Instagram vs YouTube Earnings| కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా నుంచి డబ్బు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్స్‌లో ప్రధానమైనవి.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్. కానీ ఈ రెండింటిలో వేర్వేరు రకాల క్రియేటర్లకు సూట్ అవుతాయి. కంటెంట్ రకం, దీర్ఘకాలిక లక్ష్యం మీద ఈ ప్లాట్ ఫామ్ సూటెబిలిటీ ఆధారపడి ఉంటుంది.
యూట్యూబ్ యాడ్ రెవెన్యూ షేర్ చేస్తుంది. వీడియో ముందు లేదా మధ్యలో యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ వ్యూస్ ని బట్టి పేమెంట్ వస్తుంది. అందుకే యూట్యూబ్‌లో పేమెంట్ సిస్టమ్ కాస్త క్లిష్టం. మొత్తం వాచ్ టైమ్, చూసే వ్యక్తి దేశం, కంటెంట్ కేటగిరీ – ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని యూట్యూబ్ పేమెంట్ డిసైడ్ చేస్తుంది.
ఇండియాలో మీ వీడియో చూసే ఆడియన్స్ ఉంటే ప్రతి 1000 వ్యూస్‌కు రూ.20 నుంచి రూ.100 వస్తుంది. అదే ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఉంటే రెవెన్యూ బాగా పెరుగుతుంది. గ్లోబల్ వ్యూస్ చూసుకుంటే ప్రతి 1000 వ్యూస్‌కు 1000కి రూ.300 నుంచి రూ.400 దాకా వచ్చే అవకాశం. అంతేకాదు, సూపర్ చాట్, ఛానల్ మెంబర్‌షిప్స్ నుంచి అదనపు ఆదాయం పొందవచ్చు. బ్రాండ్ స్పాన్సర్‌షిప్స్ కూడా మరో మంచి మార్గం.
ఇన్‌స్టాగ్రామ్ రెవెన్యూ మోడల్ వేరు. యూట్యూబ్ లాగా యాడ్ రెవెన్యూ షేర్ చేయదు. క్రియేటర్లు బ్రాండ్ ప్రమోషన్, స్పాన్సర్‌షిప్‌లతో సంపాదిస్తారు. మీరు చేసే పోస్టుల్లో బ్రాండ్స్ పేరు చెప్పడం, రీల్స్‌లో స్పాన్సర్‌షిప్ చాలా పాపులర్. ఫాలోవర్స్ ఎంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అనే దానిపై మీరు చేసే పోస్టుకు రేటు మారుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మంచి ఆదాయం ఇస్తుంది.
1 లక్ష ఫాలోవర్స్ ఉన్నవారు పోస్టుకు రూ.5,000 నుంచి రూ.50,000 సంపాదిస్తారు. పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక డీల్‌కు లక్షలు తీసుకుంటారు. ఎంగేజ్‌మెంట్ రేటు ఎక్కువ ఉంటే సంపాదన ఎక్కువ. రీల్స్ వ్యూస్, ఫాలోవర్ కౌంట్ చాలా ముఖ్యం.
యూట్యూబ్ దీర్ఘకాలిక స్థిరమైన ఆదాయం ఇస్తుంది. పాత వీడియోలు సంవత్సరాల తరబడి డబ్బు ఇస్తాయి. నమ్మకమైన రెవెన్యూ స్ట్రీమ్. ఇన్‌స్టాగ్రామ్ డీల్స్‌తో త్వరగా డబ్బు వస్తుంది, కానీ కంటెంట్ లైఫ్‌స్పాన్ చాలా తక్కువ. రీల్స్ కొద్ది రోజుల్లోనే పాతబడిపోయి ఇక రెలెవెంట్ గా ఉండపోవు.
సస్టైనబుల్ కెరీర్ కోసం యూట్యూబ్ ఎంచుకోండి. క్రమం తప్పకుండా కంటెంట్ చేస్తే మంచి ఆదాయ మార్గం ఇది. అల్గారిథమ్ దీర్ఘకాలిక డిస్కవరీకి సపోర్ట్ చేస్తుంది. త్వరిత బ్రాండ్ కోలాబరేషన్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ బెటర్. విజువల్ కంటెంట్‌కు బాగా పనిచేస్తుంది. బలమైన ఎంగేజ్‌మెంట్ వల్ల వెంటనే రివార్డ్ పొందగలరు.
Also Read: ఫోన్ కోసం స్పెషల్ బెడ్ తయారు చేసిన ఐకియా.. దీన్ని కొనడం అంత ఈజీ కాదండోయ్!