E-Paper
Advertisement

OTT Movie : ఒంటరి అమ్మాయిని ఎత్తుకెళ్ళి దారుణంగా… ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : ఒంటరి అమ్మాయిని ఎత్తుకెళ్ళి దారుణంగా… ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా
Advertisement

OTT Movie : ఈ మధ్య కోర్ట్ రూమ్ డ్రామాలను తెరకెక్కించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చుపిస్తున్నారు మేకర్స్. ఇలాంటి స్టోరీలు బాగా ట్రెండ్ కూడా అవుతున్నాయి. రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్, సూరేష్ గోపి నటించిన మళయాళ సినిమా కోర్ట్ రూమ్ డ్రామాని బాగానే రక్తి కట్టించింది. ఒక ఆమ్మాయిపై జరిగిన అఘాయిత్యాన్ని కోర్ట్ లో నిరూపించడానికి వాదనలు పీక్స్ కి వెళ్తాయి. జస్టిస్ కోసం చేసే ఈ పోరాటంలో మహిళలకి న్యాయం జరుగుతుందా ? అనే ప్రశ్నలు ఆడియన్స్ బుర్రలో తిరుగుతాయి. కోర్ట్ రూమ్ డ్రామాని ఇష్టపడే వాళ్ళు ఓ సారి చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025 జూలై 17న మలయాళ థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం మూవీ పేరు ‘JSK: Janaki V v/s State of Kerala’. ఈ మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో సూరేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్, దివ్యా పిళ్లై, శ్రుతి రామచంద్రన్, అస్కర్ అలీ, మాధవ్ సూరేష్ గోపి లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Zee5లో మలయాళ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) అనే బెంగళూరు IT ప్రొఫెషనల్, కేరళలో సొంత ఊరికి వస్తుంది. ఒక రాత్రి పార్టీ తర్వాత డ్రగ్స్ ఇచ్చి ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేస్తారు. జానకి డ్రగ్స్ వల్ల అన్‌కాన్షస్ అయి ఉంది కాబట్టి అటాకర్ ఎవరో గుర్తు పెట్టుకోలేక పోతుంది. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తుంది కానీ, ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కేసు స్టక్ అవుతుంది. జానకి మానసికంగా కుమిలిపోతుంది. ఈ షాక్ వల్ల ఆమె తండ్రి కూడా చనిపోతాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మీడియా ప్రెషర్, ఫ్యామిలీ సపోర్ట్ తో కేసు హాట్ టాపిక్ అవుతుంది.

Read Also : ముసలి సర్పంచ్ తో యంగ్ అమ్మాయి సరసాలు… ఆ అందం వెనుక అపాయం కూడా… ‘అంజలీ’ ఇలాంటి సిరీస్ లోనా ?

Advertisement

ఇది జానకి వెర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళ గా మారుతుంది. ఇప్పుడు ఆమె లాయర్ డేవిడ్ ఏబెల్ డోనోవాన్ (సూరేష్ గోపి) ఎంటర్ అవుతాడు. ఆమె కేసు తీసుకుని కోర్టు ఫైట్ మొదలెడతాడు. ఆటాకర్ వెనక పవర్‌ఫుల్ పాలిటికల్ లింక్స్ ఉన్నాయి. మొదటి కోర్ట్ హియరింగ్‌లో ఎవిడెన్స్ లేకపోవడంతో ఫేవర్‌ లేకుండా ఉంటుంది. డేవిడ్ ఫుల్ ఫైర్‌తో ఫైట్ చేస్తాడు. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఉత్కంఠంగా సాగుతుంది. చివరికి జానకికి న్యాయం జరుగుతుందా ? డేవిడ్ ఎలా కేసు గెలుస్తాడా ? నేరస్తుడికి శిక్ష పడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

Big Stories

Advertisement
×