E-Paper
Advertisement

Kollywood: ఓర్నీ.. స్టార్స్ ను డైరెక్ట్ చేయడానికి ఒక్క డైరెక్టర్ కూడా లేడా .. ఏం ఇండస్ట్రీరా బాబు

Kollywood: ఓర్నీ.. స్టార్స్ ను డైరెక్ట్ చేయడానికి ఒక్క డైరెక్టర్ కూడా లేడా .. ఏం ఇండస్ట్రీరా బాబు

Kollywood: రోజుకు ఇండస్ట్రీలో హీరోలు.. హీరోయిన్లు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నారు. అదృష్టం బావుంటే మొదటి సినిమాతోనే హిట్ ఇచ్చుకొని స్టార్స్ గా మారుతున్నారు. లేకపోతే ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీని వదిలేస్తున్నారు.  ఇక వీరి కోసం కొత్త డైరెక్టర్లు.. కొత్త రైటర్స్ వస్తున్నారు. టాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్స్.. కథలతో హీరోల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో హీరో వెనుక మినిమమ్ లో మినిమమ్ ముగ్గురు డైరెక్టర్స్ తిరుగుతున్నారు. అది కూడా స్టార్ డైరెక్టర్స్ అంటే అతిశయోక్తి లేదు.

అయితే ఇదేపరిస్థితి  అన్ని ఇండస్ట్రీలలో లేదు అంటే అతిశయోక్తి కాదు. అవును.. తాజాగా కోలీవుడ్ లో దర్శకుల కొరత ఏర్పడింది అని టాక్ నడుస్తుంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడానికి ఒక్క స్టార్ డైరెక్టర్ లేడు. కనీసంలో కనీసం ఒక్క డైరెక్టర్ కూడా యాక్టివ్ గా లేడు అని చెప్పొచ్చు. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఒక్కరు కూడా కోలీవుడ్ లో లేరు అనే మాట వినిపిస్తుంది.

రజినీకాంత్ ఈ మధ్యనే కమల్ హాసన్ బ్యానర్ లో తలైవర్ 173 మొదలుపెట్టిన విషయం తెల్సిందే. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు కూడా టాక్ నడిచింది. సుందర్ సి, ఖుష్బూ.. రజినీతో సినిమా చేస్తుండడం తమ అదృష్టమని చెప్పుకొచ్చారు. అయితే , ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ, తలైవర్ 173 నుంచి సుందర్ సి తప్పుకుంటున్నట్లు చెప్పడం కోలీవుడ్ లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది.

ఇక ఇప్పుడు సుందర్ సి ప్లేస్ లో ఏ  డైరెక్టర్ వస్తాడో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఏ డైరెక్టర్ కూడా రజినీని డైరెక్ట్ చేసే అవకాశం లేకుండా ఉన్నారు. సుందర్ సి తప్పుకున్నాడు. డైరెక్టర్ శంకర్ అసలు ఫార్మ్ లోనే లేడు. ఆయనను అనుకోవడం కూడా వేస్ట్. ఇక మణిరత్నం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. థగ్ లైఫ్ ఇచ్చిన రిజల్ట్ అలాంటిది. ఇక కుర్ర డైరెక్టర్ అట్లీ.. బన్నీ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు.. ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమాతో బిజిగా ఉన్నాడు.

వీరు కాకుండా శిరుతై శివ.. అన్నాతేతో రచ్చ చేశాడు. ఇంకోసారి అలాంటి సినిమా తీయొద్దని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ అంటున్నా కూడా అది అయ్యే పనిలా కనిపించడం లేదు. దర్బార్ తరువాత ఏఆర్ మురుగదాస్ ను అభిమానులు నమ్మడమే మానేశారు. పా రంజిత్ ఇప్పటికే 2 సినిమాలు వచ్చాయి. అవి కూడా అట్టర్ ప్లాప్. మూడో సినిమా చేసే ధైర్యం లేదు. ఇక మిగిలింది దేసింగి పెరియసామి.. అది అవ్వదమ్మా. నెల్సన్ ఇప్పటికే జైలర్ 2 తో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్.. కూలీ చూసాక కూడా ఎలా అడగగలరు. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నా కూడా రజినీ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయడానికి ఒక్కరు కూడా లేరు అంటే సిగ్గుచేటు అని చెప్పొచ్చు. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్.. ఇదేం ఇండస్ట్రీరా బాబు. ఒక్క డైరెక్టర్ కూడా లేడా అని కామెంట్స్ పెడతున్నారు. మరి రజినీని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×