Motorola Edge 70 Fusion vs Vivo Y400 5G vs OnePlus Nord CE 5 Smartphone Comparison| భారతదేవ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం మిడ్ రేంజ్ ఫోన్స్‌కు డిమాండ్ రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. రూ.30,000 ధర రేంజ్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి కొత్తగా మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, వివో Y400 5G ఫోన్స్ ఉన్నాయి. ఇదే రేంజ్‌లో పాపులర్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ CE 5 5G కూడా ఉంది. ఈ మూడు ఫోన్లు బలమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. అయితే డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ విషయంలో ఈ ఫోన్ల మధ్య తేడాలు ఉన్నాయి. ఈ ఫీచర్లను పోల్చి ఏది కొనుగోలు చేయాలో నిర్ణయం తీసుకోండి.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మూడు వేరియంట్లలో వస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999. 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.29,999. ఎడ్జ్ 70 ఫ్యూజన్ పెద్ద వేరియంట్ ధర 12GB ర్యామ్ + 256GB మోడల్ ధర రూ.32,999.
వివో Y400 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB ధర రూ.25,999. 8GB ర్యామ్ + 256GB ధర రూ.27,999.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5G కూడా రెండు వేరియంట్లలో వస్తుంది. 8GB ర్యామ్ + 128GB ధర రూ.24,999.. అలాగే 8GB ర్యామ్ + 256GB ధర రూ.26,999.
ధర పరంగా చూసుకుంటే మూడు ఫోన్లలో వన్‌ప్లస్ నార్డ్ CE 5 5G తక్కువ ధరతో బడ్జెట్ కస్టమర్లకు ఆకర్షణీయంగా ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో 6.78 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఆమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
వివో Y400 5Gలో 6.67 అంగుళాల ఫుల్ HD+ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz ఉండగా.. 1,800 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో 6.77 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఇస్తుంది.
డిస్‌ప్లే క్వాలిటీ, బ్రైట్‌నెస్, స్మూత్‌నెస్ విషయంలో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్పష్టంగా ముందుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ Gen 4 ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్‌కు బాగా పనిచేస్తుంది.
వివో Y400 5Gలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఇది ఎనర్జీ ఎఫిషియెంట్‌గా ఉంటుంది కానీ హై పెర్ఫామెన్స్ తక్కువ.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంది. ఇది 4nm టెక్నాలజీతో బ్యాలెన్స్‌డ్ పెర్ఫామెన్స్, మంచి గేమింగ్ ఇస్తుంది.
పెర్ఫామెన్స్ విషయంలో వన్‌ప్లస్, మోటోరోలా ముందున్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో 50MP మెయిన్ కెమెరా (OISతో), 13MP అల్ట్రా-వైడ్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
వివో Y400 5Gలో 50MP మెయిన్ కెమెరా + 2MP సెకండరీ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో 50MP మెయిన్ (OISతో) + 8MP అల్ట్రా-వైడ్, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
కెమెరా వైవిధ్యం, క్వాలిటీలో మోటోరోలా, వన్‌ప్లస్ మెరుగ్గా ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్.. 7,000mAh బ్యాటరీతో, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
వివో Y400 5Gలో 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో 7,100mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.
బ్యాటరీ సైజ్‌లో వన్‌ప్లస్ ముందుంది. ఛార్జింగ్ స్పీడ్‌లో వివో టాప్‌లో ఉంది.
Also Read: హోటల్ రూమ్‌లలో రహస్య కెమెరాలు.. ఎక్కడ దాచి పెట్టారో సులభంగా పసిగట్టండిలా
మంచి డిస్‌ప్లే, బ్యాలెన్స్‌గా అన్ని ఫీచర్లు కావాలంటే మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ బెస్ట్.
బలమైన పెర్ఫామెన్స్, పెద్ద బ్యాటరీ కావాలంటే వన్‌ప్లస్ నార్డ్ CE 5 5G ఇప్పటికీ బెటర్ ఆప్షన్.
బడ్జెట్‌లో బ్యాలెన్స్‌డ్ ఫోన్ కావాలంటే వివో Y400 5G మంచి ఆప్షన్.
మీ ప్రాధాన్యతలు (డిస్‌ప్లే, స్పీడ్ లేదా బ్యాటరీ) ఆధారంగా ఎంచుకోండి.