E-Paper
Advertisement

రూ.599లకే 45 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇయర్ బడ్స్..

రూ.599లకే 45 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇయర్ బడ్స్..
Advertisement

Mivi Duopods B1: ప్రస్తుతం వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు.. లేదా మ్యూజిక్ వినేటప్పుడు ఇయర్‌ బడ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దేశీయ బ్రాండ్ ‘మివి’మార్కెట్లోకి తీసుకొచ్చిన అద్భుతమైన బడ్జెట్ ఇయర్‌బడ్స్ ‘Mivi Duopods B1’. కేవలం రూ. 599 ధరకే లభిస్తున్న ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ యొక్క ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలక్ట్రానిక్ మార్కెట్లో క్వాలిటీ  ఆడియో ప్రొడక్ట్స్ అందించడంలో మివి సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించడంలో ఈ బ్రాండ్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా కస్టమర్ల కోసం కంపెనీ లాంచ్ చేసిన ఈ మోడల్ ఇయర్‌బడ్స్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం సాధారణ వాడకానికే కాకుండా, మ్యూజిక్ లవర్స్‌ను సైతం ఆకట్టుకునేలా ఈ ఇయర్‌ బడ్స్‌ను తయారు చేశారు. స్టైలిష్ లుక్, తక్కువ బరువుతో ఇవి చెవులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి.

45 గంటల భారీ ప్లేటైమ్, పవర్‌ఫుల్  బ్యాటరీ:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ మెచిన్ హైలైట్ దీని బ్యాటరీ బ్యాకప్. చిన్నగా ఉన్నప్పటికీ, ఇవి మొత్తం 45 గంటల భారీ ప్లేటైమ్‌ను అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి దీన్ని రోజూ వాడినా చాలా రోజుల పాటు బ్యాటరీ టెన్షన్ ఉండదు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ప్రయాణాల్లో కూడా ఎలాంటి కొన్ని గంటల పాటు పాటలు వినవచ్చు, కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి తద్వారా తక్కువ సమయంలోనే ఇయర్‌ బడ్స్ పూర్తిగా ఛార్జ్ అవుతాయి.

ఏఐ ఎన్సీటెక్నాలజీ:

ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు చుట్టుపక్కల వచ్చే శబ్దం డిస్టర్బ్ చేయకుండా.. ఉండేందుకు ఇందులో లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్‌ను పొందుపరిచారు. దీని వల్ల రద్దీ రోడ్లపై లేదా బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ అవలికి స్పష్టమైన హెచ్‌డీ కాల్ ఆడియో అందుతుంది. ఎదురుగా మాట్లాడేవారికి.. మీ గొంతు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

Advertisement

Also Read: రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

లేటెస్ట్ బ్లూటూత్ 5.3, డ్రైవర్ పవర్:

ఈ డివైజ్‌లో లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3 టెక్నాలజీని వాడారు. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్‌కు ఇయర్‌ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. అంతే కాకుండా దీని కనెక్షన్ కూడా స్థిరంగా ఉంటుంది. ఆడియో లాగ్ సమస్య లేకుండా గేమింగ్ ఆడేందుకు వీలుగా ప్రత్యేకమైన గేమింగ్ మోడ్ కూడా ఇందులో ఉంది. ఇయర్‌ బడ్స్‌లోని 13ఎంఎం డైనమిక్ డ్రైవర్లు డీప్ బేస్, పర్ఫెక్ట్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, వాల్యూమ్ పెంచడం వంటివి ఈజీగా చేయొచ్చు.

ధర, ఆఫర్ వివరాలు:

మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్ల ఇయర్‌ బడ్స్‌తో పోలిస్తే.. మివి డ్యూపాడ్స్ B1 ధర చాలా తక్కువగా ఉంది. ఈ ‘Mivi Duopods B1’అసలు ధర రూ.2,999 అయినప్పటికీ.. ప్రస్తుత ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో బంపర్ ఆఫర్‌ భాగంగా కేవలం రూ.599 ధరకే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన, ఎక్కువ రోజులు వచ్చే వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కోరుకునే.. వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Related News

రూ.2,390లకే డైమండ్ కట్ డిజైన్ స్మార్ట్‌వాచ్..పెబుల్ వియన్నా స్పెషల్ లుక్!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 మైక్ ENC ఫీచర్‌తో కొత్త బౌల్ట్ ఇయర్‌బడ్స్!

క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

రూ.18 వేలకే.. స్టాండింగ్ డిష్‌వాషర్, వెంటనే కొనేయండి

రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

రూ.998లకే పోర్టబుల్ జ్యూసర్..ఆఫీస్‌,జిమ్‌కు పర్ఫెక్ట్

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా?రూ.7,990లకే 24 ఇంచుల టీవీ

Big Stories

Advertisement
×