Moto G67 Power 5G vs Samsung Galaxy A17 5G vs iQOO Z10R 5G comparison| ఇండియాలో బడ్జెట్ 5G ఫోన్ మార్కెట్ కొత్త కొత్త మోడల్స్ తో నిరంతరం అప్డేట్ అవుతోంది. తాజాగా మోటోరోలా కంపెనీ మోటో G67 పవర్ 5Gని విడుదల చేసింది. ఇదే రేంజ్ లో శామ్‌సంగ్ గెలాక్సీ A17 5G, iQOO Z10R 5G ఉన్నాయి. ప్రతి ఫోన్‌కి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి – స్పీడ్, డిస్‌ప్లే, బ్యాటరీ. మూడు మంచి ఆప్షన్లు కావడంతో మీరు ఏది కొనుగోలు చేయాలి అని నిర్ణయించుకునేందుకు వాటి ఫీచర్ల పోల్చి చూద్దాం.
మోటో G67 పవర్ 5G – 8GB RAM + 128GB రూ. 15,999.
శామ్‌సంగ్ గెలాక్సీ A17 5G – 6GB + 128GB రూ. 18,999, 8GB + 128GB రూ. 20,499.
iQOO Z10R 5G – 8GB + 128GB రూ.19,499, 8GB + 256GB రూ. 21,499.
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్‌తో మరింత తక్కువ పడుతాయి. మూడింటిలో మోటో G67 పవర్ అతి తక్కువ ధరలో లభిస్తోంది.
మోటో G67 పవర్ 5G: 6.7 అంగుళాల FHD+ LCD, 120Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ స్క్రోలింగ్.
శామ్‌సంగ్ A17 5G: 6.7 అంగుళాల FHD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ-U, 90Hz – రంగులు వైబ్రెంట్, బ్లాక్స్ డీప్.
iQOO Z10R 5G: లీడర్ – 6.77 అంగుళాల FHD+ AMOLED క్వాడ్-కర్వ్డ్, 120Hz, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ – బయట కూడా సూపర్ క్లియర్ గా కనిపిస్తుంది.
డిజైన్‌లో మోటోకి వెగాన్ లెదర్ ఫినిష్ ఉండడం ప్రత్యేకం. iQOOకి IP68/IP69 వాటర్ రెసిస్టెంట్.
ఫోన్ పెర్ఫామెన్స్ దాని ప్రాసెసర్ పై ఆధారపడి ఉంటుంది. ఇది ఫోన్ కు హార్ట్ లాంటింది. ఫోన్ స్పీడ్, ఎఫిషెన్సీ దాని ప్రాసెసర్ చిప్ తో ముడిపడి ఉంటుంది.
మోటో G67 పవర్ 5G: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 – రోజువారీ పనులకు సూపర్.
శామ్‌సంగ్ A17 5G: ఎక్సినాస్ 1330 ఆక్టా-కోర్ – స్టేబుల్, కానీ గేమింగ్‌లో స్లో.
iQOO Z10R 5G: అడ్వాంటేజ్ – మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (4nm) – గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు టాప్. 750K+ AnTuTu స్కోర్.
అన్నీ 8GB RAMతో వస్తాయి, మోటోకి వర్చువల్ బూస్ట్‌తో 24GB వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ప్రాసెసర్ విషయంలో ఐకూ బెస్ట్.
అన్నీ 50MP మెయిన్ సెన్సార్‌తో స్టార్ట్, కానీ సపోర్టింగ్ వేరు.
మోటో G67 పవర్ 5G: డ్యూయల్ – 50MP మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్, 32MP సెల్ఫీ.
శామ్‌సంగ్ A17 5G: డ్యూయల్ – 50MP మెయిన్ (OIS) + 2MP మ్యాక్రో, 13MP సెల్ఫీ – AI ఎన్‌హాన్స్‌మెంట్.
iQOO Z10R 5G: 50MP సోనీ మెయిన్ + 2MP డెప్త్, 32MP ఫ్రంట్ – 4K వీడియో సపోర్ట్.
మోటో కెమెరా సిస్టమ్‌లో వైడ్ యాంగిల్ అదనం.
హెవీ యూజర్లకు బ్యాటరీ కీ.
మోటో G67 పవర్ 5G: చాంపియన్ – 7000mAh, 30W చార్జింగ్ – 2-3 రోజులు సులువుగా సాగుతుంది.
శామ్‌సంగ్ A17 5G: 5000mAh, 25W – స్టాండర్డ్ డే లాంగ్.
iQOO Z10R 5G: బ్యాలెన్స్ – 5700mAh, 44W ఫాస్ట్ చార్జింగ్ – త్వరగా ఫుల్ అవుతుంది.
సిలికాన్ కార్బన్ టెక్‌తో మోటో, iQOO స్లిమ్‌గా ఉన్నాయి. బ్యాటరీలో మోటో టాప్ అయితే వేగంగా చార్జింగ్ విషయంలో ఐక్యూ ముందంజలో ఉంది.
అన్నీ ఆండ్రాయిడ్ 15తో వస్తాయి.
మోటో: హలో UX – క్లీన్, సింపుల్.
శామ్‌సంగ్: వన్ UI 7 – ఫీచర్ రిచ్, 6 ఏళ్ల అప్‌డేట్స్.
iQOO: ఫన్‌టచ్ OS 15 – గేమింగ్ పై ఫోకస్ చేస్తుంది.
ఇక కనెక్టివిటీ విషయంలో… అన్నీ 5G టెక్నాలజీ కలిగి ఉన్నాయి. iQOOకి Wi-Fi 6, బ్లూటూత్ 5.4 అదనం. మోటోకి IP64, iQOOకి IP68+.
బ్యాటరీ, చీప్ ధర కావాలంటే మోటో G67 పవర్ 5G బెస్ట్.
వైబ్రెంట్ AMOLED డిస్‌ప్లే.. శామ్‌సంగ్ బ్రాండ్ కావాలంటే A17 5G.
గేమింగ్, బెస్ట్ డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్ కావాలంటే iQOO Z10R 5G తీసుకోండి.
బడ్జెట్ 5Gలో ఇది టాప్ షోడౌన్ – మీ అవసరాలను బట్టి ఎంచుకోండి.
Also Read: మొబైల్ గేమ్స్ ఆడుతూ చనిపోతున్న టీనేజర్లు.. ఏం జరుగుతోందంటే..