E-Paper
Advertisement

Motorola Discount: మోటొరోలా కొత్త లగ్జరీ ఫోన్‌పై రూ.10000 ధర తగ్గింపు.. త్వరపడండి లిమెటెడ్ ఆఫర్

Motorola Discount: మోటొరోలా కొత్త లగ్జరీ ఫోన్‌పై రూ.10000 ధర తగ్గింపు.. త్వరపడండి లిమెటెడ్ ఆఫర్

Motorola Discount| ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌‌లో ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్ సందర్భంగా మోటొరోలా సిగ్నెచర్ (Motorola Signature) ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు లాంచ్ తర్వాత అతి తక్కువ ధరకు దొరుకుతోంది. ఈ ఫోన్ ఈ ఏడాది భారత్‌లో లాంచ్ అయింది. పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్స్‌తో వచ్చిన ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

ధర, బ్యాంక్ ఆఫర్స్, కలర్ వేరియంట్స్

మోటొరోలా సిగ్నెచర్ వివిధ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో వచ్చింది.
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్.. లాంచ్ ధర రూ.59,999
16GB ర్యామ్ + 512GB స్టోరేజ్.. లాంచ్ ధర రూ.64,999
16GB RAM + 1TB స్టోరేజ్.. లాంచ్ ధర రూ.69,999
ఈ కొత్త ఫోన్ పాంటోన్ కార్బన్, పాంటోన్ మార్టిని ఆలివ్ కలర్స్‌లో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌తో రూ.7,500 డిస్కౌంట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ యక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే గరిష్టంగా రూ.10,125 తగ్గుతుంది. దీంతో బేస్ వేరియంట్ ఫైనల్ ధర దాదాపు రూ.49,874కి వస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా Motorola Hello UIతో వస్తుంది. డ్యుయెల్ SIM సపోర్ట్ ఉంది. పెద్ద 6.8 ఇంచ్ Super HD LTPO ఎక్స్‌ట్రీమ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 165Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 6200 నిట్స్ వరకు ఉంది. 450 PPI పిక్సెల్ డెన్సిటీతో షార్ప్ విజువల్స్ ఇస్తుంది. డాల్బి విజన్, HDR10+ సపోర్ట్ ఉంది. SGS సర్టిఫికేషన్‌తో బ్లూ లైట్, మోషన్ బ్లర్ తగ్గుతాయి. స్మార్ట్ వాటర్ టచ్ టెక్నాలజీతో తడి వేళ్లతో కూడా టచ్ పనిచేస్తుంది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, అల్యూమినియం ఫ్రేమ్ ఉన్నాయి.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, పర్‌ఫామెన్స్

మోటొరోలా సిగ్నెచర్ ఫోన్‌లో అడ్వాన్స్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ (3nm) చిప్ ఉంది. 16GB వరకు LPDDR5x RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. IP68, IP69 వాటర్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ ఉన్నాయి.

అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
50MP Sony LYT-828 మెయిన్ సెన్సార్ (OIS సపోర్ట్)
50MP అల్ట్రా-వైడ్ కెమెరా
50MP Sony LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్, 100x హైబ్రిడ్ జూమ్)
ఫ్రంట్‌లో 50MP Sony LYT-500 సెల్ఫీ కెమెరా ఉంది. 8K 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.

Also Read: బంగారం, విలువైన వస్తువులు బ్యాంక్‌లో పెడుతున్నారా? బ్యాంక్ లాకర్లు పూర్తిగా సురక్షితం కాదు.. ఎందుకంటే

బ్యాటరీ, కనెక్టివిటీ

5200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5G, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, USB Type-C ఉన్నాయి. బరువు 186 గ్రాములు, మందం 6.99mm మాత్రమే.

 

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×