E-Paper
Advertisement

రూ.15వేల బడ్జెట్‌లో 7,000mAh బ్యాటరీ ఫోన్.. దుమ్మురేపుతున్న Moto G37 Power!

రూ.15వేల బడ్జెట్‌లో 7,000mAh బ్యాటరీ ఫోన్.. దుమ్మురేపుతున్న Moto G37 Power!
Advertisement

Moto G37 Power: ప్రీమియం సెగ్మెంట్‌లో వరుస ఫోన్లను లాంచ్ చేసిన మోటొరోలా.. ఇప్పుడు బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త Moto G37 Power స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన డిజైన్, మన్నికైన బాడీతో వచ్చిన ఈ ఫోన్ సామాన్యుల బడ్జెట్‌కు తగ్గట్టుగా అందుబాటులో ఉంది. ఇప్పుడీ హ్యాండ్ సెట్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

ధర వివరాలు ఇలా:

ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4GB + 64GB ధర రూ.14,999 కాగా.. 4GB + 128GB ధర రూ.15,999, టాప్ వేరియంట్ 8GB + 128GB ధర రూ.18,999గా ఉంది. మే 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడేవారికి రూ.950 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇందులో కాప్రి, నాటికల్ బ్లూ కలర్స్ వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో, బ్లాక్ కలర్ పటిష్టమైన పీఎమ్‌ఎమ్‌ఏ ఫినిషింగ్‌తో వస్తున్నాయి.

Advertisement

Also Read: Oppo Reno 16 Series లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. అదిరిపోయే ఫీచర్లతో ఆ రోజున గ్రాండ్ ఎంట్రీ!

పవర్‌ఫుల్ బ్యాటరీ, డిస్‌ప్లే:

పేరుకు తగ్గట్టుగానే ఈ ఫోన్‌లో భారీ 7,000mAh బ్యాటరీని అందించారు. దీనికి తోడు 30W టర్బో పవర్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు తడి చేతులతో కూడా పనిచేసే ‘స్మార్ట్ వాటర్ టచ్’ ఫీచర్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో పాటు ఐపీ64 రేటింగ్ ఉండటం వల్ల ఫోన్ కిందపడినా త్వరగా పగలదు. డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు దీనికి అదనపు ఆకర్షణ.

మెరుగైన పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయడమే కాకుండా.. రోజంతా వాడటానికి, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక కెమెరాల పరంగా చూస్తే.. వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాతో పాటు లైట్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. దీంతోపాటు ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

లేటెస్ట్ సాఫ్ట్‌వేర్:

Moto G37 Power సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనికి ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తో పాటు మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. పెద్ద బ్యాటరీ, స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం, గట్టి బాడీని కోరుకునే వారికి బడ్జెట్ ధరలో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: రూ.799కే వాయిస్ ఛేంజర్ నెక్ బ్యాండ్.. ఇక ఫ్రెండ్స్‌కి ప్రాంక్ కాల్స్ చేసి ఆటపట్టించడమే!

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×