E-Paper
Advertisement

OTT Movie : ‘మంజుమ్మెల్ బాయ్స్’ లాంటి మనసుకు హత్తుకునే మూవీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా

OTT Movie : ‘మంజుమ్మెల్ బాయ్స్’ లాంటి మనసుకు హత్తుకునే మూవీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా
Advertisement

OTT Movie : జీవితంలో ఎందుకూ పనికి రానివాడు అని ఎవర్నైనా పిలిస్తే ఎలా ఉంటుంది ? ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చూస్తే తెలుస్తుంది. నిజంగానే ఈ సినిమాలో ఐదు మంది ఫ్రెండ్స్ అల్లరి చిల్లరి వ్యవహారాలతో అందరికీ విసుగు పుట్టిస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి కూడా భారంగా మారుతారు. చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఈ కథ. కామెడీతో కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా, గత ఏడాది థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోనే ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘వాజా: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్’ 2024లో వచ్చిన మలయాళం కమింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ డ్రామా మూవీ. అనంద్ మేనన్ డైరెక్షన్ లో సిజు సన్నీ (అజో), అమిత్ మోహన్ రాజేశ్వరి (విష్ణు), జోమన్ జ్యోతిర్ (మూసా), అన్షిద్ అను (వివేక్), అనురాజ్ O.B. (అబ్దుల్ కలామ్), సాఫ్ (బి.సి. విశ్వం) లీడ్ రోల్స్ లో నటించారు. 2024 ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. 125 నిమిషాల నిడివితో ఐయండిబిలో 7.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం jio hotstar లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కేరళలోని చిన్న టౌన్‌లో అజో (సిజు సన్నీ), విష్ణు (అమిత్ మోహన్ రాజేశ్వరి), మూసా (జోమన్ జ్యోతిర్), వివేక్ (అన్షిద్ అను), కలామ్ (అనురాజ్ O.B.) అనే ఐదుగురు టీనేజ్ బాయ్స్‌ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఈ ఐదుగురూ కాలేజీలో చదువుతున్నప్పుడు రోజూ కలిసి సినిమాలు, క్రికెట్, ప్రాంక్స్, గర్ల్స్ మీద టాక్… ఫుల్ మస్తీ. కానీ ఇంటికి వెళ్తే పేరెంట్స్ రోజూ వీళ్ళని తిడుతుంటారు. ఎందుకూ పనికిరాని వాళ్ళుగా చూస్తుంటారు. ఈ మాటలు వీళ్ల మనసుల్లో బాగా గాయం చేస్తాయి.కొన్ని సంవత్సరాలు గడిచాక వీళ్లకి 25–27 ఏళ్లు వస్తాయి. ఇప్పుడు అడల్ట్ ప్రాబ్లమ్స్ మొదలు అవుతాయి. అజోకి జాబ్ లేదు, పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నా అమ్మాయిలు ఉద్యోగం లేదని రిజెక్ట్ చేస్తారు. విష్ణు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయి డిప్రెషన్‌లో ఉంటాడు. మూసా గర్ల్‌ఫ్రెండ్ ఇంకోకరిని పెళ్లి చేసుకుంది. వివేక్ తండ్రి బిజినెస్‌లో జాయిన్ అవ్వమంటాడు కానీ అతనికి ఇష్టం లేదు. కలామ్ ఇంకా ఇంట్లోనే ఉండి పేరెంట్స్‌కి బర్డెన్ అయిపోయాడు. ఇలా ఒక్కొక్కరి జీవితం నరకంగా మారుతుంది.

Read Also : అందం వెనకాల అరాచకం… కాబోయే మొగుడి తల తీసే లేడీ సైకో… వణుకు పుట్టించే సినిమా

Advertisement

ఒక రోజు ఐదుగురూ కలిసి కూర్చుని, మనం నిజంగానే వాజాలమా అని బాధపడతారు. అప్పుడు మనం మనకోసం ఏదైనా చేద్దాం అని ఒక ‘వాజా బర్గర్’ అనే చిన్న ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేస్తారు. మొదట ఫుల్ ఫెయిల్యూర్ ఎవరూ కొనరు. కానీ ఇంట్లో తిట్లు తిన్నా, సొసైటీ నవ్వినా వదలరు. చివరికి వాళ్ల బర్గర్ ఫేమస్ అవుతుంది. ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్‌లో వీళ్ల ట్రక్ టాప్ సెల్లర్ అవుతుంది. డబ్బు వస్తుంది, గౌరవం వస్తుంది. ఇంట్లో తిట్టిన పేరెంట్స్ కూడా గర్వపడతారు. ఇలా వీళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది.

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×