E-Paper
Advertisement

Oppo Reno 16 Series లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. అదిరిపోయే ఫీచర్లతో ఆ రోజున గ్రాండ్ ఎంట్రీ!

Oppo Reno 16 Series లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. అదిరిపోయే ఫీచర్లతో ఆ రోజున గ్రాండ్ ఎంట్రీ!
Advertisement

Oppo Reno 16 Series: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో నుంచి సరికొత్త ఫీచర్లతో కూడిన Oppo Reno 16 సిరీస్ చైనా మార్కెట్లో మే 25న అధికారికంగా విడుదల కానుంది. ప్రారంభంలో ఇందులో Reno 16, Reno 16 Pro మోడళ్లు రానున్నాయి. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి Reno 16 Pro Moni, Reno 16C వేరియంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఫోన్లను ఇష్టపడే వారి కోసం కంపెనీ ఈసారి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

డిస్‌ప్లే, ప్రాసెసర్ విశేషాలు:

తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. బేసిక్ మోడల్ అయిన Reno 16 ఫోన్ 6.32 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో రానుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8550 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇక ప్రీమియం మోడల్ అయిన Reno 16 Pro విషయానికొస్తే.. ఇది పెద్దదైన 6.78 అంగుళాల స్క్రీన్‌తో పాటు, సరికొత్త డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. రెండు ఫోన్లలోనూ 1.5K రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: రూ.799కే వాయిస్ ఛేంజర్ నెక్ బ్యాండ్.. ఇక ఫ్రెండ్స్‌కి ప్రాంక్ కాల్స్ చేసి ఆటపట్టించడమే!

భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరా:

ఈ సిరీస్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని భారీగా పెంచారు. Reno 16 మోడల్‌లో 80W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 6,700mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే Pro మోడల్‌లో 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 7,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఇక కెమెరాల పరంగా చూస్తే.. రెండింటిలోనూ వెనుక వైపు 200MP ప్రధాన కెమెరాతో పాటు, రెండు 50MP కెమెరాలు (అల్ట్రావైడ్, పెరిస్కోప్) ఉంటాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరాను అమర్చారు.

కొత్తగా స్నాప్ కీ ఫీచర్:

Advertisement

ఈ ఫోన్లకు ప్రీమియం లుక్ ఇచ్చేందుకు మెటల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. అలాగే ధూళి, నీటి నుండి రక్షణ కోసం IP69 రేటింగ్‌ను అందించారు. వీటన్నింటితో పాటు.. వన్‌ప్లస్ ఫోన్లలో ఉండే ‘ప్లస్ కీ’ తరహాలోనే ఇందులో కూడా షార్ట్‌కట్‌ల కోసం ‘స్నాప్ కీ’ అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు.

భారత్‌లోకి ఎప్పుడు రావచ్చు?

ఇండియా లాంచ్ గురించి ఒప్పో ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జూన్ లేదా జూలై నెలల్లో ఇవి మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే Reno 16 Pro మోడల్ భారతీయ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. Reno 14 లేదా అంతకంటే పాత ఫోన్లు వాడుతున్న వారికి ఈ సిరీస్ ఒక మంచి అప్‌గ్రేడ్ అవుతుంది. అయితే, ఇప్పటికే Reno 15 వాడుతున్న వారు మాత్రం దీని ధర, పనితీరును చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Also Read: టీనేజర్లకు పేటిఎం బంపర్ ఆఫర్.. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×