Stranger Things 5 Volume 2 Review : నెల రోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ‘ స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 2’ చివరకు క్రిస్మస్ రోజున విడుదలైంది. వాల్యూమ్ 1 (ఎపిసోడ్స్ 1-4) నవంబర్‌లో రాగా, వాల్యూమ్ 2 (ఎపిసోడ్స్ 5-7) డిసెంబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఫైనల్ ఎపిసోడ్ (ఎపిసోడ్ 8) న్యూ ఇయర్ రోజు వస్తుంది. వాల్యూమ్ 1 క్లైమాక్స్‌లో విల్ శక్తులను పొందడంతో వాల్యూమ్ 1 ముగిసింది. విల్ ఇప్పుడు వెక్నాను తిప్పికొట్టే రేంజ్ లో పవర్ ఫుల్ గా ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగిపోయింది. మరి తాజాగా వచ్చిన మూడు ఎపిసోడ్లలో ఏం జరిగిందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
ఐదవ ఎపిసోడ్ నాల్గవ ఎపిసోడ్ ఆగిపోయిన చోట నుండి ప్రారంభమవుతుంది, విల్ శక్తిని పొందుతాడు. హాకిన్స్ గ్రూప్ ఇప్పుడు పూర్తిగా ఏకమై, ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే వెక్నా ప్లాన్ ను ఆపేందుకు పోరాడుతుంది. విల్ శక్తి ఎంతగా పెరుగుతుందంటే అతను తన స్నేహితులను వేరే చోట కూడా ప్రమాదం నుండి రక్షిస్తాడు. విల్ ఇంత పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ, వెక్నా వాస్తవ ప్రపంచంలోని బలహీనమైన పిల్లలను తన ఆయుధాలుగా ఉపయోగించుకుని, వారిని బంధిస్తాడు. అప్‌సైడ్ డౌన్ రహస్యాలు మరిన్ని బయటపడతాయి. లెవెన్, విల్, మ్యాక్స్ వంటి కీ రోల్స్ తమ గతం, శక్తులు, భయాలతోనే ఫైట్ చేస్తారు. అందరూ ఫైనల్ బ్యాటిల్‌కి సిద్ధం అవుతారు. వాల్యూమ్ 2 ప్రేక్షకులు ఆశించిన విధంగా ఉందా ? విల్ చివరకు వెక్నాను ఓడించాడా ? ఇందులో లెవెన్, ఆమె సోదరి పాత్ర ఏంటి ? చివర్లో వచ్చిన ట్విస్ట్ ఏంటి ? ఈ మూడు ఎపిసోడ్‌లను చూసిన తర్వాత ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది.
లెవెన్ లాగానే, విల్ ఇప్పుడు తన స్నేహితులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూడగలడు. అతను వారిని దూరం నుండి కూడా రక్షించగలడు. స్ట్రేంజర్ థింగ్స్ మూడు ఎపిసోడ్‌లు సాహసం, భయం, భావోద్వేగం వంటి అంశాలతో నిండి ఉన్నాయి. మునుపటిలాగే సిరీస్ VFX అద్భుతంగా ఉంది. నేపథ్య సంగీతం సిరీస్ పై క్యూరియాసిటీని పెంచుతుంది. కథ బాగానే ఉన్నప్పటికే సీజన్ 5 మూడు భాగాల విడుదల చేయడం అనే స్ట్రాటజినీ పక్కన పెట్టి, ఈ సిరీస్‌ను ఒకేసారి విడుదల చేసి ఉంటే బాగుండేది. . ఇలా 3 విడివిడి భాగాలుగా రిలీజ్ చేయడం అన్నది కన్ఫ్యూజ్ చేస్తుంది. మొత్తం సిరీస్ ను ఒకేసారి చూస్తే వచ్చే కిక్కే వేరు కదా మరి. మరో డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే ఎపిసోడ్స్ ఎక్కువసేపు సాగదీయడం. ఎమోషనల్ గా ఈ ఎపిసోడ్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నప్పటికే, 6వ ఎపిసోడ్ లో కథ కాస్త నెమ్మదిగా సాగడం చికాకు పెడుతుంది. ఒక్కో ఎపిసోడ్ గంటకు పైగానే ఉంది. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్ 2 గంటల దాకా ఉంది. ఈ వాల్యూమ్ లో ఎమోషనల్ డెప్త్ మీద ఫోకస్ చేశారు. పాత్రల డెవలప్మెంట్, వాళ్ల మధ్య బంధాలు, సిరీస్ మొదలైనప్పటి నుండి ఉన్న ప్రశ్నలకు ఆన్సర్స్… ఇవన్నీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్. ముఖ్యంగా మిల్లీ బాబీ బ్రౌన్, సాడీ సింక్, నోవా ష్నాప్ వంటి వాళ్లు ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. కానీ వాల్యూమ్ 1 లాగా థ్రిల్ లేదు.
ఎమోషనల్ మూమెంట్స్
క్యారెక్టర్ డెవలప్‌మెంట్
యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్
సాగదీసిన సన్నివేశాలు
ఎపిసోడ్స్ లెంగ్తీ రన్ టైమ్
యాక్షన్, థ్రిల్ తక్కువైంది
స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కి ఈ వాల్యూమ్ ఎమోషనల్ రోలర్‌కోస్టర్. థ్రిల్ కంటే ఎమోషన్స్, క్యారెక్టర్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది.