Big Stories

Infinix GT 20 Pro And GT Book Launch : ఇన్‌ఫినిక్స్ నుంచి గేమింగ్ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్.. మే 21న లాంచ్!

Infinix GT 20 Pro And GT Book Launch : ఇన్‌ఫినిక్స్ భారతదేశంలో Infinix GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్, GT బుక్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనుంది. గేమింగ్-సెంట్రిక్ హ్యాండ్‌సెట్‌ను సౌదీ అరేబియాలో ఏప్రిల్‌లో ఆవిష్కరించారు. Infinix GT 20 Pro, MediaTek Dimensity 8200 Ultimate SoC, 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ప్రత్యేకమైన X5 టర్బో గేమింగ్ చిప్‌ని కలిగి ఉంది. Infinix GT 20 Pro, Infinix GT బుక్ రెండూ RGB లైటింగ్‌ను కలిగి ఉంటాయి. వీటిలోని ఫీచర్లు ఇతర విషయాల గురించి తెలుసుకోండి.

- Advertisement -

infinix తన GT Verse లైనప్‌లో మే 21న భారతదేశంలో Infinix GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్ ,GT బుక్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. హ్యాండ్‌సెట్ సైబర్ మెకా డిజైన్, 144Hz AMOLED స్క్రీన్, మల్టిపుల్ కలర్‌లను LEDలు కలిగి ఉంటుంది. రెండవది, GT బుక్ సైబర్ మెకా డిజైన్, RGB మెచా బార్  RGB కీబోర్డ్‌తో ప్రారంభమవుతుంది. ఈ నెలలో వీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Also Read : పోకో నుంచి చీపెస్ట్ ఫోన్.. అదిరిపోతున్న ఫీచర్లు!

స్మార్ట్‌ఫోన్ సైబర్ మెకా డిజైన్, 144Hz AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ ఎనిమిది కలర్స్‌లో నాలుగు లైటింగ్ ఎఫెక్ట్‌లను అందిస్తుంది. ఇందులో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది. మరోవైపు, GT బుక్ సైబర్ మెకా డిజైన్, RGB మెచా బార్, RGB కీబోర్డ్‌తో కూడా ప్రారంభమవుతుంది. లాంచ్‌లో గేమింగ్ హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ మౌస్‌లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

GT 20 Pro 6.78-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను 1,300నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పొందవచ్చు. హుడ్ కింద, హ్యాండ్‌సెట్ Mali-G610 MC6 GPUతో డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌ను కలిగి ఉంటుంది. ఇది Android 14 ఆధారంగా HiOS 14లో రన్ అవుతుంది. ఫోన్ 45W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో రావచ్చు. ఇందులో 32MP సెల్ఫీ కెమెరా,108MP OIS ప్రైమరీ కెమెరా రింగ్ లైట్ ఫ్లాష్‌తో కలిగి ఉండవచ్చు.

Also Read : టెక్నో నుంచి ఒకేసారి నాలుగు 5G ఫోన్లు.. కెమెరా చూస్తే షాకే!

GT బుక్ 16-అంగుళాల 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్మూత్ గేమింగ్ కోసం i9-13900H CPUతో పాటు Nvidia GeForce RTX 4060 GPU వరకు అందించే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్ 190W ఛార్జింగ్ సపోర్ట్‌తో 70Wh బ్యాటరీని పొందవచ్చు. ఇది మెకా గ్రే, మెకా సిల్వర్ షేడ్స్‌లో వస్తుంది. ఇవి కాకుండా కంపెనీ MagCase, కూలింగ్ ఫ్యాన్, RGB మ్యాట్, RGB హెడ్‌ఫోన్‌లు, RBG మౌస్, ఫింగర్ స్లీవ్‌లను తీసుకురావచ్చు. వీటిని ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News