివేటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీటితో నింపిన పళ్ళెం మరియు పూలు: ఎవరైతే శుక్రవారం రోజు తమ ఇంటి గుమ్మం వద్ద ఒక వెడల్పాటి పాత్రలో (ఉరులి) నీరు పోసి, అందులో తాజా పూలు లేదా పూల రేకులను వేస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి పరుగెత్తుకుంటూ వస్తుందట. ఇలా చేయడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు. ఇది ఇంటికి సానుకూల శక్తిని ఆకర్షిస్తుందట. అలాగే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తుందట. ఇంట్లోకి లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించడానికి ఇది ఒక సంకేతంగా బావించాలట.
గడపకు పసుపు మరియు కుంకుమ: ఎవరైతే ప్రతి శుక్రవారం ఉదయాన్నే తమ ఇంటి గుమ్మాన్ని కడిగి, ఇరువైపులా పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి పిలవకుండానే వస్తుందట. ఆ ఇంట్లోని సమస్యలు తగ్గుముఖం పడతాయట. ఇంకా ఇలా చేయడం వల్ల శాస్త్రీయంగా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పండితులు. గడపకు పసుపు రాయడం వల్ల బయటి నుంచి వచ్చే క్రిములను పసుపు గడప దగ్గరే అడ్డుకుంటుందట. అలాగే బయటి నుంచి వచ్చే దుష్టశక్తులను కూడా పసుపు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని పండితులు సూచిస్తున్నారు.
స్వస్తిక్ లేదా ఓం గుర్తు: సింధూరం లేదా పసుపుతో గుమ్మం మీద స్వస్తిక్ గుర్తును వేయాలట. ఇలా చేయడం వల్ల ఇది అదృష్టాన్ని మరియు విజయానికి దారితీసే మార్గాలను సుగమం చేస్తుందట.
గడపకు మామిడి ఆకుల తోరణాలు: ఎవరైతే ప్రతి శుక్రవారం తమ గడపకు మామిడి ఆకుల తోరణాలు కడతారో ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. మామిడి ఆకులు ఇంట్లోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా, మంగళకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయట. ఇంకా గడపకు పసుపు రంగుల పూల మాల కట్టడం కూడా మంచిదేనని సూచిస్తున్నారు పండితులు.
ఉప్పు నీటితో ఇల్లు శుద్ది చేయడం: ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు లేదా గుమ్మం కడిగేటప్పుడు నీటిలో కొంచెం కల్లు ఉప్పు (Rock Salt) వేయాలట. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుంట. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందట.
సాయంత్రం దీపం వెలిగించడం: ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి గుమ్మం దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.