E-Paper
Advertisement

రూటర్ మీద కాయిన్ పెడితే Wi-Fi స్పీడ్ పెరుగుతుందా? పొరపాటున కూడా ఆ పని చేయొద్దు, ఎందుకంటే?

రూటర్ మీద కాయిన్ పెడితే Wi-Fi స్పీడ్ పెరుగుతుందా? పొరపాటున కూడా ఆ పని చేయొద్దు, ఎందుకంటే?
Advertisement

WiFi Router: సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో కొత్త ట్రిక్ బయటకు వస్తోంది. ఇప్పుడు వై-ఫై రూటర్‌పై ఒక నాణెం పెడితే చాలు.. ఇంటర్నెట్ రాకెట్‌లా దూసుకుపోతుందనే వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా సిగ్నల్ పెరుగుతుందంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పండి? అందుకే చాలామంది ఈ చిట్కాను ఫాలో అయిపోతున్నారు. అయితే ఈ కాయిన్ ట్రిక్ వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది. అదేంటంటే..

స్పీడ్ పెరగడం అంత ఈజీనా?

నిజానికి రూటర్ లోపల సిగ్నల్ పంపడానికి ప్రత్యేకమైన యాంటెన్నాలు ఉంటాయి. అవి చాలా లెక్కలతో తయారవుతాయి. మనం ఏదో ఒక నాణెం తెచ్చి దానిపై పెట్టినంత మాత్రాన అది సిగ్నల్‌ను లాగేసి అందరికీ పంచేయదు. ఆ నాణేనికి రూటర్ లోపల ఉండే సర్క్యూట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి.. అది సిగ్నల్‌ను పెంచుతుందనుకోవడం కేవలం భ్రమ మాత్రమే.

హీట్ తగ్గుతుందనడంలో నిజమెంత?

Advertisement

కొందరు ఏం చెప్తారంటే.. రూటర్ వేడెక్కినప్పుడు ఈ నాణెం ఆ వేడిని పీల్చుకుని పరికరాన్ని చల్లబరుస్తుందని. కానీ ఒక చిన్న నాణెం అంత వేడిని ఎలా తగ్గిస్తుంది? పైగా, రూటర్ల పైన గాలి బయటకు వెళ్లడానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల మీద మనం కాయిన్స్ పెడితే గాలి ఆడక రూటర్ ఇంకాస్త ఎక్కువ వేడెక్కుతుంది. దీనివల్ల రూటర్ స్పీడ్ తగ్గడమే కాకుండా.. త్వరగా పాడైపోయే ఛాన్స్ కూడా ఉంది.

Also Read: రోజూ ఆ గిన్నెలతో కుస్తీ పడలేకపోతున్నారా? రూ.50 వేల బడ్జెట్‌లో టాప్ డిష్‌వాషర్లు ఇవే, ఓ లుక్కేయండి!

కాయిన్ వల్ల నష్టమే ఎక్కువ:

Advertisement

వై-ఫై తరంగాలు లోహపు వస్తువులను దాటలేవు. అందుకే రూటర్ పక్కన ఫ్రిడ్జ్‌లు, అలమరాలు ఉంచొద్దని టెక్నీషియన్లు చెబుతుంటారు. అలాంటిది నేరుగా రూటర్ పైన నాణెం పెట్టడం వల్ల సిగ్నల్‌కి ఆటంకం కలుగుతుందే తప్ప లాభం ఉండదు. అప్పుడప్పుడు స్పీడ్ పెరిగినట్టు అనిపించినా.. అది మన నెట్వర్క్‌లో వచ్చే మామూలు మార్పులే తప్ప నాణెం వల్ల వచ్చింది కాదు.

స్పీడ్ పెరగాలంటే?

వై-ఫై స్పీడ్ పెరగాలంటే రూటర్‌ను ఇంటి మధ్యలో, కాస్త ఎత్తులో ఉంచండి. ఏదో ఒక మూలనో లేక టీవీ వెనకనో దాచిపెడితే సిగ్నల్ సరిగ్గా అందదు. అలాగే కిచెన్ దగ్గర, మైక్రోవేవ్ ఓవెన్ల పక్కన పెట్టొద్దు. రూటర్ చుట్టూ ఖాళీగా ఉంటేనే సిగ్నల్ బాగా అందుతుంది.

ప్రతీది నమ్మొద్దు:

ఈ నాణెం ట్రిక్ వల్ల ఇంటర్నెట్ పెరగదు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే.. రూటర్ ప్లేస్‌మెంట్ మార్చుకోవడం లేదా అవసరమైతే కంపెనీ వాళ్లతో మాట్లాడటం ఉత్తమం. అనవసరంగా రూటర్ మీద వస్తువులు పెట్టి దాన్ని పాడుచేసుకోవద్దు.

Also Read: 144Hz డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ సెన్సార్‌తో రానున్న Vivo X500 సిరీస్.. ఫీచర్లు అదరహో!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×