E-Paper
Advertisement

Motorola Razr Discount: రెండు డిస్‌ప్లేలు కలిగిన మోటోరోలా కొత్త ఫోన్‌పై రూ.13000 డిస్కౌంట్.. బెస్ట్ డీల్ ఎక్కడంటే

Motorola Razr Discount: రెండు డిస్‌ప్లేలు కలిగిన మోటోరోలా కొత్త ఫోన్‌పై రూ.13000 డిస్కౌంట్.. బెస్ట్ డీల్ ఎక్కడంటే
Advertisement

Motorola Razr Discount| మోటోరోలా బ్రాండ్ లో రేజర్ 60 అల్ట్రా పాపులర్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్. మోటోరోలా ఈ ప్రీమియం ఫోన్‌ను మే 2025లో లాంచ్ చేసింది. లాంచ్ తర్వాత ఈ ఫోన్ కు యూజర్ల నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి. స్టైలిష్ ఫోల్డబుల్ డిజైన్ చాలా మంది కొనుగోలుదారులను ఆకట్టుకుంది. దీని ప్రారంభ ధర రూ.1,09,000. లాంచ్ సమయంలో ఆఫర్ తో ధర దాదాపు రూ.90,000 ఉండేది. రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో సాధారణంగా రూ.89,999కు లభించేది. ఖరీదు ఎక్కువగా ఉండడంతో దీని సేల్స్ ఆశించిన స్థాయి కంటే తక్కువగానే జరిగాయి. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను చాలా చవకగా కొనవచ్చు. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ వచ్చింది. ఈ డీల్‌తో ప్రీమియం ఫ్లిప్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వస్తోంది.

అమెజాన్‌లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రాపై డిస్కౌంట్

అమెజాన్‌లో ఈ ఫ్లిప్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. కొన్ని వారాల క్రితమే మోటోరోలా ఈ ఫోన్ ధరను రూ.82,499కు తగ్గించింది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో 27 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. డిస్కౌంట్ తర్వాత ధర రూ.79,999 అయింది. అంటే రూ.2,500 డైరెక్ట్ ప్రైస్ కట్ లభిస్తోంది. ఈ ఆఫర్‌తో ఫోన్ మళ్లీ ఆకర్షణీయంగా మారింది. బ్యాంక్ ఆఫర్లతో మరింత పొదుపు చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్లతో ఎక్స్‌ట్రా సేవింగ్స్ లభిస్తాయి

Advertisement

అమెజాన్‌లో అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. HDFC క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి స్పెషల్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఆరు నెలల EMI ప్లాన్ ఎంచుకోవాలి. అర్హత ఉన్నవాళ్లకు మరో రూ.10,500 డిస్కౌంట్ వస్తుంది. ఈ డిస్కౌంట్.. ఎంచుకున్న EMI ప్లాన్లకు మాత్రమే. మొత్తం డిస్కౌంట్ దాదాపు రూ.13,000 అవుతుంది. అన్ని ఆఫర్ల తర్వాత ఫోన్ ధర రూ.69,499కే వస్తోంది. ఈ ధర డీల్‌ను చాలా ఆకర్షణీయంగా చేస్తోంది. ఫ్లిప్ ఫోన్ల బెస్ట్ డీల్స్‌లో ఇది ఒకటి.

మోటోరోలా రేజర్ 60 అల్ట్రా డిస్‌ప్లే ఫీచర్లు సూపర్

ఈ ఫోన్‌లో పెద్ద ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉంది. 7 ఇంచుల pOLED LTPO మెయిన్ స్క్రీన్. రిజల్యూషన్ 1.5K (1224 x 2992 పిక్సెల్స్). 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఎక్స్‌పీరియన్స్ స్మూత్ గా ఉంటుంది. పీక్ బ్రైట్‌నెస్ 4,000 నిట్స్. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. కవర్ డిస్‌ప్లే 4 ఇంచుల pOLED LTPO. రిజల్యూషన్ 1272 x 1080 పిక్సెల్స్. 3,000 నిట్స్ బ్రైట్‌నెస్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ ప్రొటెక్షన్ ఉంది.

పెర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

Advertisement

ఈ ఫోన్ లో అడ్వాన్స్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా జరుగుతాయి. ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. మోటోరోలా హెల్లో UI ఉపయోగిస్తుంది. ఇంటర్‌ఫేస్ క్లీన్, ఫాస్ట్‌గా ఉంటుంది. స్మూత్ యానిమేషన్లు, త్వరిత యాప్ లాంచ్ లభిస్తాయి.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

కెమెరా సెటప్, ఫోటోగ్రఫీ ఫీచర్లు

డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ప్రైమరీ 50MP సెన్సార్ (f/1.8, OIS). 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. వైడ్ ల్యాండ్‌స్కేప్స్, గ్రూప్ ఫోటోలు సులభంగా తీస్తుంది. సెల్ఫీలకు 50MP కెమెరా. ఫోల్డబుల్ డిస్‌ప్లే లోపల ఉంటుంది. వీడియో కాల్స్, సోషల్ మీడియా కంటెంట్‌కు బెస్ట్.

బ్యాటరీ, ఛార్జింగ్, సెక్యూరిటీ ఫీచర్లు

4,700mAh బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. త్వరగా రీఛార్జ్ అవుతుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఫాస్ట్, సెక్యూర్ అన్‌లాకింగ్ ఇస్తుంది.

అమెజాన్ లో బెస్ట్ డీల్

Motorola Razr 60 ultraపై ప్రస్తుత అమెజాన్ డీల్ గ్రేట్ వాల్యూ ఇస్తోంది. లాంచ్ ధరతో పోలిస్తే భారీ సేవింగ్స్. ప్రీమియం ఫ్లిప్ ఫోన్ ఇష్టపడేవాళ్లకు ఈ డీల్ సూట్ అవుతుంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×