E-Paper
Advertisement

Bhukya Yashwanth: పర్వతారోహకుడు యశ్వంత్ మరో సంచలనం.. డియోమాలి శిఖరాన్ని అధిరోహించిన యువకుడు

Bhukya Yashwanth: పర్వతారోహకుడు యశ్వంత్ మరో సంచలనం.. డియోమాలి శిఖరాన్ని అధిరోహించిన యువకుడు
Advertisement

Bhukya Yashwanth: పర్వతారోహకుడు యశ్వంత్ నాయక్ మరో సంచలనం సృష్టించాడు. ఒడిశా రాష్ట్రంలోని డియోమాలిని పర్వతాన్ని అధిరోహించి తన సత్తా చాటుకున్నాడు. తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్(Bhukya Yashwanth) 2026 జనవరి 30న ఒడిశాలోనే అత్యంత ఎత్తైన శిఖరం డియోమాలి (1672 మీటర్లు) ని అధిరోహించి తన ఘనతను చాటుకున్నాడు. భారతదేశంలోనే 28 రాష్ట్రాలలో ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంతో మరో మైలురాయిని యశ్వంత్ దాటాడు. భారతీయ యువతలో సాహస క్రీడలు, శారీరక దృఢత్వం, స్థితిస్థాపకతను ప్రోత్సహించే లక్ష్యంతో యశ్వంత్ దేశవ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతారోహణ ప్రచారంలో భాగంగా డియోమాలి యాత్ర చేపట్టాడు. ఇప్పుడు సాధించిన విజయంతో యశ్వంత్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, త్రిపుర, అస్సాం, రాజస్థాన్ లతోపాటు ఒడిశాలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి మహబూబాబాద్ జిల్లా ఘనతను ప్రపంచానికి చాటుతున్నాడు. 28 రాష్ట్రాల్లో హై పాయింట్స్ ఛాలెంజ్ ను పూర్తిచేసే దిశగా స్థిరమైన పురోగతిని యశ్వంత్ సాధిస్తున్నాడు.

అంతర్జాతీయ, అధిక ఎత్తు విజయాలు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్య తండా యశ్వంత్ స్వగ్రామం. పేద గిరిజన కుటుంబంలో జన్మించిన ఆ యువకుడు తన కలల సాకారానికి అడుగులు వేస్తున్నాడు. ఆకాశమే హద్దుగా ఆచంచలమైన ఆత్మవిశ్వాసంతో పర్వతాలను అవలీలగా అధిరోహిస్తున్నాడు. సాధించాలన్న కసికి పట్టుదల తోడైతే కొండలైన పిండి చేయగలనన్న ధీమాతో ముందుకెళ్తున్న ఆ గిరిపుతుడే భూక్య యశ్వంత్. యశ్వంత్ అనేక సవాళ్లతో కూడిన అంతర్జాతీయ ఎత్తైన యాత్రలను విజయవంతంగా పూర్తి చేస్తున్నాడు. వాటిలో కిలిమంజారో పర్వతం (టాంజానియా, ఆఫ్రికా) 5895 మీటర్లు, మౌంట్ ఎల్బ్రస్ (రష్యా, యూరప్) 5642 మీటర్లు, మౌంట్ కోస్సీయుస్కో (ఆస్ట్రేలియా) 2228 మీటర్లు, (7310అడుగులు), మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (ఈబిసి నేపాల్) 5364 మీటర్లు, మౌంట్ కాంగ్ యాట్స్ 2(లడక్, భారతదేశం) 6,250 మీటర్లు, మౌంట్ గోర్చెన్ (అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం) 6488 మీటర్లు విజయవంతంగా అధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా యశ్వంత్ రికార్డు సాధించారు.

Advertisement

Also Read: Singer Chitra : బిర్యానీ పై సింగర్ చిత్ర కామెంట్స్.. ఆమె ఫేవరెట్ ఫుడ్ ఇదే..

ప్రపంచవ్యాప్తంగా..

ఈ విజయాలు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎత్తైన, అత్యంత సవాళ్లతో కూడిన శిఖరాలను అధిరోహించడంలో అతని నిబద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. విజయవంతమైన అధిరోహణ తర్వాత తన ఆలోచనలను పంచుకుంటూ, ప్రతి శిఖరాగ్ర సమావేశం బలపరుస్తుందని పేర్కొన్నాడు. యశ్వంత్ తన జాతీయ, అంతర్జాతీయ పర్వతారోహణ ఆశయాలను సాధించడానికి దగ్గరగా వెళుతున్న కొద్ది రాబోయే యాత్రలకు తన సన్నాహాలు కొనసాగిస్తున్నాడు.

సహకారం ఉంటే ఎవరెస్ట్ ఎక్కుతా..

Advertisement

ప్రపంచంలోనే ఎవరూ కూడా చేయని సాహసం చేసిన యశ్వంత్ నాయక్ ఈ సీజన్లో ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి ప్రణాళికలు రచించుకుంటున్నానని స్వేచ్ఛ తో మాట్లాడాడు. ఇప్పటికే కొంత ఆర్థికంగా సమకూర్చుకున్నప్పటికీ, ఇంకా కొంత ఆర్థిక సహకారం అందించాలని దాతలను కోరుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడిగా ఉండి వివిధ రకాల ఎత్తైన పర్వతారోహణ లను అధిరోహించిన యశ్వంత్ నాయక్ కు దాతలు సహకరించాలని కోరుతున్నాడు.

Also Read: Oppo Reno 15 Pro: 200MP కెమెరాగల ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×