BAN VS PAK: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య నిన్నటితో టెస్ట్ సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ రెండు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్ ను వైట్ వాష్ చేసింది. ఈ క్రమంలో టైటిల్ అందుకున్న బంగ్లాదేశ్ ప్లేయర్లు.. గ్రూప్ ఫోటో దిగారు. అయితే ఈ గ్రూప్ ఫోటోకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముస్తాక్ అహ్మద్ దూరంగా ఉన్నాడని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని మీడియా ముందు ముస్తాక్ అహ్మద్ ( Coach Mushtaq Ahmed) కూడా ప్రకటించాడు. ముస్తాక్ పాకిస్తాన్ దేశస్తుడు. ఈ క్రమంలో తన జట్టు ఓడిపోవడాన్ని తట్టుకోలేక, ఫోటో దిగబోనని ప్రకటన చేశారు.
కానీ ఇవాళ ఉదయం నుంచి, బంగ్లాదేశ్ ప్లేయర్లతో స్పిన్ బౌలింగ్ కోచ్ ముస్తాక్ అహ్మద్ కలిసి దిగిన గ్రూప్ ఫోటో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ ఓడిపోతే, ఎంతో హ్యాపీగా ముస్తాక్ ఉన్నాడని పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముస్తాక్ అహ్మద్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో పుట్టిన ప్రతీ వెధవా..ఇలాగే ఉంటారని ఆడుకుంటున్నారు. కుక్క తోక ఎప్పుడూ వంకరే అంటూ ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ లో మళ్లీ అడుగుపెడితే, చంపేస్తారన్న కోపంతో గ్రూప్ ఫోటోపై బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముస్తాక్ అహ్మద్ డ్రామాలు ఆడినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ ఓటమి జీర్ణించుకోలేక… బంగ్లా ప్లేయర్లతో ఫోటో దిగడం లేదని మీడియా ముందు ప్రకటించి… దొంగ చాటున వాళ్లతో ఫోటో దిగాడని ముస్తాక్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్స్.
బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముస్తాక్ అహ్మద్ పాకిస్తాన్ దేశస్థుడు అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2024 నుంచి బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ కోచ్ గా పని చేస్తున్నాడు ముస్తాక్ అహ్మద్. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ కోచ్ గా పాకిస్తాన్ విజయాన్ని ఎంజాయ్ చేయాలి… అదే సమయంలో ఆ దేశ పౌరుడిగా బాధపడాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇంత దారుణంగా పాకిస్తాన్ ఓడిపోతుందని తాను అనుకోలేదని చెప్పుకొచ్చారు. అందుకే బంగ్లాదేశ్ విజయోత్సవాలలో తాను పాల్గొనలేదు… గ్రూప్ ఫోటో కూడా వాళ్లతో దిగలేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఈయన ఈ ప్రకటన చేసి 24 గంటలు గడవకముందే సీన్ రివర్స్ అయింది. బంగ్లాదేశ్ ప్లేయర్లతో కలిసి ముస్తాక్ అహ్మద్ దిగిన ఫోటోను కొంతమంది వైరల్ చేశారు. పాకిస్తాన్ ఓటమిని ఎంజాయ్ చేస్తున్నాడని అతని దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ లో పుట్టిన ప్రతి వెధవ… ఇలాగే రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తారని మండిపడుతున్నారు. పాకిస్తాన్ ఓటమిని ఎంజాయ్ చేస్తే, తన దేశం నుంచి తన్ని తరిమేస్తారని.. గ్రూప్ ఫోటో దిగలేదని డ్రామాలు ఆడినట్లు కౌంటర్లు ఇస్తున్నారు.