E-Paper
Advertisement

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 5G సేవలు.. గెట్ రెడీ అంటూ మెసేజ్‌లు!

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 5G సేవలు.. గెట్ రెడీ అంటూ మెసేజ్‌లు!
Advertisement

Vi 5G in Hyderabad: హైదరాబాద్ లోని తమ యూజర్లు వొడాఫోన్ ఐడియా (Vi) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే నగరంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు కస్టమర్లకు.. వీఐ నుంచి ఎస్ఎంఎస్ సందేశాలు సైతం వెళ్తున్నాయి. 5G సేవలు వినియోగించుకునేందుకు రెడీగా ఉండాలంటూ కంపెనీ వర్గాలు.. యూజర్లను అలర్ట్ కూడా చేస్తున్నాయి.

SMSలో ఏముందంటే?

హైదరాబాద్‌లోని Vi యూజర్లకు ‘త్వరలో మీరు సూపర్ ఫాస్ట్ 5Gని అనుభవించబోతున్నారు’ అనే అర్థం వచ్చేలా మెసేజ్‌లు అందుతున్నాయి. ఎయిర్ టెల్, జియో యూజర్ల గత అనుభవాన్ని బట్టి చూస్తే.. సాధారణంగా ఇలాంటి మెసేజ్‌లు సదరు నగరంలో 5G నెట్‌వర్క్ రోల్‌అవుట్ తుది దశలో ఉందని అర్థం. అయితే వీఐ నుంచి 5G డేటా లాంచింగ్ కు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

మే చివరి నాటికి..!

Advertisement

ఇదిలా ఉంటే.. వీఐ తన 5G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా మే చివరి నాటికి 133 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలో పెద్ద ఎత్తున టెక్ నిపుణులు, స్టార్టప్ కంపెనీలు.. తమ ఆఫీసు అవసరాలు, వినోదం కోసం పెద్ద ఎత్తున 5G సేవలపై ఆధారపడుతున్నాయి. కాబట్టి వీఐ కూడా నగరంలో తన 5G సేవలను విస్తరిస్తే.. జియో, ఎయిర్ టెల్ కు గట్టి ప్రత్యామ్నయం లభించినట్లు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏఐ టెక్నాలజీ వినియోగం..

మరోవైపు వీఐ తన నెట్ వర్క్ నాణ్యతను మరింత పెంచడానికి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆప్టిమైజింగ్ నెట్‌వర్క్స్ (SON) సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా నోకియా, ఎరిక్సన్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు సైతం కుదుర్చుకుంది.

Advertisement

Also Read: అమ్మబాబోయ్, 10,200mAh బ్యాటరీతో.. Vivo Y600 Pro లాంచ్.. ధర కూడా చాలా తక్కువే!

కొన్ని ప్రాంతాల్లో మాత్రమే..!

తొలిదశ నెట్ వర్క్ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే 5G సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఇండస్ట్రియల్ కారిడార్లు, డేటా వినియోగం ఎక్కువగా ఉండే ఐటీ హబ్ జోన్స్, 5G ఫోన్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ ప్రాధాన్యత లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 5G సేవలకు సంబంధించిన ప్లాన్స్ వివరాలను అతి త్వరలోనే వీఐ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.

Also Read: జొమాటో సంచలనం.. డెలివరీ బాయ్స్‌కు కూలింగ్ వెస్ట్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×