E-Paper
Advertisement

సరికొత్త కౌంటర్‌టాప్ కుక్కర్లు.. జెట్ వేగంతో కుకింగ్ చేయెుచ్చు.. మీ ఊహకు అందని బెన్‌ఫిట్స్!

సరికొత్త కౌంటర్‌టాప్ కుక్కర్లు.. జెట్ వేగంతో కుకింగ్ చేయెుచ్చు.. మీ ఊహకు అందని బెన్‌ఫిట్స్!
Advertisement

Countertop Cookers: వంటగదిలో సాంప్రదాయబద్దంగా వినియోగిస్తున్న మైక్రో వేవ్ లకు అద్భుతమైన ప్రత్యామ్నయం మార్కెట్లోకి వచ్చింది. కొత్త రకం మోడరన్ కౌంటర్‌టాప్ కుక్కర్లు (Modern Countertop Cookers) అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి మైక్రోవేవ్ కంటే వేగంగా కుకింగ్ చేయడంతో పాటు.. తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో వీటి వినియోగం క్రమంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ కౌంటర్ టాప్ ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మైక్రోవేవ్ కంటే ఏవిధంగా బెటర్?

సాధారణంగా మైక్రోవేవ్‌లు కేవలం విద్యుదయస్కాంత తరంగాల (Electromagnetic waves) ద్వారా ఆహారాన్ని వేడి చేస్తాయి. కానీ ఈ సరికొత్త కౌంటర్ టాప్ కుక్కర్లు.. రేడియో ఫ్రీక్వెన్సీ, కన్వెక్షన్, ఇన్‌ఫ్రారెడ్ వంటి బహుళ సాంకేతికతలను కలగలిపి ఆహార పదార్థాలను హీట్ చేస్తాయి.

సమానమైన వేడి

Advertisement

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని ఉంచినప్పుడు.. కొన్ని చోట్ల చల్లగా, మరికొన్ని చోట్ల వేడిగా ఉంటుంది. కానీ ఈ కొత్త కౌంటర్ టాప్ కుక్కర్లు.. ఆహారం లోపల, బయట ఒకేలా సమానంగా ఉడికేలా చేస్తాయి. ప్రతీ అణువుపై హీట్ ప్రభావాన్ని చూపిస్తూ వేడి చేస్తాయి.

అద్భుతమైన రుచి

మైక్రోవేవ్‌లో వండినప్పుడు ఒక్కోసారి ఆహారం మెత్తగా అయిపోతుంది. దీనివల్ల రుచి కూడా తగ్గిపోతుంది. అయితే ఈ అధునాతన కుక్కర్లలో.. ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఆహారం మెత్తగా అవ్వదు. పైగా పైభాగంలో క్రిస్పీగా, బ్రౌన్ కలర్‌లో రుచిగా వస్తుంది. ఇది చూడటానికి రెస్టారెంట్ స్టైల్ ఫీల్ ను కలిగిస్తుంది.

విద్యుత్ బిల్లు ఆదా

Advertisement

సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే మైక్రో ఓవెన్లు, మైక్రోవేవ్‌లతో పోలిస్తే ఇది 20 శాతం నుంచి 30 శాతం వరకు తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి నేరుగా ఆహారంపైనే వేడిని కేంద్రీకరించడం వల్ల హీటింగ్ పవర్ వృథా కాదని స్పష్టం చేస్తున్నారు.

సూపర్ వేగంతో వంట

నిపుణుల పరిశోధనల ప్రకారం.. కౌంటర్ టాప్ కుక్కర్లు.. మైక్రోవేవ్ కంటే చాలా వేగంగా వంటను పూర్తి చేస్తున్నట్లు తేలింది. ఇవి చాలా తక్కువ సమయంలోనే వంటను రుచిగా, ఆకర్షణీయమైన లుక్ తో ఫినిష్ చేస్తున్నట్లు వెల్లడైంది.

Also Read: రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

వీటితో ఏవేం చేయవచ్చంటే?

కౌంటర్ టాప్ కుక్కర్లను వేడి చేయడానికే కాకుండా.. బేకింగ్, రోస్టింగ్, గ్రిల్లింగ్ వంటి పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకే పరికరంతో మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రైయర్, ఓవెన్ పనులను చేసేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ప్రస్తుతం ఈ రకమైన ఆర్ఎఫ్ కౌంటర్‌టాప్ ఓవెన్లు, హైబ్రిడ్ కుక్కర్లు బాగా పాపులర్ అవుతున్నాయి. మైక్రోవేవ్ కేవలం వేడి చేసుకోవడానికి పరిమితమైతే.. ఈ కొత్త కుక్కర్లు పూర్తి స్థాయి వంటకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

Also Read: వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 5G సేవలు.. గెట్ రెడీ అంటూ మెసేజ్‌లు!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×