Moto G57 Power vs Vivo Y31 vs Redmi 15 Comparison | రూ.15 వేల ధరలో మూడు కొత్త 5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో విడుదల అయ్యాయి. మోటో G57 పవర్ 5G, వివో Y315G, రెడ్‌మి 5G.. ఈ మూడు ఫోన్లు కూడా దాదాపు ఒకే ధరలో ఉన్నాయి. ఏ ఫోన్ మీకు బెస్ట్ అని తెలుసుకునేందుకు వాటి ఫీచర్లును ఒకసారి పరిశీలిద్దాం.
మోటో G57 పవర్ 5G ధర రూ.14,999 మాత్రమే. ఈ ధరలో మీకు 8GB RAM, 128GB స్టోరేజ్ లభిస్తాయి. వివో Y31 5G కూడా అదే రూ.14,999కి వస్తుంది కానీ ఇందులో కేవలం 4GB RAM 128GB స్టోరేజ్ మాత్రమే ఉంటాయి. రెడ్‌మి 15 5G బేసిక్ మోడల్ ధర కూడా రూ.14,999. ఇందులో 6GB RAM, 128GB స్టోరేజ్ ఉంటాయి. మీకు 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కావాలంటే దాని ధర రూ.16,999.
డిస్‌ప్లే విషయంలో మోటో G57 పవర్ లో 6.72 ఇంచుల పెద్ద FHD+ LCD స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఇస్తుంది. వివో Y31లో 6.68 ఇంచుల స్క్రీన్ ఉంది కానీ అది HD+ రిజల్యూషన్ మాత్రమే, క్లియర్‌నెస్ తక్కువ. దీనికి కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. రెడ్‌మి 15లో అతి పెద్ద 6.9 ఇంచుల స్క్రీన్ ఉంది 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది గేమింగ్‌లో చాలా మెరుగ్గా ఉపయోగపడుతుంది. డిస్‌ప్లే పరంగా రెడ్‌మి బెటర్.
ప్రాసెసర్ పరంగా మూడు ఫోన్లు కూడా Snapdragon 4-సిరీస్ చిప్‌ల తోనే పవర్ పొందుతాయి. మోటో G57 పవర్ లో Snapdragon 678 ఉండగా.. వివో Y31, రెడ్‌మి లో Snapdragon 439 ఉంది. రోజువారీ పనులు, సోషల్ మీడియా, యూట్యూబ్, లైట్ గేమ్స్ కోసం మూడు ఫోన్లు బాగుంటాయి. కానీ 8GB RAM ఉన్న Moto కొంచెం వేగంగా మల్టీటాస్కింగ్ చేస్తుంది.
కెమెరా విషయంలో మోటో G57 పవర్ లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. రెండూ మంచి క్లారిటీతో ఫొటోలు తీస్తాయి. వివో Y31లో 50MP ప్రధాన కెమెరా ఉంది కానీ రెండో కెమెరా చాలా చిన్నది, పెద్దగా ఉపయోగం లేదు. రెడ్‌మి 15లో కేవలం ఒకే 50MP కెమెరా మాత్రమే ఉంది. మొత్తంగా చూస్తే.. కెమెరా విషయంలో మోటో G57 పవర్ స్వల్ప ఆధిక్యంలో ఉంది.
బ్యాటరీలో మోటో G57 పవర్, రెడ్‌మి రెండూ 7000 mAh బ్యాటరీ ఇస్తున్నాయి. వివో Y31లో 6500 mAh మాత్రమే. ఛార్జింగ్ వేగంలో వివో Y31 44Wతో అత్యంత వేగంగా ఛార్జ్ అవుతుంది. Moto, Redmi 33W ఛార్జింగ్ ఇస్తున్నాయి. రెడ్‌మికి అదనంగా 18W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. అంటే బ్యాటరీ పరంగా మోటో పెద్ద బ్యాటరీ కలిగి ఉంది. కానీ రెడ్‌మి రివర్స్ ఛార్జింగ్ బెటర్.
సాఫ్ట్‌వేర్ పరంగా మోటో G57 పవర్ లో క్లీన్ Android 16 ఉంది. చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. వివో Y31లో ఫన్‌టచ్ OS 15 (Android 15 బేస్), రెడ్‌మిలో HyperOS (Android 15 బేస్) ఉన్నాయి. రెండింటిలోనూ కొంత బ్లోట్‌వేర్ యాడ్స్ ఉంటాయి.
మొత్తం మీద రూ.15000 బడ్జెట్‌లో బెస్ట్ బ్యాలెన్స్‌డ్ ఫోన్ కావాలంటే మోటో G57 పవర్ 5G విన్నర్. ఎక్కువ RAM, మంచి డిస్‌ప్లే, రెండు పనికొచ్చే కెమెరాలు, పెద్ద బ్యాటరీ, క్లీన్ సాఫ్ట్‌వేర్ – అన్నీ ఒక్కటే ఫోన్‌లో ఉన్నాయి.
అయితే అతిపెద్ద స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్ కావాలంటే రెడ్‌మి15, త్వరగా ఛార్జ్ అయ్యే ఫోన్ కావాలంటే వివో Y31 తీసుకోవచ్చు.
Also Read: బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో భారీ సైబర్ స్కామ్.. 2000కు పైగా నకిలీ వెబ్‌సైట్లు