E-Paper
Advertisement

మీ ఫోన్ వర్షంలో తడిసిందా? ఈ 5 తప్పులు చేస్తే.. ఇక అంతే సంగతులు!

మీ ఫోన్ వర్షంలో తడిసిందా? ఈ 5 తప్పులు చేస్తే.. ఇక అంతే సంగతులు!
Advertisement

Wet Smartphone Tips: దేశంలో వర్షాకాలం మెుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వానలు ప్రారంభమయ్యాయి. అయితే రెయినీ సీజన్ లో స్మార్ట్ ఫోన్లు తడవటం అనేది సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఫోన్ తడిచింది కదా అని కొంతమంది ఇష్టం వచ్చినట్లు సొంత వైద్యాలు చేసేస్తుంటారు. దీనివల్ల ఫోన్ శాశ్వతంగా పాడయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ వర్షంలో తడిసిపోతే అస్సలు చేయకూడని 5 తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫోన్‌ను ఆన్ చేయడం

ఫోన్ తడిసిన వెంటనే అది పనిచేస్తుందో లేదో చూడటానికి చాలామంది స్క్రీన్ ఆన్ చేస్తారు లేదా బటన్స్ నొక్కుతారు. ఇది చాలా పెద్ద తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ లోపల నీరు ఉన్నప్పుడు విద్యుత్ ప్రసరిస్తే షార్ట్ సర్క్యూట్ జరిగి మదర్‌బోర్డ్ పూర్తిగా పాడయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.

హెయిర్ డ్రైయర్ వాడొద్దు

Advertisement

కొందరు ఫోన్‌ను త్వరగా ఆరబెట్టాలనే ఆరాటంతో హెయిర్ డ్రైయర్ ను వినియోగిస్తుంటారు. అయితే డ్రైయర్ నుండి వచ్చే వేడి గాలి ఫోన్ లోపల ఉన్న సున్నితమైన ప్లాస్టిక్ భాగాలను, స్క్రీన్‌ను కరిగించేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఆ గాలి ఒత్తిడికి నీటి చుక్కలు ఫోన్ లోపలికి ఇంకా లోతుగా వెళ్తాయని పేర్కొంటున్నారు.

బియ్యం డబ్బాలో పెట్టడం

చాలా మంది ఫోన్ తడిచిన వెంటనే బియ్యం డబ్బాలో వేస్తుంటారు. అలా చేస్తే తేమను బియ్యం పీల్చేసుకుంటుందని అభిప్రాయపడుతుంటారు. కానీ ఇది పెద్ద పొరపాటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యంలోని సన్నటి పిండి పదార్థం, దుమ్ము ఫోన్ హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్ట్‌లలోకి చేరి శాశ్వతంగా బ్లాక్ చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

వెంటనే ఛార్జింగ్‌ పెట్టొద్దు

Advertisement

ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టడమంటే చేతులారా ఫోన్‌ను కాల్చేసుకోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఛార్జింగ్ పోర్ట్‌లో తడి ఉంటే కరెంట్ పాస్ అవ్వగానే ఫోన్ డెడ్ అయిపోతుందని పేర్కొంటున్నారు. ఫోన్ పూర్తిగా ఆరిపోయిందని నమ్మకం వచ్చే వరకు ఛార్జర్‌కు దూరంగా ఉంచడం బెటరని సూచిస్తున్నారు.

Also Read: స్కూల్లో రైడ్.. రూ.కోటి నగదు, మద్యం, కం*డోమ్స్ లభ్యం.. పోలీసులకే మైండ్ బ్లాక్!

గట్టిగా ఊపడం, తుడవడం

ఫోన్ లోపల నీరు పోయిందని గట్టిగా ఊపితే.. ఒకచోట ఉన్న నీరు ఫోన్ మొత్తం వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫోన్ తడిస్తే ముందుగా సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ బయటకు తీసి పొడి గుడ్డతో తుడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాన్ కింద లేదా గాలి తగిలే చోట కదల్చకుండా ఉంచడమే బెటరని స్పష్టం చేస్తున్నారు.

Also Read: చాంతాడంత బ్యాటరీ.. మూడు రోజుల బ్యాకప్.. మార్కెట్లోని టాప్-4 బాహుబలి ఫోన్లు!

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×