E-Paper
Advertisement

రూ.799కే వాయిస్ ఛేంజర్ నెక్ బ్యాండ్.. ఇక ఫ్రెండ్స్‌కి ప్రాంక్ కాల్స్ చేసి ఆటపట్టించడమే!

రూ.799కే వాయిస్ ఛేంజర్ నెక్ బ్యాండ్.. ఇక ఫ్రెండ్స్‌కి ప్రాంక్ కాల్స్ చేసి ఆటపట్టించడమే!
Advertisement

U&i Entry Star Series: ప్రముఖ టెక్ బ్రాండ్ యూ అండ్ ఐ (U&i) మన దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ యాక్సెసరీలను తీసుకొచ్చింది. నిత్యం ప్రయాణాలు చేస్తూ, బిజీగా ఉండేవాళ్ల కోసం ‘ఎంట్రీ స్టార్ సిరీస్’ పేరుతో సరికొత్త వైర్‌లెస్ నెక్ బ్యాండ్, చిన్నసైజ్ పవర్‌బ్యాంక్, అదిరిపోయే స్పీడ్ ఉన్న కార్ ఛార్జర్లను లాంచ్ చేసింది. ఇవన్నీ ఇప్పటికే ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్ షాపుల్లో అందుబాటులోకి వచ్చాయి.

వాయిస్ ఛేంజర్‌తో నెక్ బ్యాండ్:

ఈ సిరీస్‌లో వచ్చిన ‘ఎంట్రీ స్టార్ 156’ వైర్‌లెస్ నెక్ బ్యాండ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనిలో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ చుట్టుపక్కల శబ్దాలను తగ్గించి, స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. ప్రత్యేకంగా ఇందులో 4 రకాల వాయిస్ ఛేంజర్ మోడ్స్ ఇచ్చారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 50 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. నలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో లభించే దీని ధర రూ.799 మాత్రమే.

వపర్‌ఫుల్ పవర్‌బ్యాంక్:

Advertisement

ప్రయాణాల్లో ఫోన్‌ ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా ‘ఎంట్రీ స్టార్ 172’ పవర్‌బ్యాంక్‌ను కంపెనీ పరిచయం చేసింది. 10000mAh సామర్థ్యంతో వచ్చే ఈ పరికరం 17W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనిలో రెండు యూఎస్‌బీ పోర్టులతో పాటు ఒక టైప్-సి పోర్ట్ కూడా ఉంది. దీనివల్ల ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ డివైజ్లను ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ధర రూ.599గా ఉంది.

Also Read: బడ్జెట్ ఫోన్ ప్రియులారా గెట్ రెడీ.. ఈ వారం మార్కెట్లోకి వస్తున్న టాప్ బ్రాండ్ల ఫోన్లు ఇవే!

అల్ట్రా ఫాస్ట్ కార్ ఛార్జర్లు:

Advertisement

కార్లలో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం కంపెనీ మూడు ఛార్జర్లను తెచ్చింది. ఇందులో ‘ఎంట్రీ స్టార్ 159’ మోడల్ అత్యంత శక్తివంతమైనది. ఇది 165W అవుట్‌పుట్‌తో పాటు స్మార్ట్ చిప్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అలాగే ల్యాప్‌టాప్‌లు సైతం చార్జ్ చేసుకోగల 145W సామర్థ్యమున్న ‘ఎంట్రీ స్టార్ 165’ మోడల్, 65W అవుట్‌పుట్‌తో వచ్చే ‘ఎంట్రీ స్టార్ 168’ మోడళ్లను కూడా కంపెనీ తీసుకొచ్చింది.

ధరల వివరాలు:

వినియోగదారులకు అందుబాటులో ఉండే బడ్జెట్ ధరల్లోనే వీటిని మార్కెట్లోకి తెచ్చారు. 165W కార్ ఛార్జర్ ధర రూ.549 కాగా.. 145W ఛార్జర్ ధర రూ.499గా ఉంది. అలాగే బేసిక్ 65W కార్ ఛార్జర్‌ను రూ.399కే సొంతం చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు ఉండటంతో ఈ కొత్త యాక్సెసరీస్ యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Also Read: టీనేజర్లకు పేటిఎం బంపర్ ఆఫర్.. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు!

Related News

వాషింగ్ మిషన్‌లో బకెట్ వేడి నీళ్లు.. తర్వాత జరిగే అద్భుతం ఇదే!

జీన్స్ అయినా, శారీ అయినా ఆల్-రౌండర్ లుక్.. మహిళల కోసం టాప్ 5 టైటాన్ వాచెస్!

హోటల్ రూమ్స్‌లో ‘గ్లాస్ బాత్‌రూమ్స్’ ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రైవసీ కంటే ఆ రీజనే ముఖ్యమా?

ఇల్లు చిన్నదా? బడ్జెట్ తక్కువా? అయితే.. ఈ వాషింగ్ మెషీన్స్ లిస్ట్ మీ కోసమే!

జియో ఎగిరిగంతేసే ప్లాన్.. కేవలం రూ.55 కే 1,000+ ఛానళ్లు.. ఏమేం చూడొచ్చో తెలుసా?

క్లీనింగ్ కష్టాలు లేవు,ప్లేట్లు అంటుకోవు..హెవీ డ్యూటీ నాన్-స్టిక్ శాండ్‌విచ్ మేకర్స్!

ఓర్నాయనో.. ఒక్క ఛార్జ్‌తో వంద గంటలా ?బడ్జెట్లో టాప్ 5 నెక్ బ్యాండ్స్ ఇవే!

మధ్యతరగతి స్పెషల్.. బడ్జెట్ ధరలో బెస్ట్ డిష్ వాషర్లు.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

Big Stories

Advertisement
×